top of page

త్యాగమయి తల్లి

Updated: Mar 8

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThyagamayiThalli, #త్యాగమయితల్లి, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 23

Thyagamayi Thalli - Somanna Gari Kavithalu Part 23 - New Telugu Poem Written By Gadvala Somanna Published In manatelugukathalu.com On 27/02/2025

త్యాగమయి తల్లి - సోమన్న గారి కవితలు పార్ట్ 23 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


త్యాగమయి తల్లి


మంచులాగ చల్లన

పాలలాగ తెల్లన

అమ్మ మనసు చూడగ

మల్లెపూల వాసన


అమ్మ పలుకు తీయన

ఆమె ఇంట దీవెన

కుటుంబ ఎదుగుదలకు

మమకారపు వంతెన


పువ్వులాగ మెత్తన

నీరెండలా వెచ్చన

అమ్మ విడి పిల్లలకు

కల్గించును సాంత్వన


అమ్మపై ఆరాధన

పెంచుకో! హృదయాన

ఆమెవంటి త్యాగము

కానలేము లోకాన

ree















అక్క హితోక్తులు

----------------------------------------

గొంతు తడుపును యేరు

సద్గుణమిచ్చు పేరు

శోధింపగ భువిలో

కాదు మంచిది పోరు


హాని చేయును నోరు

అదువు చేయుము నోరు

సభ్య సమాజంలో

బాగుండాలి తీరు


సాయపడేది టైరు

ఉపయోగమే పైరు

చదువు దూరమైతే

బ్రతుకే తారుమారు


వదరుబోతుల నోరు

వట్టి సంద్రపు హోరు

ప్రమాదకరము చూడ

ఎవరు అపగలేరు

ree











అమ్మ కోరిక

----------------------------------------

చదువులు బాగా చదవాలి

ఉన్నతంగా ఎదగాలి

సంస్కారమే నేర్చుకుని

సమ సమాజంలో బ్రతకాలి


క్రమశిక్షణతో మెలగాలి

ఆదర్శంగా నిలవాలి

అందరి మనసులు గెలవాలి

అన్యోన్యంగా సాగాలి


దుస్తుల సాంగత్యమానాలి

సజ్జనుల పొత్తు కోరాలి

సుగుణాల సరాలను ధరించి

దుర్గుణాలే తరిమి కొట్టాలి


పెద్దలను గౌరవించాలి

శ్రద్ధగా పాఠాలు వినాలి

ఉద్ధరించే బాటలోనే

ముద్దుగా సాగి పోవాలి


గురుదేవుల పేరు నిలపాలి

అనిశము వారిని తలవాలి

కీడు చేసిన వారికి సైతం

మేలుతో కళ్ళు తెరిపించాలి


అప్పు నిప్పని ఎరుగాలి

ముప్పు తెచ్చునని తెలపాలి

దానికి బహు దూరముండాలి

ఉన్న దానితో తృప్తి చెందాలి

ree













అసాధ్యం!!

----------------------------------------

సాగరాన్ని తోడి తోడి

విజ్ఞానం పంచి పంచి

ఖాళీ చేయగలమా!

ఎవరికైనా సాధ్యమా!


అరచేతిని అడ్డుపెట్టి

సూర్యుణ్ణి ఆపగలమా!

భగవంతుని మభ్యపెట్టి

క్షణమైనా మనగలమా!


కన్నవారి త్యాగాన్ని

గురుదేవుల జ్ఞానాన్ని

కాసింత కొలవగలమా!

ఇల లెక్కగట్ట గలమా!


సదనంలో పెద్దలను

గగనంలో తారలను

చూసి నేర్చుకోవలెను!

పరిహాసం మానవలెను!


సృష్టిలోన ఎన్నెన్నో

మనం లెక్కించ లేనివి

మానవ మేధస్సుకు

కడు అంతుపట్ట లేనివి

ree









గురువు ప్రబోధ గీ(నీ)తి

----------------------------------------

పువ్వులా నవ్వరా!

దివ్వెలా వెలగరా!

గువ్వలా విహరిస్తూ

మువ్వలా మ్రోగరా!


శ్రద్ధగా చదవరా!

బుద్ధిగా మసలరా!

శుద్ధమైన మనసుతో

వృద్ధిలోకి రా!రా!


మొక్కలా ఎదగరా!

చుక్కలా పొడవరా!

తిక్క తిక్క పనులు మాని

పక్కిలా బ్రతకరా!


కన్నోళ్లను చూడరా!

ఉన్న ఊరు మరువకరా!

పక్కవారితో కలసి

పక్కాగా ఉండరా!


హద్దులను దాటకరా!

మొద్దుబారి పోకురా!

అద్దంలా ఉంటూనే!

పెద్దరికం చూపరా!


-గద్వాల సోమన్న


Comments


bottom of page