top of page

ఊయల

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Vuyala, #ఊయల, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 62


Vuyala - Somanna Gari Kavithalu Part 62 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 20/04/2025

ఊయల - సోమన్న గారి కవితలు పార్ట్ 62 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఊయల

----------------------------------------

అందమైన ఊయల

అలరించే ఊయల

అందరికిష్టమైన

హాయినిచ్చు ఊయల


పిన్నలను పెద్దలను

అమ్మలాగ ఒడిలో

పెట్టుకునే ఊయల

నిదురపుచ్చు ఊయల


బలే బలే ఊయల

ఊగేందుకు ఊయల

గాలిలో తేలి తేలి

శ్రాన్తి నొసగు ఊయల


ఇంటి పైకప్పులకు

చెట్టుకున్న కొమ్మలకు

వేలాడే ఊయల

మోసుకునే ఊయల


ఎన్నెన్నో ఊయలలు

ఊరడించే ఊయలలు

అటూఇటూ తిరుగుతూ

మనసు దోచు ఊయలలు

ree











త్యాగానికి ప్రతీక అమ్మ

----------------------------------------

అమ్మ వంటి త్యాగమూర్తి

అవనిలోన ఉండునా!

ఆమె ఇచ్చు గొప్ప స్ఫూర్తి

ఎక్కడైనా దొరుకునా!


అమ్మ జోలపాటలాగ

తియ్యందనాలెక్కడ!

ఆమె చేయు సేవలలాగ

అచ్చం ఉండునెక్కడ!


చందమామను చూపించి

చిరు బొజ్జను నింపుతుంది

కథలెన్నో చెప్పి చెప్పి

అమ్మ నిదుర పుచ్చుతుంది


తల స్నానం చేయించి

కొత్త బట్టలు తొడుగుతుంది

సాంబ్రాణిని వేయించి

మంచినే కోరుతోంది


సేవలెన్నో చేసి చేసి

మురిచి మురిచి పోతుంది

జీవితాన ఎదిగితే

పొంగిపొంగి పోతుంది


అమ్మకు వందనాలు

అక్షర నీరాజనాలు

కనుపాపలా చూసే

ఆ దేవతకు కైమోడ్పులు

ree
















బడి మాకు బహు ప్రియం!

----------------------------------------

ప్రతిరోజు బడికి పోతాం

ప్రార్థనకు హాజరవుతాం

గురువులకు నమస్కరించి

దీవెనలను గైకొంటాం


తరగతిలోకి వెళుతాం

శ్రద్ధగా పాఠం వింటాం

చక్కగా చదువుకుని

గొప్పగా ఎదుగుతాం


ఆటలెన్నో అడుతాం

పాటలెన్నో పాడుతాం

వినోదం,వికాసం మేం

సమపాళ్లలో పొందుతాం


బడి మాకు ప్రియం! ప్రియం!

అదే మాకిచ్చు అభయం!

బడికి పోకుంటే గనుక

తొలగిపోదు అజ్ఞానం

ree
























దైవానికి కృతజ్ఞతలు

----------------------------------------

ప్రవహించే యేరులను

విహరించే పక్షులను

ప్రసాదించెను దేవుడు

ప్రకాశించే తారలను


పుష్పించే పూవులను

విరబూసే నగవులను

ప్రసాదించెను దేవుడు

మురిపంచే పిల్లలను


కదిలిపోయే మేఘాలను

ఎన్నెన్నో అందాలను

ప్రసాదించెను దేవుడు

జారే జలపాతాలను


ప్రాణదాతలు తరువులను

దారి చూపే గురువులను

ప్రసాదించెను దేవుడు

భువిని తల్లిదండ్రులను


జీవితాన మిత్రులను

ఆపదలో ఆప్తులను

చాలా చాలా ఇచ్చిన

దైవానికి కృతజ్ఞతలు

ree






అన్నింటి కంటే!...

----------------------------------------

ఆకాశం కంటే

భూలోకం కంటే

అమ్మ మనసు విశాలము

అక్షరాల సత్యము


వెన్నెలమ్మ కంటే

హిమపాతం కంటే

అమ్మ మాట చల్లన

ఎదిగేందుకు నిచ్చెన


క్రొవ్వొత్తుల కంటే

కర్పూరం కంటే

అమ్మకున్న త్యాగము

అవనిలో అద్భుతము


జుంటితేనె కంటే

మకరందం కంటే

అమ్మ ప్రేమ మధురము

వెన్నలా నవనీతము


రవిచంద్రుల కంటే

తారమ్మల కంటే

అమ్మ ఇంట తేజము

ముమ్మాటికీ నిజము


-గద్వాల సోమన్న


Comments


bottom of page