top of page

ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2


'Premante Idena Part 2' - New Telugu Web Series Written By Penumaka Vasantha

'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2' తెలుగు ధారావాహిక పార్ట్ 2

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

జరిగిన కథ:

విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది.

పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ.

వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది.

ఆనంద్ అక్కడ బ్యాంకు లో పనిచేస్తుంటాడు.

ఆకౌంట్ ఓపెనింగ్ కోసం బ్యాంకు కి వెళ్తుంది విరిజ.ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2 చదవండి.


మరుసటి రోజు బ్యాంక్ కు వెళ్లాను. ఆనంద్ బాగా బిజీగా ఉన్నాడు కౌంటర్ లో.


“బ్యాంక్ అకౌంట్ ఒపెన్ చేయాలండి” ఆన్న నా గొంతు విని "విరిజా గారు.. బాగున్నారా" అన్నాడు ఆనంద్.


"బావున్నానండీ! కొంచం బ్యాంక్ అకౌంట్..” అనెలోగా "ఓ ష్యూర్" అంటూ “ముందు ఈ ఫార్మ్ పూర్తిచేసి ఇక్కడ సైన్ చేయం”డని ఒక ఫామ్ ఇచ్చాడు.


తర్వాత పాస్ బుక్ ఇస్తే, నాన్న ఇచ్చిన డబ్బులు డ్రా చేసుకుని "థాంక్స్ ఆనంద్ గార”ని బయటకు వచ్చాను.


నా వెనకాలే వచ్చి “ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా అడగండి” అన్నాడు. “మొన్న పద్మ గారు కాల్ చేసి మీరు వస్తారని చెప్పారు”.

"నాకు కూడా చెప్పింది పద్మ, మిమ్మలని

కలవమని. "

“ఇపుడు మనం ఫ్రెండ్స్. అదీకాక ఈ సిటీకి మీరు కొత్త. ఏ అవసరమొచ్చినా కాల్ చేయం”డని సెల్ నంబర్ ఇచ్చాడు.


"ఒకే! తప్పక అడుగుతాను. ఇక ఉంటా”నని చెప్పి కదిలాను అక్కడనుండి.


ఇపుడిపుడే చదువు లో పడుతున్నాను. నా రూమ్మేట్స్ మాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించ మంటే ఒకరోజు అందరం బ్యాంక్ వెళ్ళాము.

ఆనంద్ మమ్మలని చూసి కౌంటర్ బయటకు వచ్చి అకౌంట్ ఓపెన్ చేయించాడు. థాంక్స్ చెప్పి బయటకు వచ్చాము.


"సూపర్ గా ఉన్నాడే గురుడు! మంచి జాబ్. మనం కష్ట పడి చదివి జాబ్ తెచ్చుకునే బదులు ఇలాంటివారిని పట్టుకుంటే పోలా" అంది శుభా.


“శుభా! మీ నాన్న గారు నువ్వూ పీజీ చేయాలను కుంటే నువ్వేంటే ఇలా..?” క్లాస్ పీకాను.


"అయినా ఈ ఆనంద్ మమ్మలని చూడను కూడా చూడలేదు. నిన్నే చూస్తున్నాడు విరిజా. నువ్వు ట్రై చెయ్యి" అంది శుభ.


"నాకు ప్రేమల మీద నమ్మకం లేదే! నేను ముందు చదివి జాబ్ కొట్టటమే”ననీ అంతటితో ఆ మాటర్ ను కట్ చేశాను.


రోజులు గడుస్తున్నాయి. అపుడపుడు రాజీ, పద్మ ఫోన్లు చేస్తున్నారు. నిన్న రాజీ మాట్లాడుతున్నప్పుడు గొంతు ఎందుకో డల్ గా ఉంది. ఈ సారి ఏమిటో కనుక్కోవాలి.


నాన్నాఅమ్మా ఎలా ఉన్నావని అడుగుతున్నారు. ఒకరోజు మాటల్లో అక్క ప్రెగ్నెంట్ అన్నారు.


"ఓ… గుడ్ న్యూస్ చెప్పారు నాన్నా! అక్కను ఇంటికి తెచ్చి బాగా చూసుకోండి" అన్నాను.


ఆ రోజు రాజీ ఫోన్ చేసింది "విరి, రవి నన్ను మోసం చేశాడు. ‘నువ్వు నాతోనే ఇంత క్లోజ్ గా ఉన్నావు.. ఇంకా ఎంతమంది బాయ్ ఫ్రెండ్ ఉన్నా’రన్నాడు."


'అదేంటి.. రవిని నువ్వూ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అలా మాట్లాడటం ఏంట”న్నాను.


“నేనూ అదే అనుకుని రవిని ‘మనం ఎపుడూ పెళ్లి చేసుకుందా’మంటే ‘నాకు కొంచం టైం ఇవ్వన్నాడు’.

తర్వాత నుండి ఫోన్ చేస్తే ఎత్తటం లేదే. "


“ఇప్పటికైనా రవి నిజస్వరూపం తెలిసిందా”నీ గట్టిగా క్లాస్ పీకాను.


"నాకు బతకాలనీ.. లేదే” ఏడుస్తూ అంది

“నీకు రవి ముఖ్యమా జన్మనిచ్చిన పేరెంట్స్ ముఖ్యమా తేల్చుకో. నువ్వేమి పిచ్చి పనులు చేయ వాకు. అసలు ఇక్కడికి వచ్చేయవే" అన్నాను.


"మా నాన్న పంపించ”డన్నది"


"నేను మాట్లాడుతాను. నువ్వు ప్రశాంతం గా పడుకో. ఆ రవి కి మళ్ళీ కాల్ చేయ”కనీ ఫోన్ పెట్టేసాను.


"ఎలాగో రాజీ వాళ్ల నాన్నను, ఒక పది రోజులుండి వస్తుం”దని చెప్పి ఒప్పించాను.


రాజీని మామూలు మనిషిని చేయాలి. నా బెస్ట్ ఫ్రెండ్ రమణమ్మ కు పట్టిన గతి దానికి పట్టకూడదు.

రమణమ్మ చాలా మంచిది. అది గొప్పింటి పిల్లాడు అజయ్ ను ప్రేమించింది. అజయ్ దాన్ని చుట్టు తిప్పుకుని చివరలో మా ఇంట్లో నిన్ను చేసుకోవటానికి మా వాళ్ళు ఒప్పుకోవటం లేదన్నాడు. దానితో కృంగిపోయి మా ఊరి చెరువులో పడి చనిపోయింది. వాళ్ల అమ్మానాన్నకు అది ఒక్కతే కూతురు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్ల పోవటంతో వూళ్ళో పరువు పోయి ఆ ఊరి నుండి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు.


వారం తర్వాత రాజీ వచ్చింది. "థాంక్స్ విరి! మా నాన్న నీ మీదున్న గౌరవంతో నన్ను ఇక్కడకు పంపాడు. "


"సరే ముందు నువ్వు సెట్ అవ్వం”టూ దాన్ని బీచ్ కు తీసుకెళ్ళాను. అక్కడ ఆనంద్ కనిపించాడు.


మమ్మలని గుర్తు పట్టి పలకరించాడు. "రాజీ గారు బావున్నారా"

"మీరూ.. పద్మ హస్బెండ్ ఫ్రెండ్ కదూ"


"అవునండీ ఎపుడు వచ్చారు వైజాగ్ "


"మొన్న వచ్చానండి" అంది రాజీ.

"నేను ఆనంద్ తో “రేపు బ్యాంక్ వస్తానండి మనీ డ్రా చేసుకోవటానికి. "


ఇక రాజీ ఆనంద్ తో కబుర్లు మొదలెట్టింది.

ఇక ఇది ఆపేట్లు లేదని "రాజీ! వెళదాము" అన్నాను.


"అబ్బా ఉండవే" అంటూ ఏవో సినిమా కబుర్లు మొదలెట్టింది.


"సరే రాజీ! నీకు ఇంటి అడ్రస్ తెలుసు కదా.. నేను నోట్స్ రాసుకోవా”లంటూ లేచాను.


దారిలో రాజీ నీ తిట్టాను. "ఎందుకే అలా కొత్త వాళ్ళతో ఊరికే వాగుతా”వన్నాను కోపంగా.


"పద్మ పెళ్లిలో కలిశాం కదే! అయినా ఈసారి ఆనంద్ కు ముందు డబ్బులిచ్చి ఆ తర్వాత వాగుతాలే" అంది.


ఆ మాటకు నవ్వొచ్చి "వీటికేం తక్కువ లేదు. నీకు టైప్ సార్ట్ హ్యాండ్ వచ్చుగా! పేపర్ లో టైపిస్ట్ కావాలని పడింది. రేపు వెళ్ళి కనుక్కో”మన్నాను.


రాజి వెళ్ళి టైపిస్ట్ గా జాయిన్ అయింది. ఇపుడిపుడే రవి నీ మర్చి పోతున్నది.


రాజీ వాళ్ల నాన్నకు కాల్ చేసి చెప్పాను. ఆయన కూడా సరేనన్నాడు.


ఈ వారం బ్యాంక్ కు వెళ్ళటానికి కుదరలేదు. మరునాడు బ్యాంక్ వెళ్ళాము నేను రాజీ.

అపుడు ఆనంద్ అన్నాడు “బ్యాంక్ జాబ్స్ పడ్డాయి. ఇద్దరు అప్లై చేయం”డన్నాడు.


"నాకు ఆ మాథ్స్ అవీ రావు. రాజి అప్లయ్ చేస్తుం”దన్నాను.


"బ్యాంక్ ఎగ్జామ్స్ కు కోచింగ్ ఇచ్చె సంస్థ ఉంది. జాయిన్ అవ్వం”డని అడ్రస్ ఇచ్చాడు.


థాంక్స్ చెప్పి కదిలాము.


రాజి బ్యాంక్స్ ఎగ్జాం కు కోచింగ్ కు వెళ్లి వస్తూ ఉంది. దాని దగ్గర ఏదైనా పట్టుకునే స్కిల్ ఉంది కానీ కష్ట పడదు.


నేను ఎంఎ బుక్స్ ముందేసుకుని, దాని బుక్స్ కూడా ముందు పెట్టాను.


“ప్లీజ్ రాజీ! ఒక నెల కాస్త కష్ట పడ్డావంటే మంచి బ్యాంక్ జాబ్ వస్తుందే" అని బతిమాలాను గడ్డము పట్టుకుని.


"ఇంట్లో హిట్లర్ నాన్నని వదిలించుకుని పూలందేవి దగ్గర పడ్డానే” అంటూ ఏడుస్తూ రీజనింగ్ ప్రాక్టీస్ చేసేది.


అపుడపుడు పద్మ కాల్ చేసేది. "మీరిద్దరూ వైజాగ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నేను అంట్లు తోముకుంటు బట్టలుతుక్కుంటూ చస్తున్నానే" అంది పద్మ.

"మేము చదవలేక.. చస్తుంటే నువ్వేమో పనులతో చస్తున్నా అంటావు. చదివే పనులు లేకపోతే ఎన్ని పనులున్నా చేసుకోవచ్చు" అంది రాజీ.


“ఇపుడు మహా చదువుతున్నట్లు లేవే! లేచి బాత్రూంలో నీ బట్టలు వారం నుండి వేలాడుతున్నాయి, ఉతికిరాపో” అని రాజిని కోప్పడ్డాను.


"పద్మా! ఇది అన్నీ కబుర్లే.. పనీ చేయదూ.. చదువుకోదూ.. సోది చెప్పమంటే రెడీ గా ఉంటుం”దన్నాను.

========================================================================

ఇంకా వుంది..


========================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.33 views0 comments

Comments


bottom of page