తాతయ్య పాఠశాల చదువు ముచ్చట్లు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Apr 3
- 4 min read
#ThathaiahPatasalaChaduvuMuchhatlu, # తాతయ్యపాఠశాలచదువుముచ్చట్లు, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Thathaiah Patasala Chaduvu Muchhatlu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 03/04/2025
తాతయ్య పాఠశాల చదువు ముచ్చట్లు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో ఆంగ్ల మాద్యమంలో ఐదవ తరగతి చదువుతున్న శ్రీకాంత్ ఆదివారమైనందున ఊరి నుంచి తాతయ్య నాయనమ్మ తెచ్చిన చెరుకుముక్క నములుతూ మాటల మద్యలో నాయనమ్మ ద్వారా తాతయ్య తన చిన్న తనంలో పాక బడి (హట్ స్కూల్) లో చదివారని తెలిసి ఆశ్చర్యంగా, వాలు కుర్చీలో తెలుగు దిన పత్రిక చదువుతున్న తాత సీతారామయ్యని అడిగి తన సంశయాన్ని వెలిబుచ్చాడు.
తాతయ్య దిన పత్రిక పక్కన పెట్టి మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదివినందున అనుమానాల్ని తీరుస్తూ, తెలుగు పదాలు అర్థం కావని మద్యలో తెలుగు ఆంగ్లంలో చెబుతూ "ఔనురా, మనవడా! మా చిన్నప్పుడు కమ్మల పాకబడి లోనే చదువు కున్నాను. ఇంటి దగ్గర నుంచి కాలినడకన చెప్పులు(స్లిప్పర్స్) లేకుండా ఒక మైలు దూరం నడిచి పాఠశాలకు వెళ్లే వాళ్లం.
ఇప్పటి స్కూల్ పిల్లల్లాగ రంగుల యూనిఫారాలు, కాళ్లకు షూస్, బుక్సుకు బేగులు, స్కూల్ బస్సులు, టిఫిన్ బాక్సులు ఉండేవి కాదు. నిక్కరు కమీజు వేసుకునే వారిమి. మగపిల్లలు ఆడపడుచులు కలిసి చదువుకునే వాళ్లం.
స్కూలుకి వెల్తూనే మేమే పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి చుట్టూ పూలమొక్కలు పెంచి నీళ్ళు పోసి పచ్చగా ఉంచే వారిమి. ఉదయం పాఠశాలకు రాగానే పరిసరాలు శుభ్రమైన తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు 'వందేమాతరం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ప్రార్థన గీతం, జనగణమణ జాతీయగీతం' ఆలపించిన తర్వాత తరగతులు మొదలయేవి.
ప్రైమరీ స్కూలులో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండేవి. మట్టి దిమ్మల మీద కూర్చుని చదువు నేర్చుకునే వారిమి. అప్పట్లో ప్లే స్కూల్స్, నర్సరీ, లోవర్ కె. జి, అప్పర్ కె. జి ఉండేవి కావు. ఫైవ్ ఇయర్స్ వయసు పూర్తయిన తర్వాతే అక్షరాభ్యాసం చేసి పాఠశాలకు పంపేవారు.
ఫస్టులో తెలుగు అక్షర మాల 'అఆ ఇఈ 'లు మెత్తటి ఇసుక (సేండ్ )లో కుడి చేతి వేలితో దిద్దించిన తర్వాత పలక(స్లేట్) మీద బలపం(చాక్) తో రాయించేవారు. ఐదవ తరగతి (ఫిఫ్తు క్లాస్) వరకు తెలుగు మీడియంలో చదువు జరిగేది. చిన్న గుడ్డ (క్లాత్) సంచిలో అన్ని సబ్యక్టుల పుస్తకాలు సరిపోయేవి. తరగతి విరామం (ఇంటర్వెల్)లో చెట్ల కింద ఆటలు పాటలు జరిగేవి.
ఆగష్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా వందనం జరిగేది. దసరా నవరాత్రులపుడు పిల్లలం రంగుకాగితాల వెదురు బాణాలతో రంగురంగుల పువ్వులు వెంట పెట్టుకుని టీచర్స్ తో కలిసి ప్రతి విద్యార్థి ఇంటి ముందు దసరా పద్యాలు, పాటలు పాడుతు వారిచ్చే పప్పుబెల్లాలు.
పిప్పరమెంట్లు తెచ్చి పంచుకునేవాళ్లం. టీచర్స్ కి రూపాయలు కానుకలుగా ముట్టేవి." అని తాతయ్య
చెబుతూండగా
"మరి టీచర్సు పనిష్మెంటు ఇచ్చేవారా?" అనుమానం వెలిబుచ్చాడు శ్రీకాంత్.
తాతయ్య నవ్వుతూ "పనిష్మెంట్లు ఉండేవి. సరిగ్గా చదవకపోతే నెత్తి మీద మొట్టికాయలు, అల్లరి చేస్తే గుంజీలు, గోడకుర్చీ, ఒంటి కాలి మీద నిలబెట్టేవారు. బెత్తం (స్టిక్ )తో అరచేతి మీద కొట్టేవారు. " అని వివరంగా చెప్పేరు.
"స్టూడెంట్స్ ని పనిష్ చేస్తే టీచర్స్ ని ఏమీ అనరా ? " అమాయకంగా అడిగాడు.
"చదువులు బాగా రావాలంటే స్టూడెంట్స్ కి పనిష్మెంటు ఉండాలి అంటారు." సమాధానం చెప్పేరు సీతారామయ్య గారు.
"ఇంట్లో మీ పేరెంట్సు మిమ్మల్ని ఏమీ అనరా?" మరొక డౌటు వెలిబుచ్చాడు.
"మా నాన్నగారు అంటే బిగ్ గ్రాండ్ పా మేము అల్లరి చిల్లర పనులు చేస్తే వీపు మీద పిడి గుద్దులు వేసేవారని శ్రీకాంత్ ని దగ్గరకు పిలిచి వాడి వీపు వంచి పిడికిలి బిగించి ఇలా అని డెమో ఇచ్చారు. వాడు నవ్వుతూ పక్కనే ఉన్న నాయనమ్మ ఒళ్ళో ఒదిగిపోయాడు.
మళ్లీ తాతగారు చెబుతూ" తప్పు జరిగితే మా చేత గుంజీలు తీయించి కప్పగంతులు '( ఫ్రాగ్ జంప్సు ')చేయించే వారని, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టకపోతె బెత్తం (స్టిక్) తో చేతి మీద కొట్టేవారని అందువల్ల మాకు నాన్నంటే భయమనీ అమ్మ దగ్గరే చనువు 'ఫ్రీడమ్' ఎక్కువ" అన్నారు.
శ్రీకాంత్ ఇంకొక డౌటు అడుగుతు" మీకు స్కూల్లో ఇంగ్లీష్ నేర్పలేదా ?" అడిగాడు.
"ఆరవ తరగతి అంటే సిక్తు క్లాసు హైస్కూలు నుంచి ' ఎ బి సి డి ' లు ఇంగ్లీష్, అలాగే హిందీ అక్షరాలు మొదలు పెట్టే వారు. " అన్నారు.
ఆ మాటలు విన్న శ్రీకాంత్ నోటి దగ్గర చెయ్యి పెట్టుకుని నవ్వసాగేడు.
తాతయ్య తన ప్రసంగంతో ముందుకు సాగుతూ
"మేము పదవతరగతి అంటే టెన్త్ క్లాస్ వరకు మాతృభాష తెలుగులోనే చదువు కున్నాము. చందమామ బాలమిత్ర బొమ్మరిల్లు బుజ్జాయి లాంటి పిల్లల బొమ్మల పుస్తకాలు గ్రంథాలయం ( లైబ్రరీ )లో చదివే వాళ్ళం. ఎక్కాల పుస్తకం పెద్ద బాలశిక్ష వేమన శతకం సుమతీ శతకం భాస్కర శతకం వల్లె వేసే వాళ్ళం. తెలుగు వారాలు నక్షత్రాలు నెలలు సంవత్సరాలు కంఠస్తం చేసే వారిమి. "
తాతయ్య చెప్పే కబుర్లు ఏవో అద్భుత విషయాలు విన్నట్టు
ఆశ్చర్య పోతూ "తాతయ్యా ! నాకు తెలుగు అక్షరాలు నేర్పండి. నేను తెలుగు బొమ్మల కథల పుస్తకాలు చదువుతాను. నా దగ్గర ఇంగ్లిష్ కామిక్సు బుక్సు, కార్టూన్ బుక్సే ఉన్నాయి. అగ్రహారం విలేజ్ కి వచ్చి నప్పుడు బుల్లక్ కార్టు (ఎడ్ల బండి ) ఎక్కుతా" అన్నాడు.
"అలాగే లేరా, ఈసారి వేసంగి శలవుల్లో నీకు తెలుగు నేర్పుతాను " అన్నారు తాతయ్య.
ఉద్యోగరీత్యా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న కొడుకు కోడలు మనుమడు హైదరాబాదుకు వచ్చినందుకు ఆనందించారు సీతా రామయ్య దంపతులు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
댓글