top of page
Original.png

ఆడపిల్లలను బ్రతనీయండి!

Updated: Mar 14

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆడపిల్లలనుబ్రతనీయండి!, #గృహలక్ష్మి, #తేటగీతిమాలిక

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 4

Adapillalanu Brathakaniyandi - Gayathri Gari Kavithalu Part 4 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 08/03/2025

ఆడపిల్లలను బ్రతనీయండి! - గాయత్రి గారి కవితలు పార్ట్ 4 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


ఆడపిల్లలను బ్రతనీయండి!


(తేటగీతి పద్యములు )


ఆడపిల్లలు జన్మింప నదిరిపడుచు

నీసడింతురీ యుగమున నెఱుకలేక

యింటి యందున లక్ష్మియై యింతి వెలుగ

కానలేరమ్మ!మనుజులు కాంతి నెపుడు.


భ్రూణహత్యలు చేయుచు మూఢమతులు

బుజ్జి పాపలన్ జంపుట పుణ్యమౌనె?

కలికి పుట్టిన దాదిగా కష్టములను

పడుచు నుండును పాపమీ పుడమియందు.


తరుణులీధర యందున తగ్గిపోవ

పెళ్లి కానట్టి యువకులు పెరుగుచుండ్రి

వంశవృద్ధికి మూలమౌ వనితలేక

నిలిచి యుండునా విశ్వము నిశ్చలముగ?


మేలుకొండిక!జనులార!మేలుకొండు!

బుజ్జిపాపలన్ బ్రేమించి పొదివికొనుచు 

చదువు చెప్పించి పెంచిన చక్కనైన

తారలన్నియు మన యింట తళుకుమనును./


లింగభేదము చూపించు లేకితనము

వీడకున్నచో ప్రజలకు వెతలు మిగులు

పరమ పావన మూర్తులీ పడుచులనుచు

కాచుకొనుచుండ జాతికి కలుగు శాంతి.//


************************************

గృహలక్ష్మి


(తేటగీతిపద్యములు )


ree












గృహమునంతట జరియించు గేస్తురాలు 

మమత పంచెడి దేవత మాతృమూర్తి

కన్న బిడ్డల సాకెడి కంటివెలుగు

భర్త మనసున నివసించు పసిడి బొమ్మ.


అత్తమామల నెంతయో నాదరించు

పుట్టినింటికి కీర్తిని మూటగట్టు

భావిపౌరులౌ తనయుల పదనువెట్టు

మహిళ యేనిల్చి యుండును మానితముగ.


కష్టములు బాధలన్నవి క్రమ్ముకొనగ

సహనమెంతయో చూపెడి శాంతమూర్తి

సాధుగుణశీలగ మెలగు స్వాదు సాధ్వి

గౌరవమిడుమా యింతికి ఘనముగాను.


ఉన్నతుడగునా పరమాత్మ యుద్భవించి

వనిత రూపమై జగతిలో వరలుచుండె

నింతి లేనట్టి శూన్యమౌ నింటిలోన

దైవమేగతి నిల్చును దయనుజూప!


కార్యదీక్షకు రూపమై కలికి వెడలి 

యద్భుతంబగు ఖ్యాతితో నలరుచుండ

వందనంబులు చేయుచు వనిత కెపుడు

మాన్యతనిడగా కలుగును మహికి జయము.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page