ఒంటరితనం
- Yasoda Gottiparthi

- Sep 19
- 2 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #Ontarithanam, #ఒంటరితనం, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Ontarithanam - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 19/09/2025
ఒంటరితనం - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“ఏమండీ!ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చేప్పుడు చిన్న టేప్ రికార్డర్ కొనుక్కుని వస్తారా?” అని పలుసార్లు చెప్పింది రేఖ.
“మనకు రెండు టేప్ రికార్డర్ లు.. అవే పిల్ల రాగాలు ఇద్దరు ఉన్నారు.”
“ఇలాంటివి చెప్పడానికి మాటలు వెతుక్కోకుండా వస్తాయి. కానీ డబ్బు సంపాదించటానికి మార్గాలు మాత్రం దొరకవు.”
“ఏమిటే నువ్వు చెప్పేది.. డబ్బులు లంచాలు తీసుకోవడం, అడ్డ మార్గాల్లో నడవడం నా వల్ల కాదు. ఏదీ వెనుకకు తిరుగు చెప్తా”
“ఇందుకు మాత్రం తగ్గేదేమీ లేదు. మూరెడు మల్లెదండతో, మురిపించి ముగ్గులోకి దింపడానికి.”
“ఒక స్త్రీ కి కావలిసిన సంతోషం అదే, నీకు అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ దూరం చేసుకుని, భర్తను ప్రక్క త్రోవ పట్టించి, చివరకు ఆవేదనల పాలు అవుతారు.”
“మీరెన్ని చెప్పినా మీరు నాకొరికలు అన్నీ తీరిస్తెనే నా మీద ప్రేమ ఉన్నట్లు”
“అయితే నాప్రేమ నీకు అక్కరలేదా?.. నీకు కావలసినవి వస్తువులే కదా!”
ఒకరోజు ఇంటినిండా ఫర్నీచర్ తో టీవీ తో అన్నీ వస్తువులు వచ్చి చేరాయి. పిల్లల చదువులన్ని అటకెక్కాయి. బుద్ధి బూడిద అయింది. అయినా పట్టించు కోలేదు.
పిల్ల స్కూల్ రిపోర్టులో మార్కులు తగ్గి పోయాయి టీచర్స్ దగ్గరనుండి కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి. ఎవ్వరినీ లెక్కపెట్ట లేదు. సంవత్సర పరీక్షల్లో తప్పారు. అయినా బాధ పడలేదు.
పక్కింటి వాళ్ళు బర్త్డే పార్టీకి పిలవగానే సంతోషించింది.
పిల్లలని రమ్మంటే ఇంట్లోనే బాగుంది మే మెక్కడికి రాము అన్నారు.
ఒక్కతే వెళ్ళింది. అక్కడ వాళ్ళందరూ పిల్లలూరాలేదని అడగడo ముఖం చిన్నబుచ్చు కుని ఏమీ చెప్పలేక. అప్పుడు అర్థమయింది వాళ్లకు సెల్ఫోన్ లు, టివి, టేప్ రికార్డర్ లు తప్ప తనంటే ప్రేమలేదని, తన మాట మీద గౌరవం లేదు అనీ తెలుసుకుంది. అయినా పిల్లల్ని మార్చలేక పోయింది.
కొన్ని రోజుల తర్వాత దగ్గరి చుట్టాల నుండి పెళ్లికి రమ్మని పిలుపు వచ్చింది.. భర్తను పెళ్లికి వెళ్దామని తయారు కమ్మని వెంట పడింది.
“ఆఫీస్ లో చాలా పని ఉంది సెలవు ఇవ్వరు” అన్న భర్తతో
“ఆపని తరువాత చేసుకోవచ్చు అండి. రెండు రోజులు సెలవు పెట్టండి” అన్నది.
అయినా “కుదరదు. నేను ఆదివారాలు కూడా పనిచేయాలి. ఇప్పటినుండి అలాంటి సంతోషాలకు దూరం గా ఉండు. నువ్వు కొన్న వస్తువులన్నీటికీ "ఈ ఏం ఐ".. లు కట్టాలంటే చాలా సంవత్స రాల వరకు ఎక్సట్రా డ్యూటీ చేయాల్సిందే. ఆ వచ్చిన డబ్బులు ఈ వస్తువులకు వాయిదా పద్ధతుల తీసుకున్న వడ్డీలు కట్టవలసినదే. నేనెక్కడికి రాను” అని ఖచ్చితంగా చెప్పేసరికి, తాను ఒక్కతే పెళ్లికి వెళ్ళగానే, అక్కడి వారందరూ భర్తను, పిల్లలను తీసుకుని రానందుకు వింత పక్షిని చూసినట్టు చూడడం తో రేఖ మనసు చాలా బాధ పడింది.
అనవసర విలాసాలకు పోయి స్వచ్ఛమైన ప్రేమను ద్వేషిoచాను.. స్వచ్ఛమైన ప్రేమను తుచ్ఛమైన కోరికలకు లొంగ దీసుకున్నాను. ఎదుటివారితో పోల్చుకుని, వలపు ప్రేమ, వంచల్ని సరిగా అర్థం చేసుకోలేని బలహీనతే తన వైవాహిక జీవితంలో వైఫల్య ముగా పరిణమించింది అని పశ్చాతాప పడింది.
ఇరుగు పొరుగు వారంతా 'ఎంతో ప్రేమించే భర్తను చేసుకుని పొందిన లాభం ఏముంది? అందమైన అనురాగ బంధాలను దూరం చేసుకుని ఒంటరితనం మిగిలింది.. రోజులు మారాయి’ అని ముక్కు మీద వేలేసుకున్నారు.
సమాప్తం.
******************
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments