top of page

ప్రయత్నం - ఫలితం

#KalamKathaKeerthidhar, #కలంకథకీర్తిధర్, #PrayathnamFalitham, #ప్రయత్నంఫలితం, #TeluguStories, #తెలుగుకథలు


Prayathnam Falitham - New Telugu Story Written By Kalam Katha Keerthidhar

Published In manatelugukathalu.com On 16/02/2025

ప్రయత్నం - ఫలితంతెలుగు కథ

రచన: కలం కథ కీర్తిధర్


ఉపోద్ఘాతం: మనిషికి ప్రతిదానికి మంచి ఫలితం కావాలి, కానీ దానికి తగినట్లు ప్రయత్నిస్తున్నాడా? ఈ ప్రశ్నలో నుంచే పుట్టింది నా ఈ కథ. 



శ్రిధర్: ఎలా ఉన్నావు రా రిషి?


రిషి: బాగానే ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావు?


శ్రిధర్: బాగున్న రా. ఏమైంది? ఇలా డల్ గా ఉన్నావు, ఇంతకు ముందులా లేవు?


రిషి: బాధపడుతున్నా. 


శ్రిధర్: ఎందుకు రా?


రిషి: ఉద్యోధం కోసం. 


శ్రిధర్: సాప్ట్వేర్ ఉద్యోగం చేయి రా మంచి జీతం. 


రిషి: నాకు ఆసక్తి లేదు రా. నేను కొద్దిసేపు చెరువు దగ్గరకు వెళ్ళొస్తా. 


శ్రిధర్: సరే రా. 


---


నాలుగు కొండల చుట్టూ అందంగా విస్తరించి ఉన్న ఆ చెరువు ప్రకృతిని మించిన సౌందర్యం లేదు అనిపిస్తోంది. రిషి ఆ చెరువు దగ్గరికి చేరి ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడ ఒక మధ్య వయస్సు గల వ్యక్తి (రాజు) చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్దిసేపు గడచిన తరువాత అందరూ రాజును ఎమయ్యా రాజు, అక్కడ సరిగ్గా చేపలు పడవు. ఈ వైపు కి వచ్చి చూడు అని అన్నారు, ఎన్ని చేపలు పడతున్నాయో అని అన్నారు. 


ఇదంతా గమనిస్తున్న రిషి నెమ్మదిగా లేచి ఆ మత్స్యకారుని పక్కన కూర్చున్నాడు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది:


రిషి: ఇదిగో పెద్దాయన, వాళ్ళు అందరూ అక్కడ బాగా చేపలు పడుతున్నాయి అని చెప్పుతున్నారు కదా. అటు వైపు వెళ్ళవచ్చు కదా. 


రాజు: లేదు బాబు, నాకు ఇక్కడ మంచి చేపలు పడతాయి అని నమ్మకం ఉంది. అందుకే ఇక్కడే ఉన్నాను. 


రిషి: నీది కూడా నా కథ లాగే ఉంది పెద్దాయన. 


రాజు: నీకు ఏమైంది బాబు. 


రిషి: నేను ఇలా అందరూ సాఫ్ట్‌వేర్‌లో మంచి జీతాలు ఉన్నాయని వినకుండా నాకు మెకానికల్ జాబ్ చేయాలంటూ మొండిపట్టు పట్టి కూర్చున్నాను. 


రాజు: మరి ఏమైంది, వచ్చిందా నీకు నచ్చిన ఉద్యోగం. 


రిషి: ఎక్కడ పెద్దాయన, 2 ఏళ్లు అయ్యింది. ఇంకా లేదు. 


రాజు: (నవ్వుతూ.. ) సరే సరే. 


రిషి: నవ్వుతావు ఏంటి పెద్దాయన?


రాజు: నీకు ఇంటి దగ్గర ఏ పని లేకపోతే ఒక గంట ఇక్కడ ఉండవా


రిషి: హా, నాకు ఏ పని లేదు, ఇక్కడే ఉంటా


(సమయం గడిచింది. మిగతా అందరూ మంచి చేపలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. రాజుకు ఇంకా చేపలు పడలేదు. )


రిషి: ఓ పెద్దాయన, నువ్వు కూడా అటు వైపు వెళ్ళి చేపలు పట్టొచ్చు కదా. 


రాజు: ఇంకొంచెం సేపు ప్రయత్నిద్దాం బాబు, తప్పేముంది అన్నాడు. 


రిషి: ఏంటో పెద్దాయన, నువ్వు అసలు అర్థం కావట్లే. 


రాజు: బాబు, ఒకసారి ఇటు చూడు. 


రిషి: ఏమిటి పెద్దాయన, ఒక చేపకి ఇంత ఆనందమా అన్నాడు. 


రాజు: బాబు, ఇది చాలా ఖరీదైన చేప. వాళ్ళు పట్టిన అన్ని చేపల కంటే ఇది ఖరీదు ఎక్కువ. 


రిషి: మంచిది పెద్దాయన, నన్ను ఎందుకు ఉండమని చెప్పావు అది చెప్పు. 


రాజు: చూడూ బాబు, నా కథ నీది అన్నావు కదా. ఇప్పుడు నేను కూడా వాళ్ళు చెప్పిన విధంగా ఆ పక్కకి వెళ్ళి చేపలు పట్టి ఉంటే నాకు ఎన్నో చేపలు దొరికేవి. కానీ నాకు నా మీద నమ్మకం, ఇక్కడ ఈ ఖరీదైన చేప దొరుకుతుంది అని. అలాగే నువ్వు కూడా ఎవరొ చెప్పారంటే నీ చదువుకి సంబంధం లేని కొలువు చేయవద్దు. నీకు నమ్మకం మరియు నీ బలం అయిన నీ మెకానికల్ జాబ్ చేయి. ఏదో ఒకరోజు మంచి స్థాయిలో ఉంటావు. 


రిషి: చాలా బాగా చెప్పావు పెద్దాయన, నాలో ఉన్న సందేహాలను తీర్చావు, నా కళ్ళు తెరిపించావు. 


రాజు: చివరగా ఒక మాట బాబు. 


రిషి: చెప్ఫు పెద్దాయన. 


రాజు: ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఫలితం కాదు. కాబట్టి ప్రతి చిన్నదానికి నిరాశ చెందకు అంటు నవ్వుతూ వెళ్ళిపోయాడు. 


---


నీతి:


జీవితంలో ఎవరో ఏదో చెప్పారు, అన మనలను మనం మార్చుకోకూడదు. మనకు నమ్మకం ఉన్న దానిపై గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు మంచి ఫలితాన్ని చూస్తాము. (ప్రయత్నానికి ఫలితానికి మధ్య ఉన్న పరస్పర సంబంధం చెప్పడమే నా ఈ కథ యొక్క ప్రధాన ఉద్దేశం. )

***


కలం కథ కీర్తిధర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

Profile Link:

కలం పేరు: కలం - కథ - కీర్తిధర్

మంచి సందేశం నా ఉద్దేశం ❤️

Comments


bottom of page