top of page

ప్రశ్నించే గొంతుక కావాలి!

Updated: Dec 26, 2024

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ప్రశ్నించేగొంతుకకావాలి, #PrasnincheGonthukaKavali


ree

Prasninche Gonthuka Kavali - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 18/12/2024

ప్రశ్నించే గొంతుక కావాలి - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


ప్రశ్నించే గొంతుక

అభివృద్ధికి సూచిక

అదే లేకపోతే

మనుగడ అధోగతే!


ప్రశ్నించే తత్వము

అలవర్చుకోవాలి

విద్యార్థులకవసరము

పురోగతికి మార్గము


సిగ్గులేని సమాజాన్ని

నిగ్గుతేల్చే గళము

స్వార్థపరుల నైజాన్ని

కడిగివేసే కలము


కావాలి కావాలి

స్పందించే హృదయము

రావాలి రావాలి

మదిలో చైతన్యము


ప్రశ్నించక పోతే

అత్యంత ప్రమాదము

కనువిప్పు రావడం

నిజముగా దుర్లభము


మన హక్కుల కోసము

సమ సమాజం కోసము

ఎంతైనా అవశ్యము

జన జాగృతి కోసము


-గద్వాల సోమన్న



Comments


bottom of page