top of page

త్యాగమూర్తి తల్లి

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThyagamurthyThalli, #త్యాగమూర్తితల్లి, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 51

Thyagamurthy Thalli - Somanna Gari Kavithalu Part 51 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 04/04/2025

త్యాగమూర్తి తల్లి - సోమన్న గారి కవితలు పార్ట్ 51 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


త్యాగమూర్తి తల్లి

----------------------------------------

తల్లి లేని లోకము

తల్లడిల్లు సతతము

ఆమె లేక శూన్యము

ఆనందం మాయము


అమ్మ ఉన్న కళకళ

తారల్లా మిలమిల

దూరమైతే గనుక

కుటుంబమే విలవిల


ఘనం అమ్మ స్థానము

పూరింప అసాధ్యము

చెంత ఉన్నప్పుడే

చూసుకొనుట ధర్మము


ప్రేమకు ప్రతిరూపము

తల్లి ఇంట దీపము

వ్రాయ లేరు ఎవరూ

ఆమె చూపు త్యాగము

ree















చెట్టు తల్లి ప్రేమ ఘనము

----------------------------------------

చెట్టు తల్లి నీడలో

హాయి చాలా ఉన్నది

జీవకోటికి తనలో

ఆశ్రయమిచ్చుచున్నది


తల్లివంటి ప్రేమతో

కడుపు నింపు చున్నది

నిరుపమాన త్యాగంతో

అన్నింటిలో మిన్నది


పచ్చని కొమ్మలతో

అందాలొలుకుచున్నది

ఔషధ గుణాలతో

మేలు చేయుచున్నది


తరువులే లేకుంటే

భూగోళమే ఎడారి

చెట్టు విలువ తెలుసుకో

ఇకనైనా చదువరి

ree















తల్లి అడుగుజాడల్లో...

----------------------------------------

తల్లి నడుపు బాటలో

ఆమె చెప్పు మాటలో

సంక్షేమమే ఉన్నది

సంతోషమిచ్చునది


అమ్మ కొంగు నీడలో

అనురాగాల మేడలో

ఆహ్లాదమే ఉన్నది

అవనిలోన మిన్నది


తల్లి చూపు ప్రేమలో

త్యాగాల వాడలో

స్వర్గ సీమ ఉన్నది

కుటుంబ ఖ్యాతి నిలుపునది


అమ్మ మనసు అమృతము

అక్షరాల వాస్తవము

అవసాన వేళలో

ఆదరిస్తే పుణ్యము

ree



















అమ్మ సద్బోధ

----------------------------------------

గుండెల్లో దేశభక్తి

అమితంగా పెంచుకొని

చదువు మీద అనురక్తి

నలుగురితో పంచుకొని


చాటాలోయ్! దేశకీర్తి

కొండల్లో,కోనల్లో

పదిమందికి ఘన స్ఫూర్తి

ఇవ్వాలోయ్! బ్రతుకుల్లో


పొరుగువారి లోపాలను

పదే పదే చూపరాదు

నోటితో శాపాలను

ఏమాత్రం పెట్టరాదు


హద్దులేని తలపులతో

బుద్ధిలేని పలుకులతో

చెరువు చేసుకోరాదు

హాని తలపెట్టరాదు


మాటిమాటికి కలహాలు

పరస్పర దూషణలు

సమైక్యతకు భంగపాటు

జీవితాన క్రుంగబాటు


కలసిమెలసి ఉంటేనే

జగతి ప్రగతి సాధ్యము

వాదోపవాదాలను

వీడితే సంతోషము

ree











తల్లి తపన

----------------------------------------

బుద్ధిగా బడికి పోవాలి

శ్రద్ధగా చదువు చదవాలి

హద్దులను పాటించి ఇల

శుద్ధంగా బ్రతకాలి


బద్దకమే వీడాలి

ఉద్ధరిస్తూ సాగాలి

ముద్దులొలుకు బాలలై

అద్దంలా ఉండాలి


చక్కని త్రోవ చూపాలి

చుక్కల వోలె మారాలి

అక్కరలో సాయపడి

మిక్కిలి మంచి చేయాలి


అడ్డంకులు దాటాలి

లడ్డు రీతి కావాలి

చెడ్డ వారి స్నేహాన్ని

బిడ్డా!మాను కోవాలి


ree

-గద్వాల సోమన్న


Comments


bottom of page