ప్రబోధం
- Gadwala Somanna
- Dec 20, 2024
- 1 min read
Updated: Jan 1
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ప్రబోధం, #Prabodham

Prabodham - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 20/12/2024
ప్రబోధం - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
కరి మబ్బులు క్రమ్మినా
విరి జల్లులు కురిసినా
వ్యక్తిత్వం కోల్పోకు
సిరిసంపదలు హెచ్చినా
నష్టాలే వచ్చినా
కష్టాలే తెచ్చినా
గుండె ధైర్యం వీడకు
ఆందోళన చెందకు
అపజయం ఎదురైనా
నిరాశ ఆవరించినా
ఆశయం వదిలేయకు
గమ్యాన్ని మరచిపోకు
అపనిందలు వేసినా
అన్యాయం గెలిచినా
కుమిలి కుమిలి ఏడ్వకు
చీకట్లో కూర్చోకు
దౌర్జన్యం చేసినా
అక్రమానికి పాల్పడిన
మౌనంగా రోధించకు
పిరికితనం చూపించకు
స్థితిగతులు మారినా
హీనదశ ఏతెంచినా
కర్తవ్యం మానేయకు
క్రమశిక్షణ తప్పిపోకు
-గద్వాల సోమన్న
Commentaires