top of page

వసంత హేల



'Vasantha Hela' - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 06/04/2024

'వసంత హేల' తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


వస్తున్నది - ఉషస్సుతో  ఉగాది వత్సరము.


తెస్తున్నది - మనస్సులో  హర్షాతిరేకము.


శుభములను  కలిగించి  శోభను   చేకూర్చే  క్రోధి నామ  వత్సర   ఉగాది -  సుఖసంతోషాలను   అందించి  మనశ్శాంతినిచ్చే   మధురోహ్లాది.


మనలోని   కామక్రోధాలను  తొలగించుదాం- దశదిశలా  స్నేహసౌరభ  పరిమళాలను   వెదజల్లుదాం. 


వాసంత  సమీరంలో  క్రొంగొత్త  లేలేత  మామిడి చిగురులు  తిన్న  ఆమని  కుహు, కుహు  రాగాలు పాడగా,


షడ్రుచుల  ఉగాది పచ్చడి  జీవిత  అనుభవసారాన్నివ్వగా , 


క్రొత్త  కవితలతో  కవి సమ్మేళనము  విశిష్ట  పుంతలు  త్రొక్కగా,


పండితుల  పంచాంగశ్రవణము  మదిలో   ఆశాసౌధము  నిలుపగా,


రుచికరమైన  మామిడి పండ్లు - తాటిముంజలుతో  వేసవి తాపము  చల్లారగా,


మత్తు గొలిపే  మల్లెల  సుగంధాలతో  మనసులెల్లా  పరిమళించగా,


వసంతకాల  ఆహ్లాదభరిత  ఆనంద  సౌరభాన్ని  ఆస్వాదిస్తూ,


మనో వికారాలు లేకుండా, రాకుండా  సంతోషంగా  క్రోధి  నామ  సం... ఉగాది  వసంతలక్ష్మిని  స్వాగతిద్దాము. మదినిండా  ఆనందానుభూతులను  పొందుదాం.

రచన....నీరజ  హరి ప్రభల.


76 views0 comments
bottom of page