top of page

సుభాషితాలు

Updated: Mar 4

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Subhashithalu, #సుభాషితాలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

Subhashithalu - New Telugu Poem Written By Gadvala Somanna

Published In manatelugukathalu.com On 19/02/2025

సుభాషితాలు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


కష్టాల్లో సహనము

నష్టాల్లో ధైర్యము

ఉంటేనే క్షేమము

సమకూరును విజయము


విలువైనది స్నేహము

తేనె వోలె మధురము

కలనైనా కూడా

తలపెట్టకు ద్రోహము


మంచిదైతే విషయము

చేయకు నిర్లక్ష్యము

స్వీకరిస్తే మేలు

లాభము వేనవేలు


పవిత్రమైన హృదయము

భగవంతుని నిలయము

చేయరాదు మలినము

గుర్తించుకో! సతతము


-గద్వాల సోమన్న


Comments


bottom of page