పక్షుల పాఠాలు
- Gadwala Somanna
- Nov 7, 2024
- 1 min read
Updated: Nov 20, 2024
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Pakshula Pataalu, #పక్షుల పాఠాలు

Pakshula Pataalu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 07/11/2024
పక్షుల పాఠాలు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
చెట్టు మీద కోయిలమ్మ
తీయని గీతి పాడింది
విన్న వారికందరికీ
ఆనందమే పంచింది
పురి విప్పిన నెమలమ్మ
ఘన నాట్యమే చేసింది
చూచు వారికందరినీ
కడు కనువిందు చేసింది
పచ్చని రంగు చిలుకమ్మ
జామ కాయ చూసింది
ఎంచక్కా దానిని
ఇష్టంగా ఆరగించింది
నింగిలో పావురాయి
స్వేచ్ఛగా విహరించింది
విశ్వశాంతి సందేశం
అందరికీ తెచ్చింది
గూటిలోని కోడిపుంజు
గొంతెత్తి కూసింది
సోమరితనం వీడమని
వినయంగా చెప్పింది
-గద్వాల సోమన్న
Comments