top of page

రిక్షాఓడి కొడుకు ఇమానం నడపగలడు

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #రిక్షాఓడికొడుకుఇమానంనడపగలడు, #RikshawodiKodukuVimanamNadapagaladu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Rikshawodi Koduku Vimanam Nadapagaladu - New Telugu Story Written By Kandarpa Murthy Published In manatelugukathalu.com On 20/01/2025

రిక్షాఓడి కొడుకు ఇమానం నడపగలడు - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


వెంకటస్వామి ఆటో నడుపుతూ లేబర్ కాలనీలో నివాసముంటున్నాడు. రోజంతా సంపాదించిన డబ్బు తాగుడికీ, జూదానికి ఖర్చు చేస్తుంటాడు. 


భార్య వరమ్మ పెద్దోళ్ల ఇళ్లలో పాచి పనులు చేసి సంపాదించిన పైసలతో ఇల్లు గడుస్తోంది. కొడుకు గోవిందుకి చదువంటే ఆసక్తి. స్వతహాగా తెలివైన వాడు. ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు.. చదువుకోవాలని కోరిక ఉన్నా తాగొచ్చిన తండ్రి సరిగ్గా స్కూలుకి పోనివ్వడు. 


ఒకరోజు ఉదయం వెంకటస్వామి నోట్లో సిగరెట్ పొగ వదులుతు, "గౌరిగా, బేగె పాతగుడ్డ ఎత్తుకు రా! ఆటో తుడవాల" కేకేసాడు. 


 "అయ్యా, స్కూలుకి టైమయి పోతాది" ఏడుపు ముఖం పెట్టాడు గోవిందు. 


 "పోరా ఎదవా! నువ్వు సదువుకుని ఇమానాలు నడుపుతావా ఏంటి? మద్దేనం బువ్వ పెట్టే ఏలకి స్కూలుకి పో!" కసురుకున్నాడు వెంకటస్వామి. 


 "ఏంటయ్యా, నీ కెలాగు సదువు లేకపోయె. తాగి తొంగుంటావు. బుడ్డోడినైన స్కూలుకి పోనివ్వు." గుడిసెలో నుంచి చిటపటలాడుతోంది వరమ్మ.


 "నువ్వు ఒల్లకుండవే" గద్దించాడు పెళ్లాన్ని. 


తుడుపు గుడ్డ అందిస్తూ" అయ్యా, ఆటో చక్రానికి గాలి పోనాది" అన్నాడు గోవిందు. 


ఆటో దగ్గరకొచ్చి చక్రాన్ని చూసిన వెంకటస్వామి "ఔన్రా! టైరు పంచరైనాది. ఇప్పుడెలాగ? కిలోమీటరు దూరం బండి తోసుకు పోవాల. పద, బండి ఎనక నుంచి నెట్టు" అంటూ కోపంగా చిందులేసాడు వెంకటస్వామి. 


మరో మాట లేకుండా గోవిందు అయ్య వెంట ఆటోను వెనక నుంచి నెట్టక తప్పలేదు. 


"ఏరా, గోవిందూ! ఇదా స్కూలుకి వచ్చే సమయం?" పురుషోత్తం మాస్టారు మందలించారు. 


"మా అయ్య స్కూలుకి పోవద్దంటాడు. ఆటో నేర్చుకుని బతకమంటాడు. నాకేమో చదువుకోవాలనుంది సార్" జరిగిన విషయం చెప్పి దీనంగా మొహం పెట్టాడు గోవిందు. 


గోవిందు తాగుబోతు ఇంట్లో పుట్టినా చదువు మీద శ్రద్ద, తెలివితేటలు, చు‌రుకుతనం చూసిన పురుషోత్తం మాస్టారు వాడిని ఆ వాతావరణం నుంచి దూరంగా ఉంచాలనుకున్నారు. 


ఉన్నత చదువు కోసం పై విధ్యాధికారులతో సంప్రదించి గోవిందుని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించారు పురుషోత్తం మాస్టారు. 


మొదట కొడుకును లేబర్ కాలనీ బస్తీ నుంచి బయటకు పంపడానికి ఇష్టపడని ఆటోడ్రైవరు వెంకటస్వామిని, వరమ్మను పాఠశాలకు పిలిపించి పురుషోత్తం మాస్టారు గోవిందు భవిష్య జీవితం గురించి నచ్చచెప్పడంతో

ఒప్పుకున్నారు. 


గోవిందు చదువులో తెలివితేటలు, చురుకుతనం, వినయ విధేయతలతో గురుకుల ఉపాధ్యాయుల మెప్పు పొంది తరగతిలో మంచి మార్కులతో పాసవుతున్నాడు. 


హైస్కూలు చదువు మెరిట్ మార్కులతో పాసవగానే ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ప్రవేశం పొంది స్కాలర్ షిప్ సంపాదించి ఇంటర్ తర్వాత స్టడీ సెంటర్లో కోచింగు తీసుకుని ఎంట్రెన్సు ఎగ్జామ్స్ లో టాప్ ర్యాంకు

సంపాదించాడు. 


ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో సీటు పొంది ఇంజినీరింగ్ చదువు మొదలెట్టాడు. కొందరు దాతల ఆర్థిక సాయంతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో తండ్రి వెంకటస్వామి అతి తాగుడు కారణంగా కాలేయం చెడిపోయి

 మృత్యువాత పడ్డాడు. 


తల్లి వరమ్మ ఇళ్లలో పాచిపనులు చేసుకుంటూ ఒంటరి జీవితం వెళ్లదీస్తోంది. తల్లి దుస్థితిని చూసి గోవిందు చలించిపోయాడు. ఎలాగైనా కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించి తల్లిని సుఖ పెట్టాలనుకున్నాడు. 


ఇంజినీరింగ్ చదువుతూనే సమయం వెచ్చించి పార్టు టైమ్ ఉద్యోగం చేస్తూ కొన్ని ఆర్థికావసరాలు తీర్చుకుంటున్నాడు. 

 వీలున్నప్పుడల్లా తల్లిని కలుస్తూ ఆమె కష్టసుఖాలు తెలుసుకుంటూ దైర్యాన్నిస్తున్నాడు. 


ఏరోనాటికల్ ఇంజినీరింగు ఫైనల్లో గోల్డు మెడలు సంపాదించి ఏవియేషన్ ఫ్లైయింగు ఎకాడమీలో కమర్షియల్ పైలట్ ట్రైనింగు సీటుకి సెలక్టయాడు. 


గోవిందు వేషభాషలు, హావభావాలు, మాట తీరు అన్నీ మారిపోయాయి. చూసేవారికి గౌరవభావం కలిగేలా తయారయాడు. కూలివాడలో పుట్టి పెరిగిన గోవిందుకి ప్రస్తుత పైలట్ హోదాలో కనబడే గోవిందుకి వ్యక్తిత్వంలో ఎంతో భేదం కనబడుతోంది. 


గోవిందు మనో నిర్భరత, దృఢ సంకల్పం అతడిని కమర్షియల్ పైలట్ ని చేసాయి. పేరున్న విమానయాన సంస్థలో కమర్షియల్ పైలట్ గా సెలక్టయి పెద్ద విమానాలు నడిపే స్థాయికి ఎదిగాడు. 


 చిన్నప్పుడు తండ్రి తాగిన మైకంలో "నువ్వు సదువుకుని ఇమానాలు నడుపుతావటరా" అన్న మాటలు నిజం చేసి సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుని నిజ జీవతంలో పెద్ద విమానాలు నడిపే పైలట్ అయాడు. 


కూలివాడ గుడిసెలో దుర్భర స్థితిలో ఉండే తల్లిని తీసుకువచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు.  పట్టుదల, మనో సంకల్పం ఉండి కృషి చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించాడు గోవిందు ఉరఫ్ గోవర్దన్. 

  *

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page