top of page
Original.png

ప్రాజ్ఞ

Feb 16, 2024
1 min read


'Praajna' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 16/02/2024

'ప్రాజ్ఞ' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


ఎలనాగ ఒకతి ఎదురొచ్చి నిలిచింది

వంపు సొంపుల వయ్యారి ఇంపుగా కనిపించ

మతిపోయి నట్టయి కుతి దీర చూశాను

నాభి అందము గనునట్టు నేత్రము ధరించె

మూడు వంకల ముద్దుగుమ్మ జాడ యెరుగ

జానువు నంటెడి చికుర జాలాలము ఆమెది

ఆ కురుల నిండ విరులు కూర్చియుండె

పల్లవోధర పలుకులకుల్లముప్పొంగె

ఉండి లేనట్లు అంతరాళముండె

అనిమిష నేత్ర అందమె అందము

పెదవిప్పి పలికితి చామచిరంటి పేరేమియంటు

తెలిసికొనగోర తెలిపెదనంటు కటాక్ష దృష్టితో                                  

డాపలి గండకము పైనున్న దేహ దీపమును జూపె

ఊఢవా నీవన్న అంబరాంతము కదిలించి కంఠసూత్రము జూపె

బిడ్డలా నీకన్న నింగిపై నొకవేలు నేలనొక వేలు జూపె

తెలివి మీరినదని తెలుసు కొంటి తెల్లమొగమేస్తి.

పరుల సొత్తనుకుంటు పరుగు దీస్తి---

( ఇంతకూ ఆ కాహళి పేరేమిటో ఊహించండి )                                                    

ప్రాజ్ఞ అంటె తెలివిగల స్త్రీ., నేత్రం=వస్త్రము, జానువు=మోకాలు, అనిమిష=చేప, ఊఢ=వివాహిత, అంబరాంతము=పైచెరుగు- పల్లవోధర = చిగ్రుటాకులాంటి పెదవులు అంతరాళము=నడుము, కొంగు, చామచిరంటి=జవరాలు, డాపలి=ఎడమవైపు, గండము=చెక్కిలి, దేహదీపము=కన్ను, నింగి నొకవేలు అంటే ఒక కొడుకని, నేలనొక వేలు అంటె ఒక బిడ్డని, కాహళి=యౌవన స్త్రీ.


--సుదర్శన రావు పోచంపల్లి


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page