పెద్దయ్య సుద్దులు
- Gadwala Somanna
- Jan 12
- 1 min read
Updated: Jan 21
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PeddaiahSuddulu, #పెద్దయ్యసుద్దులు

Peddaiah Suddulu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 12/01/2025
పెద్దయ్య సుద్దులు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
కలసిమెలసి మెలగాలి
స్నేహ దీపము వెలగాలి
మనసుల్లో నెలకొన్న
అసూయలే తొలగాలి
భేదాలే వదలాలి
ఐక్యతతో కదలాలి
క్షమాగుణం చూపించి
శత్రుత్వం తరమాలి
ప్రేమ సుధలు కురియాలి
హృదయ కమలం విరియాలి
ఆదర్శంలో మాత్రం
చుక్కుల్లా మెరియాలి
వేషభాషలు వేరైనా
కులమతాలు వేరైనా
చెప్పాలోయ్! సమానమని
తారతమ్యాలు వద్దని
-గద్వాల సోమన్న
Comments