top of page

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3


'Premante Idena Part 3' - New Telugu Web Series Written By Penumaka Vasantha

'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3' తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

జరిగిన కథ:


విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది. పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ.


వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది విరిజ. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటారు.

ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. వారికి సహాయం చేస్తుంటాడు.


ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2 చదవండి.


"అయినా, మన కన్నాంబ, బాగా, స్ట్రిక్ట్, కదా! బాగా, ప్రిపేరవ్వూ" అంది పద్మ నన్ను, ఉద్దేశించి, నవ్వుతూ.

"అవును, పద్మ, చంపుతుందీ! ఈ కన్నాంబ, చదువనీ.. ! నవ్వుతూ, నన్ను చూస్తూ, అంది రాజీ. చంపుతా, నిన్నూ! నేను బుక్ తీసేసరికి, "వద్దే అంటూ, పరుగు తీసింది".

"పద్మా, ఆ బిసి, ఆనంద్, బ్యాంక్ లో భలే హెల్ప్ చేశాడే. బాగుంటాడు, మంచి జాబ్, కూడా ఉంది. ఎవరు చేసుకుంటారో! లక్కీ నే వాళ్ళు" అంది.


పద్మ కూడా, నిజమే, రాజీ! ఆనంద్ చాలా మంచివాడు, ఎవరోనే! ఆ లక్కీ గాల్ అంది.

"రాజీ అతన్ని ఎవరు చేసుకుంటే మనకెందుకే మన పని అయింది కదా. ! మగవాళ్ళు అందరూ ఒకే జాతి మోసం చేసే జాతి. ఇంకా నీకు బుద్ది రాదే. ప్రేమని వెంటపడతారు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మొహం చాటు చేస్తారు. పెళ్లి ముందు ప్రేమ కన్నా పెళ్లి తర్వాత ప్రేమ గొప్పది" అన్నాను.

"వామ్మో! కన్నాంబ, క్లాస్ తీస్తుందని", పద్మ ఫోన్ పెట్టింది.


"నిజమే నన్ను రవి మోసం చేశాడు" అంటు బాధ పడిన రాజీ ని హ్యాపీ గా ఉంచటం కోసం రిలీఫ్ గా హోటల్ కి తీసుకెళ్ళాను ఒక కప్ కాఫీ తాగి రూం కి వెళ్ళాము.

రోజులు గడుస్తున్నాయి. నా ఎంఏ ఫస్ట్ యియర్ అయింది. రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. దానికి హైదరాబాద్ లో పోస్టింగ్ రావటం తో, అది వెళ్ళింది. వెళ్లేప్పుడు "విరిజా! నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనే. అదే మన ఊళ్ళో ఉంటే ఏడుస్తుండేదాన్ని. ఇక్కడికి వచ్చి ఈ బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నా అంది. ఇదంతా, నీ వల్లనే" అంటూ, నన్ను కౌగిలించుకుంది.

"ఫ్రెండ్స్ లో ఏంటా.. రుణాలు తీర్చుకోవటం అపుడప్పుడు కాల్ చేస్తుండవే.. చాలు అన్నాను. "

వెళ్ళే ముందు ఆనంద్ ని కలిసి థాంక్స్ చెప్దామని బ్యాంక్ కి వెళ్ళాము. ఆనంద్ రాజీకి బ్యాంక్ జాబ్ వచ్చినందుకు రాజీకి కంగ్రాట్స్ చెప్పాడు. పార్టీ ఎపుడు అంటే "ఈవెనింగ్ బీచ్ దగ్గర హోటల్ కు రండన్న" రాజీ తో "తప్పక వస్తాను" అన్నాడు.

ఈవెనింగ్ కలిశాము. అపుడు ఆనంద్ రాజీ తో "మీరు హైదరాబాద్ వెళితే మీ ఫ్రెండ్ ఒక్కరే! అవుతారేమో!.. " అంటు నా వైపు చూసి నవ్వాడు.

"ఇది లేకున్నా నా రూమ్మేట్లు ఉన్నారు లెండి" అన్నా నేను. ఈయన పరామర్శ ఏంటో నాకు.

"మీరు అపుడప్పుడు మా ఫ్రెండ్ ని కనిపెడుతూ ఉంటారుగా" అన్న రాజితో ఆనంద్ "మీ ఫ్రెండ్ బాగా మొహమాటపడతారు. మీలాగా కాదు అసలు మాట్లాడితే ముత్యాలు రాలిపడతాయని మాట్లాడరుగా" మీ ఫ్రెండ్. పద్మ మా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయి ఆనంద్ అంటుంది మీరేమో అడగరు!"అన్న మాటలకు రాజీ నవ్వింది.

"మా విరిజ చిన్నప్పటినుండి, అంతేనండి! మితభాషి. తనకు ఎంతో నచ్చితే, కానీ స్నేహం, చేయదు, ఒకవేళ చేసిందంటే, వాళ్ళను ఎప్పటికీ వదలదు. అంత, నిజాయితీగా ఉంటుంది మా, విరిజ" అంటూ, నా భుజం, పై చేయి వేసింది.

ఇపుడు, ఇదంతా, అవసరమా! అంటూ కోపంగా చూసాను, రాజీ, వైపు.


"ఆనంద్, గారు తెలిసినవారేగా! పర్లేదులే” అంటూ, నా కోపాన్ని సరిచేస్తూ, “కాస్త నవ్వవే, నీ నోటి ముత్యాలు, రాలితే నేనొక హారం చేయించుకుంటా”నంది రాజీ

నాకు నవ్వు వచ్చినా నవ్వకుండా సీరియస్ గా ఉన్నాను.

కాసేపు ముగ్గురం మాట్లాడుకున్నాము చీకటి పడటంతో రూంకి వచ్చాము నేను రాజీ.

ఫస్ట్ యియర్ సెలవులకు ఇంటికి వచ్చాను. మా అక్క, వసుధ గురించి చెప్పాలి, ఇక్కడ. తనకు, మాకు దూరపు చుట్టం తో, హరి కిచ్చి పెళ్లి చేసాము. అక్క ఎంత నెమ్మది. సహనం, ఎక్కువ. అదే దాని పాలిట శాపం అయింది. అత్తింటి వాళ్లతో కలిసి హరి కూడా, ఏడిపించసాగాడు వసుధను. ఎప్పటికైనా బావ మారుతాడు, అనే ఆశలో ఉందక్క. అక్కకు ఇపుడు కనే నెలలు. అక్కకు ఈ టైం లో దగ్గరున్నందుకు, హాపీ గా ఫీల్ అయింది. పాప పుట్టింది. అమ్మాయి పుట్టిందని హరి, అత్తా మామ, కనీసం చూడటానికి కూడా రాలేదు.

అపుడు, అక్కతో అన్నాను. "ఆడపిల్ల పుట్టటం నీ తప్పా. నువ్వు మీ ఇంటికి, తిరిగి వెళ్ళకూ! డిగ్రీ, పాసయ్యావు. ఏదొక జాబ్ చేసుకుని పాపను పోషించుకోవ”చ్చని. కానీ అక్క, నవ్వేసి ఊరుకుంది.

రాజీ కూడా బ్యాంక్ కి లీవ్ పెట్టీ వచ్చింది. ఇద్దరం ఏటి గట్టుకు నీళ్ళు తేవటానికి వెళ్లినప్పుడు చెప్పింది. "రవి కాల్ చేశాడు, పెళ్లి చేసుకుందామన్నాడు"


"నువ్వేమి చెప్పావు"


"నాకు ఆలోచించుకోవాటానికి.. టైం ఇవ్వని అడిగా విరిజా”.

"రాజీ! ఎందుకో!నాకు రవి ప్రేమలో నిజాయితీ కనపడటం లేదు. ఇపుడు నీకు బ్యాంక్ జాబనీ పెళ్లి చేసుకుంటా నన్నాడు. రేపు నీకు మళ్ళీ కాల్ చేస్తే, ‘పెళ్లి తర్వాత జాబ్ మానుకుంటా’నని చెప్పు” అన్నాను.

తర్వాత రోజు మా ఇంటికి వచ్చింది రాజీ, పైకి వెళ్ళాము. "విరిజా! రవి కాల్ చేశాడు. ‘పెళ్లి చేసుకుంటాను కాని పెళ్లి అయిన తర్వాత జాబ్ మానేసి ఇంట్లో నీకు వండి పెడుతుంటాను సరేనా!’ అన్నా.. అంతే నిమిషంలో ఫోన్ పెట్టేసాడు. "


"నువ్వు చెప్పింది నిజం విరిజా. జాబ్ మానేయవద్దు. దొరకదు.. జాబ్ చేస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటాడుటా" అంది రాజీ


"తుమ్మితే ఊడిపోయే ముక్కు నీకు అవసరమా. ముందు కొన్నాళ్ళు పెళ్లి వాయిదా వేయి. పెళ్లి మనకు జీవిత పరమావధి కాదే, పరమార్థం కూడా కాదు" అన్నాను విసుగ్గా.


"అవునే" అంది రాజీ.

సెలవులయ్యి నేను వైజాగ్ వెళ్ళాను. చదువుతో పాటు గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వసాగాను. ఒకసారి బీచ్లో ఆనంద్ కనపడ్డాడు. "నాకు ఆఫీసర్ ప్రమోషన్ వచ్చిందండీ, కలకత్తా వేశారు. వచ్చే వీక్ వెళ్తున్నాను" అన్నాడు.

మనసులో ఎక్కడో ఏదో దిగులు గా అనిపించింది. నేను డల్ అవటం గమనించాడు ఆనంద్. "మీకు ఏవన్నా హెల్ప్ కావాలంటే నా పక్కన సీట్ లో మీ గురించి అతనికి చెప్పాను మీరు మొహమాట పడకుండా అడగండి."

"అలాగే! ముందు మీకు కంగ్రాట్స్ అండి ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చినందు”కన్నాను.

"ఓ థాంక్స్! వైజాగ్ నాకు నచ్చిన నా హోం సిటీ కాబట్టి అపుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. ఇపుడు నేనున్న అపార్ట్మెంట్ కూడా నా సొంతంగా కొనుక్కున్నాను. ఖాళీ చేయను. ఇక్కడకు వచ్చినపుడుంటాను. ఈ ఇయర్ తో మీ చదువు పూర్తి అవుతుంది. ఇక పెళ్లి చేసుకుంటారా!" అన్న ఆనంద్ తో "లేదండి.. గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నా. ఏదో జాబ్ సంపాదించి మా నాన్న కు అండగా నిలవాలనుకుంటున్నాను. "

"ఓకే అల్ ది బెస్టని" చెప్పాడు.

స్కూటర్ స్టార్ట్ చేస్తూ "మీ ఫ్రెండ్ రాజీ బ్యాంక్ పనిలో ఏవైనా డౌట్స్ వస్తె కాల్ చేస్తుంది. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుందనీ" నా వైపు చూడగానే "అవునండీ! అది ఇట్టే కలిసిపోతుంది" అంటునప్పుడు నా గొంతులో ని జెలస్ ను ఆనంద్ కనిపెట్టకుండా మానేజ్ చేశాను.

కాసేపు బీచులో కూర్చొని ఇంటికి వచ్చా. ఏదో మనసంతా దిగులు ఆవరించింది. ఇదేనా ప్రేమంటే.. ! రేపటి నుండి ఆనంద్ కనపడడుగా. నో.. ప్రేమా లేదు, దోమ లేదు. ముందు నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుని రూం కి వెళ్ళాను.

ఆనంద్ ఇచ్చిన బ్యాంక్ కోచింగ్ బుక్స్ ఉన్నాయి. రేపు ఎటూ సరుకులు తెచ్చుకోవటానికి, సూపర్ మార్కెట్ కు వెళ్లినప్పుడు ఆనంద్ ఇల్లు అక్కడికి దగ్గరే.. ఇచ్చేస్తే సరిపోతుందనుకున్నా.

మరుసటి రోజు ఆనంద్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. ఒక పెద్దావిడ తలుపు తెరిచింది.


"ఆనంద్ గారు లేరా" అంటే, "ఉన్నాడు రామ్మా లోపలికి.. కూర్చో" అని సోఫా చూపించింది. ఆవిడను చూడగానే ఆనంద్ కు బొట్టు పెడితే ఇలాగే ఉంటాడనిపించింది.

"ఎవరమ్మా!?" అంటూ హాల్లో కి వచ్చిన ఆనంద్ “ఓ మీరా! అమ్మ.. నీకు చెప్పాగా విరిజ గారు.. పద్మ ఫ్రెండ్ అని చెప్పాను చూడు.. ఆమే."

"మీరు ఇచ్చిన కోచింగ్ బుక్స్ ఇద్దామని.. ఎటూ ఈ వైపు సరుకులు కొనటానికి వచ్చాను. మీరు మళ్ళీ వెళ్లిపోతారనీ! ఇవ్వటానికి వచ్చా. "

"భలే వారే! ఆ బుక్స్ ఇవ్వకపోయినా పర్లేదండీ. మీరు బ్యాంక్ జాబ్ కి అప్లయ్ చేస్తే ఉంటాయిగా మీ దగ్గర పెట్టుకోలేక పోయారూ. "

"లేదండి. నేను ఏవో గ్రూప్స్ కి రాస్తున్నా. మళ్ళీ ఈ బుక్స్ ఎక్కడన్నా మిస్ అయితే మీరు అంత ఇదిగా ఇచ్చినపుడు బుక్స్ తిరిగి ఇవ్వటం మా ధర్మం. "

ఆనంద్ అమ్మ కాఫీ ఇచ్చారు, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మాట్లాడుతూనే నన్ను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. నాకు కొంచం ఇబ్బందిగా అనిపించి కాఫీ కప్ తో సింక్ దగ్గరికి వెళ్ళి కడిగి పెట్టాను. అపుడు ఆవిడ కళ్ల లో సంతృప్తిని చూసాను. “ఎందుకమ్మా ! కడగటం, అక్కడ పెట్టేయవల్సింది” అంది.


"పర్లేదండి, కాఫీ బావుంది. థాంక్స్.. వస్తానండి" అనగానే "కూర్చో కాసేపు వెళ్దువు గానీ, !" అంది ఆనంద్ అమ్మ గారు.

"అమ్మ వాళ్ళు నే వెళ్తున్నానని సామాను సర్డటానికి వచ్చారు. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. మీకు ఎపుడన్నా వీలుంటే ఇక్కడికొచ్చి అమ్మతో మాట్లాడండి" అన్నాడు ఆనంద్.

"తప్పక వస్తానండి, ఆంటీ! ఉంటాను. " అక్కడే సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న ఆనంద్ వాళ్ల నాన్నకి "వస్తానండి నమస్తే" అని చెప్పి బయటకి కదిలాను.

ఎంఎ కంప్లీట్ చేసుకుని వైజాగ్ నుండి బయట పడ్డాను. నే రాసిన గ్రూప్స్ కి సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ లో సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది. జాబ్ లో జాయిన్ అయ్యాను.

========================================================================

ఇంకా వుంది..


========================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
39 views0 comments

Comments


bottom of page