top of page

ఉగాది కవితా లత

Updated: Apr 4

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఉగాదికవితాలత, #UgadiKavithaLatha, #ఉగాదికవిత

Ugadi Kavitha Latha - New Telugu Poem Written By R C Kumar

Published In manatelugukathalu.com On 30/03/2025

ఉగాది కవితా లత - తెలుగు కవిత

రచన: ఆర్ సి కుమార్

 

అనాదిగా వస్తున్నది అన్యోన్యంగా గడిపే  ఉగాది  

తెలుగు వెలుగులకు శ్రీకారం చుట్టేది ఈ సంవత్సరాది

వచ్చే ప్రతిసారీ తెచ్చేది సంతోషాల ప్రోది

చైత్ర శుద్ధ పాడ్యమి నాటి సంబరాల గాది

శిశిరానికి అంతం పలికి, వసంతానికి వంత పాడే పచ్చ తోరణం

పచ్చిక బయళ్ళ పచ్చదనంతో ప్రకృతి కాంత సుమనోహరం 

కోకిలపాటకు సాకారం లేత చిగుళ్ళ ఆహారం  

అంబర చుంబిత సంబరం, ఈ సంవత్సరాది  శుభారంభం    

షడ్రుచులతో స్వాగతం విశ్వావసు నామ సంవత్సరం

దేశ, విదేశాల్లో విరాజిల్లే తెలుగు జాతికి వరం 

తెలుగు క్యాలెండర్లో నూతన అధ్యాయం

ఆరుగాలశ్రమకు ఫలితం ఉగాది ఉషోదయం 

ఆత్మీయ కలయికలతో పండుగ నిండుదనం  

కవి సమ్మేళనంలో గుబాళించే కవితా సౌరభం  

ఆరురుచుల ఉగాదిపచ్చడి అమృతతుల్యం

తెలుగోడి తీపి కలలకు సాకారం 

తమ్ముళ్ల ప్రేమాభిమానం, తెలుగు మహిళల మమకారంతో 

ఆప్యాయతలు పెంచుకునే పలకరింపులు

పంచాంగ శ్రవణాలతో ఆదాయ ఫలాలు

ధర్మంగా,నింపాదిగా సంపాదించే సంపదలు 

తృప్తినిచ్చే జీవితాలకు ఆనంద మాలికలు

అంబరమంటే సంబరాలకు నేపథ్యాలు 

తెలుగుతనం ఉట్టిపడే నాట్య విన్యాసాలు 

వీనుల విందైన సంగీత సంధ్యా సరాగాలు 

శుభాకాంక్షలపర్వం ఉగాది పండుగకు శ్రీకరం   

దైవాశీస్సులతో కలగాలి అందరికీ శుభకరం 

***

ఉగాది శుభాకాంక్షలతో 

ఆర్ సి కుమార్, సామాజిక వేత్త


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page