top of page
Writer's pictureHanumantha

రియల్ హీరో


'Real Hero' - New Telugu Story Written By Hanumantha T

'రియల్ హీరో' తెలుగు కథ

రచన: T హనుమంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మామిడి తోరణాలు, పూలమాలలు, మారుమ్రోగే మైక్సెట్లు, కిలకిల నవ్వే పరిచయాలు, ముహూర్తం తొందర పడుతుందనే హడావుడి.. అరటి దిండులతో పందిరి వేసి పూలతో అలంకరించారు. వధూవరులకు పసుపు నీటితో స్నానాలు చేయించారు. ఊరుఊరంతా వివాహ వేడుకను చూడవచ్చారు. పంతులు గారు ఆలస్యమైందని తొందర చేస్తున్నాడు. వరుడికి పంచకట్టు, తలపాగా చుట్టటానికి నానా అవస్థలు పడుతున్నారు.


వధూవరులు పెళ్లిపీటలు మీద కూర్చున్నారు పంతులు గారు ఆలస్యమైందని తొందరగా జీలకర్ర బెల్లం తలపై పెట్టించి, మంత్రాలు చదివి మూడుముళ్లు వేయించాడు. అక్షింతలు వేసి వారు తెచ్చిన కానుకలు ఇస్తూ వారికి నచ్చిన విధంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భోజనాలు ముగించుకుని చుట్టాలంతా వెళ్లి పోయారు.


షామియానా, లైట్లు, వంటసామాన్లు, కుర్చీలు అన్ని టెంట్ హౌస్ దగ్గరికి జాగ్రత్తగా చేర్చడానికి నానా కష్టాలు పడుతూ అమ్మాయ్య అనుకుంటూ అరుగు మీద కూర్చొన్నాడు. తన చెల్లి నీళ్ళు ఇస్తూ, కళ్ళు తుడచు కొంటూ “అదృష్టవంతురాలు అన్నయ్య! మంచి అబ్బాయి దొరికాడు” అంటే..


బాధను బయట పెట్టేలేక తల ఊపుతూ లోపలికి వెళ్లి పోయాడు. రాత్రి 7 గంటలు కావస్తోంది ఉదయం మిగిలిన వంటకాలను చుట్టుపక్కల వారికి పంచిపెట్టి పెళ్లి కూతురు తండ్రి, అతని చెల్లెలు తిని చెల్లిని ఇంటి దగ్గరే ఉండమని చెప్పి వరుడి ఇంటికని బయలుదేరుతాడు.


వధూవరులు ఊరేగింపును వరుడి ఇంటివారు అద్భుతంగా నిర్వహించారు, రాములోరి గుడిగుడిలో పూజా కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరుకునే సరికి 10 గంటలు అయింది. వరుడు భోజనం తర్వాత అలా పెరట్లో కూర్చొన్నాడు.


వధువు తండ్రి “ఏం బాబు.. ఏమైనా ఇబ్బందా?” అని అడిగాడు.


వరుడు లేచి “అలాంటిది ఏమీలేదు మామా” అని అన్నాడు.


వెంటనే వధువు తండ్రి అతని భుజం పై తలవాల్చాడు.


“పిచ్చి పిల్లని నువ్వే చూసుకోవాలి బాబు, మీ ఇంట్లో వద్థన్నా కూడా ఒప్పించి మరీ చేసుకున్నావు. నీ ఋణం ఎలా తీర్చుకోను..” అని బాధ పడ్డాడు.


వధువు తండ్రి బాధకు కారణం తెలుసుకుందాం..


ఈ అమ్మాయికి చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తల్లిలేని పిల్ల అని గారాబంగా పెంచాడు. రోజూ స్కూల్ కి పంపేవాడు. అమ్మాయి కూడా బాగా చదువు కొనేది. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయింది. ముందు తరగతులకు వెళతానంటే పట్నం లోని హాస్టల్ లో చేర్పించాడు.


అక్కడ తెలిసి తెలియని అయోమయంలో ఒక అబ్బాయి రోజూ వెంట పడుతుంటే నిజంగా ఇష్టపడుతున్నాడు అని అతనితో మాట్లాడటం మొదలెదుతుంది. సినిమాలకి పార్కులకి వెళ్ళేవారు. అలాగే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు అయిపోవచ్చింది. పరీక్ష తేదీలు ఖరారు చేసారు ఇంక మనం కలవడం కుదరదు. నాకు చాలా భాధగా ఉంది అని మాయ మాటలు చెప్పి ఒక హోటల్ గదికి తీసుకెళ్తాడు.


అక్కడ పళ్ళ రసంలో మత్తుమందు కలిపి ఇస్తాడు. అదే సమయంలో అక్కడికి అతని నలుగురు ఫ్రెండ్స్ వస్తారు. స్పృహలో లేని అమ్మాయిని మానభంగం చేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. సర్వర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలిపితే, పోలీసులు అమ్మాయి వివరాలు సేకరించి హాస్పిటల్లో చేర్పించి, తన తండ్రి వెంట ఊరికి పంపిస్తారు.


మతిస్థిమితం లేని బిడ్డను చూసి కుమిలిపోతాడు.

అమ్మాయిని పక్క ఊరిలోని హాస్పటల్ కు వారానికి రెండుమూడు సార్లు తీసుకెళ్లే వాడు. అక్కడ RMP డాక్టర్ వద్ద ఈ అబ్బాయి అసిస్టెంట్ గా పని చేసే వాడు.


తమ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వస్తున్న ఈ అమ్మాయిని మంచి మనసుతో వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడు.

ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా మంచోడు అనడమే తప్పా ఆ పరిస్థితిలో ఎవరున్నా ఒప్పుకునేవారు కాదేమో..


రియల్ హీరో అనే పదం ఆ అబ్బాయికి సరిపోతుంది అనిపించింది.

***

T హనుమంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: పేరు: హనుమంత

జిల్లా: అనంతపురము

డిగ్రీ 3వ సంవత్సరం




31 views0 comments

Comentarios


bottom of page