top of page

సూక్తి రత్నావళి

Updated: Jan 1

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #సూక్తిరత్నావళి, #SukthiRathnavali


Sukthi Rathnavali - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 26/12/2024

సూక్తి రత్నావళితెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


కఠినత్వం పోవాలి

కరుణ పూలు విరియాలి

క్షమాగుణం చూపించి

కలసిమెలసి బ్రతకాలి


దేశభక్తి చూపాలి

దేశకీర్తి చాటాలి

వసుధైక కుటుంబముకై

విశ్వశాంతి తేవాలి


అసమానతలు తొలగాలి

ఆత్మీయతలు పెరగాలి

అందరూ సమానమని

గళమెత్తి పాడాలి


ఏక భావం రావాలి

దానికి కృషి చేయాలి

సమైక్యత ముఖ్యమని

సాక్ష్యంగా నిలవాలి


జగతి ప్రగతి కావాలి

యౌవనస్తులు లేవాలి

దేశ రక్షణ కోసమే

ఉప్పెనలా కదలాల


పొరపొచ్చాలు వీడాలి

అందరి మేలు కోరాలి

సడలని విశ్వాసంతో

ముందడుగు వేయాలి



-గద్వాల సోమన్న



Comments


bottom of page