top of page
Original_edited.jpg

తెలంగాణా

Updated: Jul 7, 2024


ree

'Telangana' - New Telugu Poem Written By M. Laxma Reddy

Published In manatelugukathalu.com On 20/06/2024

'తెలంగాణా' తెలుగు కవిత

రచన: M. లక్ష్మా రెడ్డి


ప్రియభారతాన కడురమణీయం .. నా తెలంగాణం..

కోటిరతనాల సిరులమయం ..మన తెలంగాణం ..


గణపతిదేవ రుద్రమల పాలనావైభవం

భీమ పోతన గోపన్నల రచనాపాఠవం

కృష్ణా గోదారుల

గలగలల సంగీతం

దాశరథి సినారేల

కవితామృత సాహిత్యం ..


బాసర భద్రాద్రి

నలుచెరుగుల దేవుళ్ళు ..

అడుగడుగునా మహనీయులు నెలవైన ఆనవాళ్ళు ..

తూరుపుకనుమల..

జలపాతహొయలు ..

నదీవనాల

నిరంతర సోయగాలు..


సుద్దాల కొమరంల ధీరచరితలస్ఫూర్తి ..

బూర్గుల జయశంకర్ ల తీరైనరాజనీతి ..

ఓరుగల్లు

వేయిస్థంబాలకీర్తి

ఏకశిలాబుద్ధుడి

నిలువెత్తుఖ్యాతి ..


గోల్కొండ భోంగిరిల రాచరికఠీవి

చార్మినార్ సాక్షిగా సామరస్యరీతి ..

నిర్మల్ బొమ్మల నవ్యతా శైలి ..

తెలుగుఉర్దూల విడలేని మైత్రి ..


వేలాది అమరవీరుల

త్యాగానికి ప్రతీక ..

నాయకుల యేళ్ళ

పోరాటఫలమీ స్వేఛ్చాగీతిక ..


మనవేషభాషా చందాన్ని ..

సంస్కృతి విలువల బంధాన్ని..

సదా వినిపించనీ ..


విశ్వ వేదికపై తెలంగాణా

కీర్తి పతాకని..

ఉవ్వెత్తున ఎగరనీ ..

ఎల్లవేళలా రెపరెపలాడని..


నా తెలంగాణా..

నవ తెలంగాణా..

జై తెలంగాణా..

జై జై తెలంగాణా..


తెలంగాణా రాష్ట్ర ప్రజలకి అంకితం..


M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

 ఇక్కడ క్లిక్ చేయండి.


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ 


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/laxmareddy

నేను లక్కీ.. లక్మారెడ్డి 

రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..

అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..

నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..

నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...

ధన్యవాదాలు...



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page