top of page
Original.png

పరోపకారులు

Updated: Jan 21

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Paropakarulu, #పరోపకారులు

ree

Paropakarulu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 08/01/2025

పరోపకారులుతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


పారుతున్న యేరులు

ప్రాకుతున్న తీగలు

పరహితమే కోరును

ఫలాలిచ్చు తరువులు


వెలుగుతున్న దివ్వెలు

సొగసులీను పువ్వులు

పరహితమే కోరును

రవళించే మువ్వలు


పంటలిచ్చు పొలములు

జలములిచ్చు చెరువులు

పరహితమే కోరును

శ్రావ్యమైన గళములు


నిగ్గుతేల్చు కలములు

తేట తెలుగు పదములు

పరహితమే కోరును

మంచి వారి తలపులు


మేఘమాల జల్లులు

వెన్నెలమ్మ వెలుగులు

పరహితమే కోరును

రైతన్నల మనసులు


నింగిలోని చుక్కలు

పుడమిలోన మొక్కలు

పరహితమే కోరును

ఎగురుతున్న పక్షులు


సంఘజీవి చీమలు

కోడిపుంజు అరుపులు

పరహితమే కోరును

నెమలికున్న ఈకలు


కాళ్లకున్న చెప్పులు

కళ్ళుకున్న  రెప్పలు

పరహితమే కోరును

చేతిలో పొత్తములు



-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page