top of page
Original.png

రామయ్య చరితము

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మీనరాశి, #RamaiahCharithamu, #రామయ్యచరితము, #ఇష్టపది

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 10

Ramaiah Charithamu - Gayathri Gari Kavithalu Part 10 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 05/04/2025

రామయ్య చరితము - గాయత్రి గారి కవితలు పార్ట్ 10 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


రామయ్య చరితము

(ఇష్టపది )


*****************************

శివుని విల్లును విరిచె శ్రీరాముడానాడు 

నవయుగానికి తాను నాయకుండైనాడు 


దివిలోని దేవతలు దిగులు వదిలేశారు 

భువనాలు గెల్వమని పూలుకురిపించారు 


సీతమ్మ తనువంత సిగ్గుతో మెరిసింది 

ఆ తల్లి భూమాత యాశీస్సులిచ్చింది 


వలపుతో సీతమ్మ వరమాల వేసింది

కలలుపండాయనుచు కనులతో తెలిపింది


రామయ్య కదిలాడు రక్కసుల దునిమాడు

కామితంబులు తీర్చి కరుణ చిలికించాడు


జయమంచు ధరణిలో జనులెల్ల మురిశారు

భయములేదనుకొంచు పండుగలు చేశారు


ఆ నాటి దైవాని కాలయమ్ములు కట్టి

ఈ నాటి వరకు జనులెఱుకతో పూజించి


తీరుగా దేవుడిని తేరుపై నెక్కించి

ఊరు వాడల త్రిప్పి యుత్సవంబులు చేసి


పల్లెపల్లెల నిల్పి భక్తితో కొలిచారు

చల్లగా కావుమని సాష్టాంగ పడ్డారు.


రామయ్య చరితమును వ్రాసిరట కవులెల్ల

తారకలు నిల్చుతఱి  తల్చుకొను జగమెల్ల.//

************************************

మీనరాశి

(ఇష్టపది)


ree













మీనమై జలధిలో మేటిగా చరియించి 

దానవుని నిర్జించి దైవమై చనుదెంచి 


వేదరాశిని తెచ్చి విధిని బ్రోచిన కృష్ణ 

పాదములు జనులెల్ల భక్తిగా కొల్చెదరు.


సుందరేశుని రాణి శోభనంబుగ వెల్గి 

అందాల మీనాక్షి ఆ మధుర నాయికై 


ఏలుచున్నది దేవి ఏడేడు లోకాలు 

కాలరూపిణి తల్లి కామితంబులు తీర్చు!


నింగిలో మీనమై నిగిడి చూచుచునుండి 

సంగతిగ గ్రహరాశి సమయాలు తెల్పునట!

జలధిలో మీనమ్ము జాలరుల పంటగా

విలువైన సంపదగ విభవమ్ము పెంచునట!


కనులతో మీనమ్ము కన్నబిడ్డల గాచి

దినదినము వర్థిల్ల దీవెనలు కురిపించు!


కలికికన్నులు పోల్చ కవుల హృదయాలలో

నిలిచియుండును ఝషము నిత్యసీమంతినిగ!//


*******************************

ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page