top of page
Original.png
Rayala Sreeramachandra Kumar

Rayala Sreeramachandra Kumar

Writer

writer

More actions

Profile

Join date: 5, డిసెం 2025

About

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Overview

First Name
Sreeramachandra Kumar
Last Name
Rayala

Posts (42)

3, జులై 20266 min
వ్యాపారాత్మక దృక్పథమే కల్పిత పురాణ కథల ప్రాచుర్యానికి మూలం
శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం, మాయాబజార్‌లోని శశిరేఖా పరిణయం వంటి ప్రసిద్ధ ఘట్టాలు నిజంగా మూల పురాణాల్లో ఉన్నాయా? లేక అవి జానపద కథలు, నాటకాలు, సినిమాల కోసం సృష్టించబడిన కల్పితాలా? వ్యాపారాత్మక దృక్పథం ఎలా పురాణ కథలను వక్రీకరించిందో, శాస్త్రసమ్మతమైన మూల గ్రంథాలను ఎందుకు అధ్యయనం చేయాలో విశ్లేషించే ఆలోచింపజేసే వ్యాసం.

15
0
5
24, జూన్ 20265 min
సనాతన ధర్మం వేద విజ్ఞాన మూలం
సనాతన ధర్మానికి పునాది అయిన వేదాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, మానవ జీవితానికి మార్గదర్శకాలు కూడా. వేదాలు, ఉపనిషత్తులు, ఓంకారం, స్మృతులు, భగవద్గీత మరియు వేదవ్యాస మహర్షి పాత్ర గురించి విశదీకరిస్తూ వేద విజ్ఞాన మహత్త్వాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక వ్యాసం.

12
0
2
21, జూన్ 20266 min
ధృతరాష్ట్రుడు కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అనడంలో ఆంతర్యం ఏమిటి?
ధర్మం ఎటువైపు ఉందో తెలిసినా, తన కుమారుడి పట్ల ఉన్న గుడ్డి ప్రేమ కారణంగా ధర్మపక్షాన్ని సమర్థించలేకపోయిన వ్యక్తి ధృతరాష్ట్రుడు. భగవద్గీత ప్రారంభంలో "ధర్మక్షేత్రే కురుక్షేత్రే" అని పలికిన అతని మాటల వెనుక ఒక తండ్రి ఆందోళన, ఒక రాజు అపరాధ భావన, ఒక మనిషి అంతర్మథనం దాగి ఉన్నాయి.

22
0
1
bottom of page