'PCOD' - New Telugu Story Written By Sirisha Sadhanala
'పీసీఓడీ' తెలుగు కథ
రచన: శిరీష సాధనాల
(కథా పఠనం: K. లక్ష్మీ శైలజ )
“ఏంటమ్మా కోడలు పిల్లా! మీ పెళ్ళి అయ్యి అప్పుడే 3 సంవత్సరాలు అవుతోంది.. ఐన ఇప్పటివరకు నీ నోటి నుండి ఇంకా తీపి కబురు రాలేదు.. అసలు చెప్పే ఉద్దేశం ఉందా నీకు.. ఐన ఈ కాలం అమ్మాయిలకు అమ్మతనం విలువ తెలియట్లేదు.. అమ్మ అని పిలిపించుకోవడం కూడా ఒక వరం అని అర్ధం కావట్లేదు అని అంటున్న తన అత్తగారి మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక మౌనం గా గదిలోకి వెళ్ళిపోయ్యింది చందన..
వాళ్ళు అత్తగారు అన్న మాటల్లో కూడా తప్పు ఏమి లేదు. ఒక సారి శివ వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడాలి అని జ్ఞాపకాలలోకి వెళ్ళింది చందన..
శివ చందన లది పెద్దలు కుదిర్చిన వివాహం.. శివ వాళ్ళ నాన్న గారు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో పెళ్ళి అయ్యాక శివ వాళ్ళ అమ్మ గారు వీళ్ళతోనే ఉంటారు..
ఆ రోజు వాళ్ళ తొలి రాత్రి..
పాలగ్లాస్ తో ఎన్నో ఆశలతో ఆ గదిలోకి అడుగుపెట్టింది చందన.. చందనని అలా చూసిన శివ తనని బెడ్ మీద కూర్చోపెట్టి "చందన! మనం ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. ఇద్దరికీ ఉద్యోగం తోనే సరిపోతుంది. అప్పుడే పిల్లలు అంటే మనకి ఏంజాయ్ చేయడానికి ఉండదు.. మనకి ఉన్న వీకెండ్స్ కూడా పిల్లతోనే సరిపోతుంది. కాబట్టి మనం పిల్లల విషయం లో 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం.. ఆ 2 ఇయర్స్ మనం ఏంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది.. నువ్వు ఏం అంటావ్.. నీ ఉద్దేశం ఏంటి.. ” అన్నాడు.
చందన, "మీ ఆలోచన బానే ఉంది అండి. కానీ 2 ఇయర్స్ అంటే ఎక్కువ ఏమో.. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అండి.. పైగా అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అడుగుతారు కదా.. వాళ్ళకి ఏం చేప్తామ్? కావాలంటే నేను పిల్లలు పుట్టాక ఉద్యోగం మానేస్తా అండి.. ఆ విషయంలో నాకు ఏం ఇబ్బంది లేదు.. ” అంది.
శివ, "ఇది మన లైఫ్ చందన. ఇప్పుడు ఉన్న ఖర్చులకు ఇద్దరం ఉద్యోగం చేయకపోతే ఎలా.. కావాలంటే వాళ్ళకి ఆ టైం కి ఏదో ఒకటి చెపుదాం లే.. నాకు కూడా పిల్లలు అంటే ఇష్టమే కానీ నేను ఏం చేసిన మన కోసమే కదా.. జస్ట్ 2 ఇయర్స్ చందన.. ప్లీజ్ అర్ధం చేసు. మనం ఆ టైములో సేఫ్టీ స్టెప్స్ తీసుకుంటే సరిపోతుంది. దాని వల్ల నీకు ఫ్యూచర్ లో వచ్చే సమస్యలు కూడా ఉండవు” అని చెప్పేసరికి ఒప్పుకుంటుంది చందన..
చందన వాళ్ళ అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఒక సంవత్సరం ఏమీ అడగకపోయినా రెండవ సంవత్సరం నుంచి అడగడం మొదలు పెట్టారు.. ఏం చెప్పాలో తెలియక ఒక నవ్వు నవ్వి తప్పించుకునేది.. కానీ కొద్దీ రోజుల నుంచి రోజు తనకి, తన అత్తగారికి ఈ డిస్కషన్ అవుతూ ఉండడం తో ఈ రోజు ఎలా ఐన శివ తో మాట్లాడాలి అని అనుకుంది చందన..
సాయంత్రానికి పని వల్ల అలసిన శరీరం తో ఇంటికి చేరుకుంటాడు శివ.. భోజనాలు అయ్యాక
చందన "శివ, ఈ రోజు కూడా అత్తయ్య గారు పిల్లల గురించి అడిగారు.. ఆవిడ బాధలోనూ అర్ధం ఉంది కదా.. ఈ మధ్యన నాకు పీరియడ్స్ సరిగా రావట్లేదు. నా శరీరంలో ఏవో మార్పులు వస్తున్నట్టు అనిపిస్తుంది.. పైగా లావు కూడా పెరిగిపోతున్నాను. ఒక సారి వెళ్లి డాక్టర్ కి చూపించుకుందాం.. రేపు కూడా నేను లీవ్ పెట్టేస్తాను.. నువ్వు రేపు ఒక రోజుకి లీవ్ పెడతావా ఒక సారి హాస్పిటల్ కి వెళ్లి వద్దాం..” అంది.
శివ "కంగారు ఏం ఉందిలే చందన.. లావు అవ్వడం, పీరియడ్స్ రాకపోవడం హార్మోన్స్ ఇంబాలన్స్ వల్ల కూడా జరుగుతాయి అంట.. ఈ మధ్యన వర్క్ ఎక్కువ అయ్యి బాగా స్ట్రెస్ తీసుకుంటున్నావ్ కదా.. అందుకే అలా అయ్యి ఉండచ్చు. ఈ మాత్రం దానికే అంత కంగారు ఐతే ఎలా చెప్పు.. ఇంకొన్ని రోజులు చూద్దాం. అప్పటికి నువ్వు కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే..” అన్నాడు.
చందన "ప్లీజ్ శివ.. ఒక సారి నా మాట విను. నా బాడీలో మార్పులు నాకూ తెలుస్తాయి కదా! నేను ఇంకా ప్రెగ్నెంట్ కాకపోవడానికి వేరే ఏదో కారణం ఉంది అనిపిస్తుంది. నా కోసం ఒప్పుకో శివ..” అంది.
శివ "సరే చందన.. రేపు అంటే కష్టం. ఈ సండే పక్కాగా వెళ్దాం. అప్పటికి నేను అప్పోయింట్మెంట్ కూడా తీసుకుంటా.. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించకుండా పడుకో..” అన్నాడు.
ఆ ఆదివారం రోజు శివ, చందన ఇద్దరు డాక్టర్ దగ్గరకు వెళ్తారు..
చందన "నమస్తే డాక్టర్.. మేము పిల్లలకోసం రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాము.. ఇది జరిగి సంవత్సరం కావొస్తుంది.. నాకు ఈ మధ్య నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి అనిపిస్తుంది, లావు అవుతున్నాను, పీరియడ్స్ సరిగా రావట్లేదు.. దీనికి నాకు పిల్లలు పుట్టకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా.. నేను మా వారు ఏమైనా టెస్ట్స్ చేయించుకోవాలా..” అని అడిగింది.
డాక్టర్ "మీ వారు అక్కర్లేదు అండి.. ముందు మీకు చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ బట్టి మీ వారికీ చేస్తాం.. నేను కొన్ని టెస్ట్స్ రాస్తాను.. అవి చేయించుకున్నాక ఈవెనింగ్ కి ఒక సారి రండి. అప్పుడు మెడిసిన్ ఇస్తాను” అంది.
ఆ రోజు ఈవెనింగ్.. డాక్టర్ "ఐ యం సారీ చందన గారు.. నేను ఉహించినట్టే మీకు pcod ఉంది..” ని చెప్పింది.
శివ "pcod ఏంటి డాక్టర్.. దాని వల్ల ఏమైనా సమస్య ఉంటుందా.. మాకు పిల్లలు పుడతారు కదా డాక్టర్.."
“మీరు ఎప్పుడైనా విన్నారా చందన గారు దీని గురించి..” చందనను అడిగింది డాక్టర్.
చందన కళ్ళ నీళ్లతో, “విన్నాను డాక్టర్.. కానీ అప్పుడు దాని గురించి అంతగా పట్టించుకోలేదు నేను.. అసలు ఏందుకు వస్తుంది.. pcod అంటే ఏంటి? అది తగ్గాలి అంటే ఏం చెయ్యాలి డాక్టర్..” అడిగింది.
డాక్టర్ ఇలా వివరించింది.
"పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీస్' నే పీసీఓడీ అంటారు. సాధారణంగా ప్రతిస్త్రీలోనూ రుతుక్రమ సమయంలో అండాశయంలో అండం పరిపక్వత చెంది నెలనెలా విడుదల అవుతుంది. నెలసరి తర్వాత 11– 18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. కానీ కొందరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మేల్ హార్మోన్లుగా పిలిచే ‘ఆండ్రోజన్స్’ అధికంగా విడుదలవుతాయి. ఇది క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది.
పీసీఓడీతో బాధపడుతున్న వారిలో విడుదలయ్యే అండం పూర్తిగా ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. ఒక్కోక్కరిలో హర్మోన్ల అసమతుల్యతను బట్టి నీటి బుడగలు(నీటి తిత్తులు) ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలోనూ ఉంటాయి. ఇప్పటివరకు ఈ సమస్య ఏందుకొస్తుందనేది, ఖచ్చితంగా తెలియదు.
కానీ టెస్టొస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల అండాశయంలో అండం విడుదల కాకపోవడం, విడుదలైనా పెరగకపోవడం జరుగుతుంది. ప్రతి స్త్రీ శరీరంలో గర్భాశయానికి ఇరుపక్కలా రెండు అండాశయాలు ఉంటాయి. వీటిలో ద్రవంతో నిండిన చిన్న చిన్న సంచుల్లాంటి నిర్మాణాల్లో అండాలు తయారవుతాయి. ఈ సంచులనే వైద్య పరిభాషలో ఫాలిక్యూల్స్ అంటారు.
ప్రతి నెలా ఒక పాలిక్యూల్ ఎదిగి పరిపక్వం చెందిన అండాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన అండం, వీర్య కణంతో కలిసినప్పుడు ఫలదీకరణం చెంది, జైగోట్ ఏర్పడి తర్వాతి దశలో పిండంగా ఎదుగుతుంది. ఈ ప్రక్రియ జరగని పక్షంలో ఆరోగ్యవంతమైన స్త్రీలకు నెలసరి వస్తుంది.
అయితే అండం ఏర్పడి, పూర్తి స్థాయిలో ఎదిగి విడుదలయ్యే ప్రక్రియ మొత్తం హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఫాలిక్యూల్ ఎదగడానికి, ఆరోగ్యవంతమైన అండం తయారవడానికి హార్మోన్ల పాత్ర కీలకం. మెదడులోని హైపోథలామస్ అనే భాగం ఈ హార్మోన్ల విడుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది”
చందన, శివ "దీని వల్ల ఎదురు అయ్యే ఇబ్బందులు ఏంటి డాక్టర్?” అని అడిగారు.
డాక్టర్ "పీసీఓడీ ఉన్నవారిలో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు స్త్రీల ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఊబకాయం, నెలసరి క్రమం తప్పడం, కొందరిలో నెలసరి రెండు లేదా మూడు నెలలకోసారి రావడం, రుతుక్రమ సమయంలో కొందరిలో అధికంగా రక్తస్రావం జరగడం, మరికొందరిలో సాధారణ స్రావానికంటే కూడా అతితక్కువగా రక్త స్రావం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో అండం సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల సంతానం కలగడానికి ఇది పెద్ద ఆటకంగా మారుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా విడుదలవుతుంది.
దీంతో యుక్తవయసులో ఉన్న వారికి మొటిమలు అధికంగా రావడం, జుట్టురాలిపోవడం, స్త్రీలలో అవాంచిత రోమాలు పెరిగి పురుష లక్షణాలు కనిపిస్తాయి. ఇన్సులిన్ హోర్మోన్ స్థాయి పెరుగుతుంది. దీంతో శరీరంలో ప్రతికూల వాతావరణంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
దీర్ఘకాలికంగా పీసీఓడీతో బాధపడుతున్న వారిలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భం ధరించినప్పుడు మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు వంటి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఫలితంగా పీసీఓడీతో బాధపడేవారు ఆత్మవిశ్వాసం కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. దీనివల్ల ఇతర రకాల సమస్యలు పెరుగుతాయి.
చందన "మరి ఇప్పుడు ఎలా డాక్టర్.. నేను తల్లిని అవుతానా.. అసలు ఏం చేస్తే తగ్గుతుంది డాక్టర్?” అని ప్రశ్నించింది.
డాక్టర్ "దానికి శాశ్వత చికిత్స ఐతే లేదు.. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే అప్పుడు మనం pcod ని తగ్గించుకోవచ్చు.. దాని ద్వారా గర్భం కూడా దాల్చవచ్చు.. ” అని చెప్పింది.
చందన "ఏంటి డాక్టర్ అవి” అని అడిగింది.
డాక్టర్ "చికిత్స సాధారణంగా బరువు తగ్గడం, ఆహారం మరియు వ్యాయామం వంటి జీవనశైలి మార్పులతో ప్రారంభమవుతుంది. మీ శరీర బరువులో కేవలం 5 నుండి 10 శాతం కోల్పోవడం మీ ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదల, మొటిమలు మరియు జీవక్రియ రుగ్మతలు వంటి లక్షణాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది.
బరువు తగ్గడానికి మీకు సహాయపడే ఏదైనా ఆహారం మీ పరిస్థితికి సహాయపడుతుంది. అయితే, కొన్ని ఆహారాలు ఇతరులపై ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు. బరువు తగ్గడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ను తగ్గిస్తుంది. మరియు గుండె జబ్బులు మరియు మధుమేహ ప్రమాదాలను తగ్గిస్తుంది.
వారానికి కనీసం ఐదు రోజులు 20 నిమిషాల మితమైన- తీవ్రత వ్యాయామం మహిళలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వ్యాయామంతో బరువు తగ్గడం కూడా అండోత్సర్గము మరియు ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
పిసిఒడి ఉత్తమమైన చికిత్స సకాలంలో రోగనిర్ధారణను కలిగి ఉంటుంది మరియు తగిన చికిత్సా పద్ధతులు లక్షణాలను అధిగమించడంలో సహాయపడతాయి. హార్మోన్ల అసమతుల్యత మరియు సంబంధిత పరిస్థితులకు చికిత్స చేయడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా గా మీరు తల్లి అవుతారు.. ఆత్మ విశ్వాసం కోల్పోకండి.. ” అని సలహా ఇచ్చింది.
శివ " సరే డాక్టర్, థాంక్ యు.. ” అన్నాడు.
బయటకు వచ్చాక చందన ఏడుస్తూ “నాకే ఏందుకు అండి ఇలా.. నాకు ఇంక పిల్లలు పుట్టారా.. అత్తయ్యకి నా మొహం ఎలా చూపించను.. ” అంటూ బాధ పడింది.
శివ " డాక్టర్ సరైన జాగ్రతలు తీసుకుంటే ఏం కాదు అని చెప్పారు కదా చందన.. నువ్వు చాలా దైర్యంగా ఉండాలి.. అమ్మ అర్ధం చేసుకుంటుంది అన్న నమ్మకం నాకు ఐతే ఉంది.. ఏం కాదు.. ” అని ధైర్యం చెప్పాడు.
“ఏం అన్నారు రా డాక్టర్ గారు” అని అడుగుతారు శివని వాళ్ళ అమ్మ గారు.
శివ " జరిగింది అంతా చెప్తాడు..
అత్తయ్య గారు " అయ్యో బాధపడకు అమ్మ..
డాక్టర్ చెప్పినట్టు నేను చూసుకుంటా కదా నిన్ను.. నేను ఉన్నా కదా నీకు.. సంవత్సరం అయ్యే సరికి నువ్వు అమ్మ అని పిలిపించుకుంటావ్ చూస్తూ ఉండు.. ” అంది కోడలి తల నిమురుతూ.
అలా డాక్టర్ చెప్పినట్టు గా చందనని చాలా జాగ్రత్త గా చూసుకుంటారు వాళ్ళ అత్త గారు.. ఒక సంవత్సరానికి ఒక బాబు తో ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళు.
***
ఈ మధ్యకాలంలో టీనేజ్ అమ్మాయిల నుంచి వివాహిత స్త్రీల వరకు అందర్ని బాధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది అండాశయంలో నీటి బుడగల సమస్య. దీనినే pcod అంటారు అవాంఛిత రోమాలతో ఆరంభమై చివరకు మాతృత్వ మధురిమలు దక్కకుండా చేసే ఈ పీసీఓడీపై గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండే మన భారత్‌లో అవగాహన చాలా తక్కువ. కేవలం పట్టణాల్లో ఉండే వారిలో కొందరికి మాత్రమే దీని గురించి కొంచెంకొంచెంగా తెలుసు. పీసీఓడీకి సంపూర్ణ చికిత్స అందుబాటులో లేనందున దీన్ని ఆరంభంలోనే గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ఉత్తమం.. అలా చేయడం వల్ల గర్భం దాల్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరు తల్లి కాగలరు
- రచయిత్రి శిరీష సాధనాల.
***
శిరీష సాధనాల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు శిరీష.
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను.
నాకు స్టోరీస్ చదవడం రాయడం అంటే చాల ఇష్టం.
నా ప్రతి కధ ఒక చక్కటి అర్థాన్ని ఇచ్చేలా చూసుకుంటాను.
నాకు సాడ్ ఎండింగ్స్ అంటే అసలు నచ్చవు.
అందుకే నా ప్రతి కథ ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చేలా రాస్తాను..
Comments