top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 5


'Tholagina Nili Nidalu episode 5' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు. ఆ వూరు వదిలి వెళ్లాలనిపించదు అతడికి.


వెన్నెలను కలిసి తన భావాలు వ్యక్తపరుస్తాడతడు.


మౌనంతో తన అంగీకారం తెలుపుతుందామె.


తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుందామె.

వెన్నెల వివాహం చంద్రంతో జరుగుతుంది.

ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 5 చదవండి.


పెళ్ళైన రెండు నెలలకే సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్త అల్లుడు పండక్కి రావటం.. పండుగ సరదాలు, పండుగ పెట్టుళ్ళు ఓ.. ఇంక చెప్పేదేముంది. తెలుగు లోగిళ్ళలో

సంకురాతిరి సంబరాలు.


తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగ. ఈ రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే సమయానికి ప్రాధాన్యత నిస్తారు.

దక్షిణాయనమునకు చివరిరేజును భోగిపండుగగాను, ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభ సమయమందు మకరసంక్రాంతి గను జరుపుకుంటారు.


మూడవరోజును కనుమ పండుగ గా జరుపుకుంటారు. ఈ సంక్రమణపుణ్యకాలంలో చేసే దాన, జప, హోమాలకు విశేషఫలము లభిస్తుంది.


సంక్రాంతి అంటేనే మార్పు. సూర్యుడి చలనం మూలంగా వాతావరణంలో అనుకూలమైన మార్పులు సంభవించి మెట్ట, మాగాణి పంటలు సమృద్ధిగా పండి, రైతులకు ఆదాయం లభించడంతో పాటు బంతిపూల రంగవల్లుల

హంగులతో పల్లెలు, పట్టణాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది.


దిక్చక్రంపై సూర్యుడు తూర్పునుంచి పడమరకు పరుగు తీసేందుకు సన్నద్ధమయ్యేవేళ.. లేలేత కిరణాలు వాలుగా మేఘాలమధ్య దోబూచులాడుతూ తూర్పు ఆకాశాన్ని నారింజ వర్ణరంజితం చేసేవేళ.. కువకువల ప్రభాతభేరిలో పక్షులు జగతికి మేలుకొలుపు గీతం పాడే వేళ.. కల్లాపి చల్లి పచ్చగా ఉన్న ఇంటి ముంగిళ్ళలో మన పల్లెలు ఎంతో ముచ్చటగొలుపుతాయి.


ఇంటి ముంగిట పేడతో కల్లాపి చల్లి ముగ్గు పెట్టడం శుభసంకేతం. ముగ్గు వేయడం సృజనాత్మకతకు నిదర్శనం. ఇది స్త్రీలకే సొంతం. వెన్నెల ముగ్గులు వేయ

డము లో అందె వేసిన చెయ్యి. ముగ్గుల్లో ఎన్నో రకాల ముగ్గులు ఉన్నాయి. రోజుకో ముగ్గు చొప్పున పెట్టే చుక్కల ముగ్గు, మెలిక ముగ్గు, గీతల ముగ్గు.. ఇలా ముగ్గులు

వేస్తుండేది. ప్రత్యేకంగా ధనుర్మాసం రోజులు. ఈ మాసంలో లోనే సంక్రాంతి వస్తుంది.


ఈ సమయంలో పోటీలుపడి ముగ్గులు వేసేది. వాకిట్లో కళ్ళాపి జల్లి ముగ్గు వేసిన తరువాతే పొయ్యి వెలిగించడం నేటికీ పల్లెల్లో ఉన్న ఆచారం. కవులు ఎందరో తమ కావ్యాల్లో ముగ్గులను గురించి వర్ణించారు.


ముగ్గు పొడిని ఊళ్ళో వేరుగా తయారు చేయించుకునేది. సున్నపురాయిని మెత్తగా చూర్ణం చేసి ముగ్గుపొడిని తయారు చేస్తారు. తెల్లగా ఉండే ఆ పొడి శాంతికీ, స్వచ్ఛత

కూ శుభానికి సంకేతం. కొంత మంది ఇందులో బియ్యపుపిండిని కలుపుతారు. బియ్యపు పిండి చీమలకు, కీటకాలకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొద్దున, సాయంత్రం ముగ్గులు వేస్తారు. ఉదయం వేసే ముగ్గుల్లో అడ్డుగీతలు ఉండవు. పొడుగ్గా గీతలు గీసి చుక్కల ముగ్గును వాటి మధ్య చక్కగా తీర్చిదిద్దుతారు

ముగ్గను చక్కగా తీర్చిదిద్ది వాకిలి పరిశుభ్రంగా ఉంచిన ఇల్లాలి పనితనానికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ ఇంటిలోకి ప్రవేశిస్తుందని ఓ నమ్మకం.


ఆరోగ్యరీత్యా కూడా ముగ్గు వేయడం ప్రాధాన్యత కలిగిందే. సూక్ష్మక్రిములు, కీటకాలు సున్నపు ఘాటుకు నశిస్తాయి. ఆవుపేడను నీళ్ళలో కలిపి కళ్ళాపి చల్లడం

వెనుక శాస్త్రీయత దాగుంది. ఆవుపేడ క్రిమిసంహారిణి. పెందలకడనే నిద్రలేచి వాకిలి ఊడవడం, కళ్ళాపి చల్లడం, ముగ్గు వేయడం స్త్రీలకు మంచి వ్యాయామంగా

ఉంటాయి. రకరకాల ముగ్గులు వేయడం వలన సృజనాత్మకత శక్తి పెరుగుతుంది.


ముగ్గుల్లో గణితం ఇమిడి ఉండటం మరో ప్రత్యేకత. చుక్కలు పెట్టడం లో తేడా వస్తే ముగ్గు అస్తవ్యస్తమవుతుధి. ప్లస్‌, మైనస్‌, ఇంటూ, ఈజ్‌ఈక్వల్‌టూ, సున్నా గుర్తు

లు ముగ్గులు వేయటంలో ఉపయోగిస్తారు. చతురస్రం, సరళరేఖ, వృత్తాలు, త్రికోణాలు స్వస్తిక్‌ లాంటివి గణితాన్ని స్ఫురింపజేస్తాయి.


మమతల ఆహ్వానము

------------------------------------

హేమంత నిశీదిలో ఉత్తరాయణ కాంతులు

మామిడాకుల తోరణాలు బంతిపూల స్వాగత గీతికలు

గొబ్బెమ్మల మురిపాలతో రంగులీను ముంగిళ్ళు

గంగిరెద్దుల ముచ్చట మురిపాలధ్వనులు


బుడ బుక్కల జోస్యాలు డూడూ బసవన్నల విన్యాసాలు

భోగి మంటల చిటపటలతో చలిగాలుల సరిగమలు

పాలు, కొత్త పొంగళ్ళ రుచులతో సంక్రాంతి సంబరాలు

పిండి వంటల ఘుమ ఘుమలతో కనుమ వేడుకలు


శోభించే బొమ్మల వేడుకల కొలువులు

నిండు ముత్తయిదువులు నిండైన దీవనలు

కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులతో

సంక్రాంతి లక్ష్మికి మమతల ఆహ్వానం.


అచ్చట్లు, ముచ్చట్లు, అలకపానుపులతో హాయిగా సంక్రాంతి పండుగ సంబురాలు గడిచిపోయింది.


వేరే ఊళ్ళో వెన్నెల, చంద్రంలు కాపురం పెట్టారు. ఇప్పటి వరకూ అణగారిపోయి ఉన్న పురుషాహంకారాలు రివ్వున బుసలు కొట్టుకుంటూ విజృంబంచడం మొదలెట్టాయి. అనగా చీటికి మాటికి సణగడం, ఏదో నెపం పెట్టి

దెప్పిపొడవడం, ఏడిపించడం ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి.


వీటన్నింటినీ చూస్తూ వెన్నెల రాటుదేలిపోయింది.

ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఉన్నట్టుండి వెన్నెల కూడా ఒక శుభముహూర్తాన ఉద్యోగములో జాయినైపోయింది.


దాంతో ఎక్కడలేని పురుషాహంకారము చంద్రానికి దెబ్బతింది. చచ్చినట్టు తను కూడా పనులు చేయక తప్పలేదు. వెన్నెల కూడా తనకు వీలైనంత వరకే చేసి వెళ్ళిపోయేది.

-------------------------------

అదేపనిగా సెల్‌ మోగుతుంటే వెళ్ళి తీసింది యమున, ఎవరు చేశారా అని పేరు చూస్తూ.


అది తన ఫ్రెండు వెన్నెల నుంచి. దీనికి ప్రొద్దున్నే ఏం వచ్చింది? అనుకుంటూ ఆన్‌ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.

"పేపర్‌ చూశావే.. ?” అడిగింది వెన్నెల ఆతృతగా.


"పేపరా? ఎందుకు.. ? ఏం?.. ” యమున అడిగింది.

"మనో ఉరఫ్‌ మనోరమ కనబడుట లేదు" అన్నది.

"కనబడుట లేదా? లేచిపోయిందా?.. ”

"అవును.. నాలుగు రోజులనుంచి కనిపించడం లేదు. ఆమె రూమ్‌మేట్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కంప్లైంట్‌ ఇచ్చారు. పోలీసులు చెప్పినదే పేపర్లో వచ్చిన వార్త. చదువు”

చెప్పింది వెన్నెల.

" నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదా?.. అదంతా ట్రాష్‌.. ఎవడితోనో షికారు కెళ్ళి ఉంటుంది” యమున అన్నది తేలిగ్గా.


"నేనూ అలానే అనుకున్నాన్లే.. దాని తిరుగుళ్ళు తెలిసిందేగా.. ఇంతకీ నా మాజీ మొగుడుతో కానీ వెళ్ళలేదుగా.. ” వెన్నెల అన్నది.


"ఇంకా మాజీ కాదు.. "


"కాదులే అయినా; నేను విడిచి వచ్చేసిన భర్తను. "


"ఇది కరెక్ట్‌ ;.. ”

"వెళితే మాత్రం నీ కేంటి?” యమున కావాలనే అంది. వెన్నెల ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దామని.


"ఊరికే అన్నానులే.. ఎలా తిరిగితే నా కేంటి?.. ” వెన్నెల తేలిగ్గానే అన్నది.


"వంశీ.. ఇది విన్నావా? మనో.. అదే మనోరమ.. వెన్నెల మాజీ మొగుడు చంద్రం గర్ల్‌ఫ్రండ్‌ నాలుగు రోజుల నుంచి మిస్సింగట. పేపర్లో వచ్చిందట.. చూడు.. " భర్త

వంశీకృష్ణ దగ్గర కొచ్చి చెప్పింది యమున. అతడు అప్పుడే కాఫీ తాగుతూ పేపర్‌ చదువు తున్నాడు.


భార్య అన్నమాటకు విస్మయంగా ముఖం పెట్టి, గబగబా టాబ్లయిడ్‌ సిటీ ఎడిషన్‌ చూసి పేజీలు వెతికాడు.


"ఉద్యోగిని మనోరమ కనబడుట లేదు" అన్న హెడ్డింగ్‌

ఉంది. వార్త యమున కూడా వినేటట్లు పైకి చదివాడు. వెన్నెల చెప్పిన విషయాలు అందులో ఉన్నాయి.


"మిస్సింగా.. పాడా.. ఎవడి తోనో షికారు కెళ్ళి ఉంటుంది" అన్నాడు వంశీ తేలిగ్గా.


"నీకు అలానే అనిపించిందా?.. నేనూ అదే అనుకున్నాను.. ” యమున అన్నది.


“ఇలాంటివన్నీ సగానికి సగం అబద్దాలే వుంటాయి.. ఏదో కవర్‌ చేసుకోవడానికి అసలు వాళ్ళు ఏదో చెబుతారు. పోలీసులు చెప్పేది వేరొకటి.. ” అన్నాడు వంశీ.


“సరేలే! ఆ గొడవ మనకెందుకు గానీ.. నువ్వు రెడీ అవ్వు. గీజర్‌ వేశాను. నువ్వు స్నానం చేస్తే పాపకి చేయిస్తాను.. ” అంటూ ఆమె కిచెన్‌ లోకి వెళ్ళింది. అయితే ఆమె ఆలోచనలు మనోరమ అదృశ్యం వెనక ఉన్న వార్త చుట్టూ తిరుగుతున్నాయి.


నిజంగా కనబడకుండా పోయిందా.. లేక ఏదైనా జరిగిందా?.. అని పరి పరివిధాల ఆలోచించింది. ఆమె ఆఫీసుకు వెళ్ళే వరకూ ఆ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






89 views0 comments

Comments


bottom of page