top of page

తల్లి ప్రబోధ గీతిక

Updated: Mar 4

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #TalliPrabodhaGeethika, #తల్లిప్రబోధగీతిక, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 22

Talli Prabodha Geethika - Somanna Gari Kavithalu Part 22 - New Telugu Poem Written By Gadvala Somanna Published In manatelugukathalu.com On 25/02/2025

తల్లి ప్రబోధ గీతిక - సోమన్న గారి కవితలు పార్ట్ 22 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


తల్లి ప్రబోధ గీతిక


కష్టపడితే గనుక

జీవితమే సఫలము

లేకపోతే మాత్రము

అడుగడుగునా విఫలము


ఇల విపత్కాలంలో

యోచించాలి పథకము

పోటీ ప్రపంచంలో

సాధించాలి పతకము


మన దేశ కీర్తి కోసము

ఉండాలోయ్! పౌరుషము

దేశభక్తితో మనము

చేయాలోయ్!సాహసము


ఉంటేనే పట్టుదల

జీవితాన పెరుగుదల

లేకుంటే అభివృద్ధి

క్రమేణా తరుగుదల










టీచర్ ప్రబోధం

----------------------------------------

కష్టాల కొలిమిలో

కన్నీటి లోయలో

ధైర్యమే ఆయుధము

నష్టాల బాటలో


సమస్యల వలయంలో

సునామీల వేళలో

సహనమే శరణ్యము

స్థిరతకది ఆధారము


గుండెల్లో భారము

చేసుకుంటే దూరము

ఎంతైనా క్షేమము

దొరుకుతుంది శాంతము


ఆపదల సమయాన

భయభీతుల హృయాన

పిరికితనము ఉండొద్దు

ఏనాడు జీవితాన











ఎవరినీ మరువరాదు!

----------------------------------------

ఆపదలో ఆదుకొనిన

అక్కరలో సాయపడిన

అమ్మలా ఆదరించిన

ఎవరినీ మరువరాదు!


ఫలాలిచ్చు తరువులను

గొంతు తడుపు చెరువులను

సొగసులీను పూవులను

దేనినీ మరువరాదు!


బుద్ధి చెప్పు గురువులను

మంచి చేయు మిత్రులను

ఇంటిలోని పెద్దలను

ఎవరినీ మరువరాదు!


మన ఘన జన్మ దాతలను

ఇంటి దివ్వెలు వనితలను

రేపటి భారత పౌరులను

ఎవరినీ మరువరాదు!



















తల్లిదండ్రుల హితవు

----------------------------------------

మితిమీరితే తప్పులు

అమితమైన అప్పులు

ఎప్పటికైనా ముప్పు

తగలబెట్టే నిప్పులు


విస్తారమైన మాటలు

మచ్చ తెచ్చే చేతలు

మిక్కిలి ప్రమాదకరము

అదుపు తప్పిన తలపులు


నీటి మీద రాతలు

నిస్సారపు జలములు

శోధింపగ లోకాన

నిలకడ లేని మనుషులు


గురువులు లేని చదువులు

చమురు లేని ప్రమిదలు

అంతంత మాత్రమేనోయ్!

అభివృద్ధి లేని బ్రతుకులు


















దైవ స్వరూపులు తల్లిదండ్రులు

----------------------------------------

కన్నవారి కళ్ళల్లో

ఆనందం చూడాలి

వారి చిరు ఆశల్లో

జీవాన్నే నింపాలి


తల్లిదండ్రులను మహిలో

దీవెనగా తలవాలి

వారిని సదా మదిలో

గూడు కట్టుకోవాలి


తల్లిదండ్రుల త్యాగము

కడవరకు గుర్తుండాలి

వారు చూపు ప్రేమలను

అర్థం చేసుకోవాలి


భగవంతుని స్వరూపము

జీవితాల్లో దీపము

అమ్మానాన్నలు కదా!

గుర్తించుకొమ్ము సదా!


-గద్వాల సోమన్న


Comments


bottom of page