top of page
Original.png

రుణానుబంధం

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #Runanubandham, #రుణానుబంధం, #తెలుగుపల్లెకథలు

ree

Runanubandham - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 17/09/2025

రుణానుబంధం - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అలిదన గ్రామంలో ఎల్లయ్య సూరి, మల్లమ్మ అను దంపతులు ఉండేవారు. ఎల్లయ్య సూరి త్రికాల జ్ఞాని. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి చెప్పగల ప్రజ్ఞాశాలి. 

ఆ దంపతులకు ఎంత కాలమైనా సంతానం కలగలేదు.


భార్య మల్లమ్మ ఒక రోజు "ఏమండి మనకు ఇంత కాలమైనా సంతానం కలగలేదు. నిజంగా మనకు సంతాన యోగం ఉందంటారా! లేదంటారా! చెప్పండి" భర్తను అడిగింది.

 

"మనకు సంతాన యోగం ఉంది. అయితే కేవలం రుణాలు తీర్చుకోవడానికి పుడుతారు. రుణం తీరగానే మనకు దూరమై పోతారు. " 


భర్త చెప్పగానే భార్య నిరాశ పడింది. 

కొంత కాలానికి భార్య గర్భం దాల్చి పండంటి మగబిడ్డను ప్రసవించింది. మల్లమ్మ భర్తను అడిగింది "ఈ బిడ్డ మనకు రుణం ఉన్నాడా? లేక మనం రుణం ఉన్నామా?" అని. 


"ఇతనికి మనమే రెండు శేర్లు ఆముదము బాకీ ఉన్నాం. కాబట్టి రెండు శేర్లు ఆముదము ఇతని ఒంటికి పూసి మర్ధన చేయి. ఇతను పోతాడు." అన్నాడు భర్త. 


"ఇతనికి ఆముదం అంటించకుంటే ఎప్పటికీ మన అబ్బాయి గానే ఉంటాడు కదండీ" అంది మల్లమ్మ. 


"అవును, కానీ ఇతడు మరొకరి రుణం తీర్చుకోవడం కోసం వారి కడుపున జన్మించాల్సి ఉంది. కాబట్టి ఇతని రుణం తీర్చుకో!" భర్త ఎల్లయ్య సూరి ఆదేశించాడు. భర్త చెప్పినట్లే చేసింది. బాలుడు పోయాడు.


మరికొంత కాలానికి మరో మగ పిల్లాడు పుట్టాడు. అప్పుడు కూడా భర్తను అడిగింది "ఈ పిల్లాడు విషయంలో ఎవరు ఎవరికి రుణం ఉన్నారు." అని.


"ఈ పిల్లాడు మనకే వెయ్యి వరాహాలు రుణపడి ఉన్నాడు. వీడిని పెంచి పెద్ద చెయ్యి. వీడు సంపాదించినది ఏది తీసుకోవద్దు. ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు రుణం తీరి చనిపోతాడు. కావున నీవు ఇతని చేతి మీదుగా ఎట్టిపరిస్థితుల్లో సొమ్ము తీసుకోవద్దు. తీసుకోనంత వరకు పిల్లాడు ఎప్పటికీ మన బిడ్డగానే ఉంటాడు. జాగ్రత్తగా పెంచు" భర్త సంతోష వార్త చెప్పాడు. 


మల్లమ్మ ఆనందంతో రామభద్రుడు అని పేరు పెట్టుకొని పెంచింది. పిల్లాడు పెరిగి పెద్దైై యవ్వనంలోకి వచ్చాడు. 


రామభద్రుడు "దేశాంతరం పోయి డబ్బు సంపాదించుకొని వస్తాను. అనుమతి ఇవ్వండి" అని అమ్మానాన్నలను అడిగాడు. 


"నాయినా రామభద్రా! మనకు కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటిదగ్గర ఉండి మన భూముల్ని చూసుకుంటే చాలు. ఎక్కడికి పోయి కష్టపడాల్సిన పనిలేదు. " చెప్పారు తల్లిదండ్రులు. 


సస్సేమిరా వినలేదు రామభద్రుడు. "సంపాదన పురుష లక్షణం" అని గుర్రం మీద బయలుదేరాడు. ఓ మూడు నెలలు తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. "అమ్మా! వెయ్యి వరహాలు సంపాదించాను. దాచమ్మా!" అని వెయ్యి వరహాల మూట ఇయ్యబోయాడు రామభద్రుడు. 


"వద్దు నాయినా! నీవ్వు సంపాదించింది నువ్వే ఖర్చు చేసుకో! లేదా నీదగ్గరే దాచుకో నాయినా" అంటుంది అమ్మ. సరే అని తన దగ్గరే దాచుకున్నాడు.


ఒక రోజు రామభద్రుడు ఎక్కడికో పోతూ అమ్మను పిలిచి "అమ్మా! ఈ వరహాల మూట పట్టకోమ్మా! నేను గుర్రం ఎక్కి కూర్చున్నాక ఇస్తువు" అని అమ్మ చేతికి వరహాల మూట ఇచ్చాడు. రామభద్రుడు గుర్రం మీద కూర్చున్నాక గుర్రం పెద్దగా సకిలించి ముందరి కాళ్ళు పైకెత్తింది. ఆ కుదుపుకు అదుపు తప్పి గుర్రం ముందరి కాళ్ళ కింద పడిపోయాడు రామభద్రుడు. గుర్రం తన కాళ్ళతో రామభద్రుడి ఎదలపై బలంగా తన్నింది. రామభద్రుడు నెత్తురు కుక్కుకొని అక్కడికక్కడే మరణించాడు. 


ఆ హటాత్తు పరిణామానికి హతాశురాలై విలవిల లాడుతూ విలపించింది మల్లమ్మ.. ఎల్లయ్య సూరి పరుగున వచ్చి చూశాడు. రక్తం కుక్కుకొని చనిపోయిన రామభద్రున్ని, విలపిస్తున్న ఎల్లమ్మను చూసి చింతించాడు. భార్యను ఓదార్పుతూ ఏమి జరిగిందని అడిగాడు. 


"గుర్రం ఎక్కి కూర్చున్నదాక ఇస్తువు, ఈ వరహాల మూటను పట్టుకో అమ్మా అంటే పట్టుకున్నాను. అంతే గుర్రం పెద్దగా సకిలించి ముందరి కాళ్ళు పైకెత్తింది. రామభద్రుడు అదుపుతప్పి గుర్రం ముందరి కాళ్ళ క్రింద పడిపోయాడు. గుర్రం తన కాళ్ళను బలంగా రామభద్రుడి గుండెలపై పెట్టింది. " చెప్పింది మల్లమ్మ. 


"ఇంకేముంది మనకు రుణం ఉన్న వెయ్యి వరహాలు రామభద్రుడు నీ చేతిలో పెట్టాడు. రుణం తీరిపోయింది. అతను మరణించాడు." అని విచారపడ్డాడు ఎల్లయ్య సూరి.

 

"బాధ పడకు మల్లమ్మా ! ఇప్పుడు నీవు గర్భవతివి. నీ కడుపులో ఉన్నది కారణజన్ముడు. అతడు మనకు రుణం లేడు. మనం అతనికి రుణపడిలేం. తాను భూమి మీద చేయబోయే ఘనకార్యాల కోసం తాను భూమి మీదకి రావడం కోసం మన అదృష్టం కొద్దీ మనల్ని ఎంచుకున్నాడు. అతడు సాధించే విజయాల వలన మనం కూడా ఖ్యాతి పొందుతాం. మనకు ఒక నష్టం జరిగినా ఇంకొక గొప్ప మేలు జరగబోతుంది. కావున బాధపడకు, భవిష్యత్తు కోసం ఎదురు చూడు మల్లమ్మా!" అని ఆమెలో అశాంతిని తగ్గించి ఆశను కలిగించాడు ఎల్లయ్య సూరి. 

 -------

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page