top of page

పోరాట యోథుడు



'Porata Yodhudu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 17/07/2024

'పోరాట యోథుడు' తెలుగు కథ

రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


“రెండు రోజుల్లో మీ శలవు ముగుస్తోంది. మళ్లీ ఎప్పుడొస్తారండి?” అడిగింది శార్వరి తన భర్త మల్లిక్ ని. 


“ఏమోనోయ్ !మా ఉద్యోగాలంతే. ఎప్పుడు ఎక్కడికెళ్లి మేం డ్యూటీలు చేయాలో మాకే అర్ధంకాదు. ఏమన్నా యుధ్ధాలు, గొడవలు అయితే మేము క్షణం ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండదు. మేం దేశం కోసం మా జీవితాలనే ఫణంగా పెడతాము. అటువంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. చెప్పు. ఆతల్లి ఋణం తీర్చుకునే అపురూపమైన అవకాశం మాకు దక్కుతోంది “ అన్నాడు మల్లిక్ శార్వరితో. 


 దేశ సరిహద్దులలో వీరజవానుగా పనిచేస్తున్న మల్లిక్ పండగ శెలవులకని తన వాళ్లవద్దకు వచ్చాడు. తల్లి తండ్రులు, భార్య శార్వరి, పదినెలల చంటిబిడ్డ శివాజి మారుమూల తన స్వగ్రామంలో ఉంటున్నారు. మల్లిక్ పంపే డబ్బే వాళ్లకి ఆధారము. 


భర్త తన ఉద్యోగానికి బయలుదేరుతుంటే చాలా దిగులుగా, విచారంగా ఉన్న భార్యని దగ్గరకు తీసుకుని అనునుయించి ధైర్యం చెప్పాడు మల్లిక్. భర్త ఓదార్పుతో కాస్త మనోధైర్యం వచ్చింది శార్వరికి. వృధ్ధులైన తల్లితండ్రులకు నమస్కరించి వాళ్లకు తగుజాగ్రత్తలు చెప్పాడు మల్లిక్. ఊయలలో ఉన్న తన కొడుకు శివాజిని ఎత్తుకుని ముద్దాడి వాడి బోసినవ్వులను తన గుండెలనిండా నింపుకున్నాడు. ఇంట్లోని వాళ్లకు, ఊర్లోని అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరి తను ఉండే ప్రాంతానికి రెండు రోజుల తర్వాత చేరుకున్నాడు మల్లిక్. 


యధావిధిగా తోటి ఉద్యోగులతో కలిసిపోయి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు మల్లిక్. మూడేళ్లనుంచి ఆ ఉద్యోగం చేస్తున్నా దానిని ఏనాడూ అతను ఉద్యోగంగా భావించలేదు. వృత్తినే తన ప్రాణంగా భావించే దేశభక్తుడు మల్లిక్. తన కొడుక్కి తనకిష్టమైన “శివాజి” అని పేరు పెట్టుకుని తనలోని వీరత్వాన్ని, ధీరత్వాన్ని, దేశభక్తిని తరచూ స్మరించుకుంటూ ఉంటాడు మల్లిక్. 


ఒకరోజున సరిహద్దుల్లో ఒక సొరంగాన్ని ధ్వంసం చేసే పనిలో తవ్వకాలు మొదలుపెట్టారు మల్లిక్, అతని తోటి జవాన్లు. చాలా రోజులనుంచి ఆ ప్రక్రియ కోనసాగుతున్న దశలో అందరూ లోతైన ఆ సొరంగం లోపలికి పడిపోయారు. అందరూ ఒక్కసారి తమ కాళ్లక్రింద భూమి కదిలిపోయినట్లై తల్లడిల్లిపోయారు. లోపల చిమ్మచీకటి. బయటికి వచ్చే మార్గము‌, అవకాశమే లేదు. వాళ్లు తమ ప్రాణాలమీద ఆశ వదులుకున్నారు. తాము మృత్యువు కోరల్లో చిక్కుకున్నాము. ఇంక దానినుండి తప్పించుకుని మృత్యుంజయులై బాహ్య ప్రపంచంలోకి రాలేము అని మనసులో అనుకున్నారు. 


 అయినా వాళ్లు తమ మనోధైర్యాన్ని వీడలేదు. ” ధైర్యే సాహసే లక్ష్మీ” అని అందరూ గుర్తుచేసుకున్నారు. ఆ సొరంగం లోనే యోగాచేసి, ప్రాణాయామం చేసి, బాట్మింటన్ వంటివి ఆడి అందరూ ఒకళ్లకొకళ్లు ధైర్యం చెప్పుకుఃటూ గడుపుతున్నారు. ఇలా రెండు రోజులయ్యాక త్రాగేందుకు నీరు లేక, శరీరంలో జవసత్వాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. 


 సైనికులకు ఏర్పడిన ప్రమాదం తెలిసినప్పటినుంచి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. వాళ్లకు ఊపిరి ఆడేందుకు ఆక్సిజన్ ని ఒక ట్యూబ్ ద్వారా నిరంతరం సరఫరా చేసింది. ఆహార పదార్థాలను ద్రవరూపంలో, టాబ్లెట్ ల రూపంలో సరఫరా చేసి వాళ్ల ప్రాణాలను నిలుపుతూ వాళ్లకి మనోధైర్యాన్ని ఇస్తోంది. 


సైనికులు తమ కుటుంబాలను గుర్తుచేసుకుని ఒకళ్లనొకళ్లు ఓదార్చుకుంటూ ఉంటున్నారు. తమ గుండెలనిండా అంతులేని మనోధైర్యాన్ని నింపుకుంటున్నారు. యోగా, ప్రాణాయామం, ఆటపాటలు నెరుపుతూ భగవధ్యానాన్ని ఎన్నడూ వీడనాడలేదు. మల్లిక్ కి, తన సాటి సైనికులకు ఏర్పడిన ప్రమాదాన్ని ప్రసారమాధ్యమాలలో వింటూ శార్వరి గుండె ఆగినంతపనయింది. గుండెలవిసేలా భోరున ఏడ్చింది. మరుక్షణమే బోసినవ్వులు నవ్వుతున్న తన ఒడిలోని శివాజిని చూసి తనకి తానే ధైర్యాన్ని తెచ్చుకుంది. తన మనసుకు నిబ్బరం తెచ్చుకుని వృధ్ధులైన తన అత్తామామలను ఓదార్చి వాళ్లకి ధైర్యం చెప్పింది. 


ప్రభుత్వం ఎలాగైనా తమ సైనికుల ప్రాణాలను కాపాడుకోవటానికి, వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి వివిధ చర్యలు చేపట్టి ఆ దిశగా అహర్నిశలు కృషిచేస్తోంది. ఇలా 18రోజులు సైనికులు ఆ సొరంగంలో కాళరాత్రులు గడిపారు. ప్రభుత్వం విదేశాలనుంచి ఇటువంటి వాటిల్లో అనుభవగ్నులైన ఆయన్ని తీసుకొచ్చింది. ఆయన చెప్పిన ప్రకారం అత్యాధునిక యంత్రాలనుపయోగించి వాళ్లను అత్యంత జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చింది. మృత్యుంజయులై అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటకు రాగలిగారు. వాళ్లని వెంటనే వివిధ అంబులెన్స్ లలో మంచి హాస్పిటల్ లలో చేర్చి చికిత్స చేశారు. 


 తమ వాళ్లందరూ మృత్యుకోర‌లనుంచి క్షేమంగా బయటపడ్డందుకు ప్రభుత్వంతో సహా, వాళ్ల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శార్వరి మనసంతా సంతోషంతో నిండిపోయింది. ప్రభుత్వం కొన్నాళ్లు వాళ్లకు శెలవులిచ్చి అందరిని వాళ్ల వాళ్ల వాళ్ల స్వస్ధలాలకు పంపింది. “బ్రతుకుజీవుడా !”అనుకుంటూ అందరూ తమ ఇళ్లకు చేరి తమ భార్యాబిడ్డలతో సంతోషంగా గడిపారు. అందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యావత్ప్రపంచం, ప్రధాని ఆ వీర సైనికులను కొనియాడారు. ప్రభుత్వం ఆ సైనికులను ఘనంగా సత్కరించింది. అందరూ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 


మల్లిక్ ని చూసిన శార్వరి అతన్ని హత్తుకుని ఏడ్చింది. మల్లిక్ తన భార్యని ఓదార్చి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. కిలకిలా నవ్వుతూ అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది శార్వరి. ఇదేమీ తెలీని ఆ బోసినవ్వుల శివాజి పకపకా నవ్వాడు. తృళ్ళిపడి మల్లిక్ తన కొడుకు నెత్తుకుని ముద్దాడాడు. తన కోసం కళ్లు కాయలు కాసేలా వేయికళ్లతో ఎదురుచూసున్న తన తల్లితండ్రులను హత్తుకుని వాళ్లనోదార్చి అనునయించాడు మల్లిక్. 


 అత్యంత క్లిష్టమైన మృత్యుకోరలనుండి తప్పించుకుని పోరాట యోథునిగా తమ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చిన తమ కొడుకుని చూసి సంతోషపడుతూ ఆ భగవంతునికి చేతులు జోడించి నమస్కరించారు మల్లిక్ తల్లితండ్రులు. 


.. సమాప్తం .. 

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.


గత  5సం.. నుంచి  “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో  నేను కధలు  వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో  నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక  ప్రశంసలు లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు🙏. 


ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery




34 views0 comments

Comments


bottom of page