Vijayadasami Bahumathulu Inka Non Stop Bahumathulu By Admin
సంక్రాంతి 2021 కథల పోటీని విజయవంతంగా పూర్తి చేసి, రూ: 22500 /- నగదు బహుమతులు రచయితలకు/రచయిత్రులకు అందజేసిన మనతెలుగుకథలు.కామ్ వారు ఇప్పుడు రచయితలకు/రచయిత్రులకు విజయదశమి బహుమతులు మరియు నాన్ స్టాప్ బహుమతులు అందజేయడానికి నిశ్చయించారు.
విజయదశమి బహుమతుల వివరాలు :
ప్రథమ బహుమతి రూ: 5000 /-
ద్వితీయ బహుమతి రూ: 2000 /-
తృతీయ బహుమతి రూ: 1000 /-
ప్రత్యేక ప్రథమ బహుమతి
( కేవలం నూతన రచయితలకు) రూ: 1000 /-
నాన్ స్టాప్ బహుమతులు : ఒక్కొక్కటి రూ: 250 /- (ప్రతి వారం బహుమతులు)
బహుమతుల కోసం ప్రత్యేకంగా రచనలు పంపాల్సిన అవసరం లేదు. సంక్రాంతి కథల పోటీ ప్రచురణ 15/01 /2021 తో ముగిసింది. కాబట్టి 16 /01 /2021 నుండి మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలన్నీ నాన్ స్టాప్ బహుమతులకు మరియు విజయదశమి బహుమతులకు పరిశీలించబడతాయి.
16 /01 /2021 నుండి 15/10 /2021 వరకు ప్రచురింపబడే కథల నుండి (కథలు మాకు చేరవలసిన చివరి తేదీ 05/10/2021) ప్రథమ ,ద్వితీయ,తృతీయ బహుమతులని ఎంపిక చేయడం జరుగుతుంది.
నాన్ స్టాప్ బహుమతులు(వారం వారం బహుమతులు) : ప్రతి ఆదివారం ఆ వారంలో ప్రచురింపబడ్డ కథల నుండి ఒక కథను 'ఈ వారం ఉత్తమ కథ' గా ఎంపిక చేసి E - ప్రశంసా పత్రంతో పాటు రూ: 250 /- బహుమతిగా అందజేయబడుతుంది.
16 /01 /2021 నుండి 30 /04 /2021 వరకు ఎంపిక కాబడ్డ 'ఈ వారం ఉత్తమ కథ' ల వివరాలు మే 15 న ప్రచురింపబడతాయి. ఆ తరువాత నుంచి ప్రతి నెల లో ఎంపిక కాబడ్డ ఉత్తమ కథల వివరాలు మరుసటి నెల 15 న ప్రచురింపబడతాయి. ప్రథమ బహుమతి మాత్రం 'ఈ వారం ఉత్తమ కథ'ల నుండి ఎంపిక చేయబడుతుంది. ద్వితీయ,తృతీయ బహుమతులు అన్ని కథల నుండి పరిశీలింపబడతాయి.
మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్టులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి. నూతన రచయితల కథలు కూడా ముందుగా మెయిన్ విభాగంలో పరిశీలింప బడతాయి. అందులో ఎంపిక కాకపోతే ప్రత్యేక ప్రథమ బహుమతికి పరిశీలింపబడతాయి.
నిబంధనలు :
*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.
*కాపీ కథలు,ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.
ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ ,బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి. ఐదు,లేదా అంతకంటే తక్కువ కథలు ప్రచురింపబడ్డవారు నూతన రచయితలుగా పరిగణింపబడతారు..
*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.
*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.
*మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.
*ఫలితాలు 24/10 /2021 న 'మనతెలుగుకథలు.కామ్'లోప్రచురింపబడతాయి.
*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.
*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉంటాయి.
*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు బహుమతులకు అనర్హులు.
Comments