తెలుగు భాషలందున వెలుగు
- Gadwala Somanna
- Feb 21
- 1 min read
Updated: Mar 4
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Naneelu, #నానీలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

Telugu Bhashalanduna Velugu - New Telugu Poem Written By Gadvala Somanna
Published In manatelugukathalu.com On 21/02/2025
తెలుగు భాషలందున వెలుగు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
భాషలందున వెలుగు
తేనెలాంటిది తెలుగు
మనసుపెట్టి చదివిన
ఆనందమే కలుగు
చక్కని నుడికారం
చిక్కని అలంకారం
కల్గినట్టి భాషరా!
తెలుగోళ్లకు శ్వాసరా!
అందమైన తెలుగురా!
అక్షరాల నిజమురా!
తెలుగు పరిరక్షణకు
చేయి చేయి కలుపరా!
రాయలు నాటి కీర్తి
తేవాలి! తేవాలి!!
అందరిలోన స్ఫూర్తి
నింపాలి! నింపాలి!!
-గద్వాల సోమన్న
Comments