top of page

సంక్రాంతి

Updated: Jan 21

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #సంక్రాంతి, #Sankranthi, #TeluguKavithalu, #Kavitha


Sankranthi - New Telugu Poem Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 14/01/2025

సంక్రాంతి - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


మంచు  ముత్యపు చినుకులలో -  మకర రాశి  కాలములో, 

పొగమంచు  వీడగా - ఉషోదయాన  ఉషస్సు లొలకగా,  

పుష్యమాసపు  వేళలలో - పుష్కలంగా ధాన్యరాశులు  పొంగ గా,

క్రొత్త జంటల రాకతో - క్రొంగొత్త  ఉత్సాహముతో,

భోగి మంటల  వెలుగులలో - చలి మంటలు  కాచుకొనగా,

ఇంటింటా రంగుల  రంగవల్లులు  దిద్దగా- హరిదాసు   కీర్తించగా,  

భట్రాజులు పొగడగా -గంగిరెద్దులు తానమాడగా,

సుదతులు  గానము సేయగా - పడతులు  నాట్యమాడగా,

రంగు  రంగుల  గాలి  పతంగులు  ఎగరగా,

పౌష్యమి  పడతి  వధువుగా  మోహన రాగ మాలపించగా‌,

కాల పురుషుడు   వరుడు గా   ప్రణయ గీతి  పాడగా,

సంకురాతిరి  వేళలలో - సరాగాల  మాలలతో, 

భువియే  వేదికగా - దివియే  పెళ్ళి  పందిరిగా,

అష్టదిక్పాదులు - పంచ  భూతాలు సాక్షులుగా‌

జరిగింది  పరిణయము - కలిగింది  సంబరము.

జగతిన  వచ్చెను  సంక్రాంతి - నలుదిశలా  వెదజల్లెను  క్రాంతి.


….నీరజ  హరి  ప్రభల.










Comentarios


bottom of page