top of page

వినాయక చవితి కి బై.. దసరాకి హాయ్

పాఠకులకు, రచయితలకు విజయదశమి శుభాకాంక్షలు

'Vinayaka Chavithiki Bai Dasaraki Hai' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 23/10/2023

'వినాయక చవితి కి బై.. దసరాకి హాయ్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


గణపతి నవరాత్రులు బ్రహ్మాండంగా ముగిసాయి.. కైలాసానికి చేరుకున్న వినాయకుని ముఖంలో ఆనందం కనిపించలేదు.


అది చూసిన తండ్రి శివుడు..


"నాయనా! వినాయకా! ఏమిటి చాలా దిగాలుగా ఉన్నావు?"


"నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా అయ్యాయి.. దూప, దీప నైవేద్యాలతో నాకు చాలా ఆనందం కలిగింది. కానీ.. మీకు తెలియనిది ఏముంది తండ్రిగారు! నిమజ్జనం రోజు... నన్ను అపార్ట్మెంట్ లలో... కాలనీ ల లో ఊరేగించారు.. ప్రసాదాలు పంచి పెట్టారు... అక్కడ వరకు బాగానే ఉంది..


కానీ ఊరేగింపు లో పాటల కోసం.. ముందు పెద్ద సౌండ్ బాక్స్ లు పెట్టి.. వెనుక నన్ను బండి లో ఊరేగించారు. కొంత మంది చాలా పద్దతిగా.. భక్తి పాటలతో చాలా ముచ్చటగా నన్ను ఊరేగించారు.


కానీ.. చాలా మంది మాత్రం.. సినిమా పాటలతో హోరెత్తించారు... పొనీ.. భక్తీ పాటలా అంటే.. కాదు.. అన్నీ సినిమా లో చెత్త పాటలే.. ఆ శబ్ద కాలుష్యం లో.. ఆ చెత్త పాటలు వినీ.. వినీ.. ఎంత తొందరగా ఇక్కడకు వచ్చేదామ్మా అనిపించింది తండ్రీ!"


"అర్ధమయింది నాయనా! అన్నీ మాస్ పాటలే... చెత్త పాటలే... ఇక్కడకూ వినిపించాయి ఆ పాటలు. నీకే కాదు నాయనా! చాలా పండుగలకు ఇలానే చేస్తారు ఈ మానవులు... నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి"


"అంతే కాదు తండ్రిగారు! ఆ పాటలకు.. తగ్గటుగా ఆ డాన్సులు చాలా అశ్లీలంగా ఉన్నాయి. ఆడ.. మగా తేడా లేకుండా డాన్సులు చేస్తున్నారు. కొంత మంది భక్తులు దీనిని వారించినా.. ఫలితం లేదు. నాకు వీడ్కోలు గొప్పగా చేసామని అనుకుంటున్నారు మానవులు. ఇంకా.. కొంత మంది ముందు రోజు నుంచే పోటీలు పెట్టుకుని.. ఆ చెత్త పాటలకు, పాటల పోటీ అని, డాన్స్ పోటీ అని పెట్టి.. చిన్నారులను చెడగొడుతున్నారు.. రోజు రోజు కూ జనాలలో భక్తి తగ్గుతున్నది తండ్రీ... ! భక్తి కన్నా... ప్రసాదం కోసం కొట్లాటలు... లడ్డు వేలం పాట కోసం ఆరాటాలు... తండ్రీ!"


"ఒకరిని మించి ఒకలు పెద్ద ఎత్తున నా విగ్రహాలు పెడదామని ఆరాటం. దేవుడు చిన్న విగ్రహం లో అయినా ఉంటాడు కదా!... అంతా కాలుష్యం కోసం కాకపోతే.. "


"నిజమే గణేశా! భక్తి రోజు రోజు కూ తగ్గిపోతుంది. అంతా కలికాలం మహిమ.. సేల్ఫీ ల కోసం ఆరాటం.. పబ్లిసిటీ కోసం పోరాటం చేస్తున్నారు. అదిగో! మాటల్లోనే వచ్చింది మీ అమ్మ!"


"దేవీ పార్వతి! గణపతి ఇబ్బంది విన్నావా?"


"అవును స్వామి! విన్నాను"


"నాయనా! గణేశా! మానవులు భక్తి కన్నా.. హడావిడి ఎక్కువ చేస్తారు... డబ్బులు ఎక్కువ ఖర్చు చేసి... ఆనందము వెతుక్కుంటారు. నిజమైన భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు నాయనా!”


"దేవీ నవరాత్రులకు నేను రెడీ అవుతున్నాను స్వామీ! నా భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు... అందరినీ అనుగ్రహించడానికి వెళ్ళాలి స్వామి! "


"సరే దేవి!"


"నాయనా! వినాయకా! నువ్వు ఇక్కడకు వచ్చావు... ఇప్పుడు నేను భూలోక పయనము కానున్నాను.. నవరాత్రుల లో నాకు జరిగే అనేక అలంకారాలలో పూజలు అందుకుని.. భక్తులను అనుగ్రహించి వస్తాను..”


"సరే మాతా!"


దేవీ నవరాత్రులు చాలా వైభవంగా మొదలయ్యాయి.


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ



37 views0 comments
bottom of page