top of page

అక్షర పరిమళం



'Akshara Parimalam' - New Telugu Story Written By Harish Thati

Published In manatelugukathalu.com On 23/04/2024 

'అక్షర పరిమళం' తెలుగు కథ

రచన: హరీష్ తాటి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆ అక్షరాల్ని చూస్తుంటే రెండు కన్నులు చాలట్లేదు. కనుపాపల్లోని కన్నీటి ఊట ఉబికివస్తుంది. ఆ అక్షరాలను కాగితంపై నుండి తడుముతుంటే ఆ స్పర్శకి హృది చెమ్మగిల్లింది. ఆ చెమ్మగిల్లిన తడి అణువణువును మీటగా పువ్వులో పరిమళం పుట్టినట్టుగా కన్నీటి ఊటలోని చినుకులు నెమ్మదిగా కనురెప్పల నుండి జాలు వారుతూ సంబరాన్ని మోసుకొస్తూ ఆనంద భాష్పాలై వికసించి చెక్కిళ్ళ పై పడుతుండగా అది పసిగట్టిన హస్తాలు వాటి మునివేళ్ళతో తుడువ సాగాయి. 


 ఆ క్షణమున అక్షరాలు టెలిస్కోపులో నుంచి తారలను చూచినంత పెద్దగా ఆ అక్షరాలు ఉన్న కాగితపు పేపరు ఆ ఆకాసంలా కనిపించింది. 'అక్షరాలు ఇంతటి ఉద్వేగభరితమైన అనుభవాన్ని పంచడం అదే తొలిసారి కాబోలు. ' ఆ అనుభూతి ఎప్పుటికి మరువలేనిది. మరుపురానిది. 


ఇంతకీ ఆ అక్షరాలతో అంతటి అనుబంధం ఏంటంటే?.. ఎన్నోసార్లు ప్రయత్నించిన ప్రతీసారి నిరాశ ఎదురై పలకరించగా తనను తానూ సర్ధిచెప్పుకోసాగాడు ఓ యువకుడు. 'ఏదో రోజు నేను కల గన్న అవకాశం రాకపోదా అనుకుంటుండగా'

 అనుకోకుండా ఓ రోజు తన ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ శబ్దం విని ఇది మాములుగా ఎప్పుడూ వచ్చే సాధారణ మేసేజ్ అని అంతగా పట్టించుకోలేదు. కానీ అది ఒక మెయిల్ సందేశం. 


 కానీ ఇంతలోనే తన మైబెల్ కి ఫోన్ వచ్చింది. అది కూడా తెలియని నెంబర్ నుండి వచ్చింది. కానీ అతను ఫోన్ కి స్పందించలేదు. ఎందుకంటే చాలా మంది రోజు తమ వారి వారి వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేక సందర్భాల్లో తన చేత మేలు పొందిన వారే కానీ ఈరోజు తనని గుర్తుంచుకున్నది లేదు. అందుకే మొబైల్ సైలెంట్ లో పెట్టి తను పొలం గట్టు దగ్గర వేకువ జామునే (5:30am)కి పనిలో నిమగ్నమై మొబైల్ కి చాలా దూరంగా ఉన్నాడు. మూడున్నర గంటల తర్వాత మైబెల్ చూడగానే దాదాపు పది సార్లు కాల్స్ ఉన్నాయి.    


అది కూడా ఉదయం పూట దాదాపు సమయం తొమ్మిది దాటింది. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. తెలియని నెంబర్ నుండి ఇన్నిసార్లు ఫోన్ రింగ్ వచ్చే సరికి కొంత సందేహంగానే ఏమిటని ఫోన్ ఎత్తాడు చేసాడు. అందులో ఓ గొంతు ఇప్పటి వరకు మీతో మాట్లాడడం కోసం మీకు ఫోన్ చేసింది మేమేనని మీకు సందేశాన్ని తెలిపడం మా విధి అని చెప్పగా హుటాహుటిన పొలం గట్టు నుండి బయలుదేరాడు. 


 పరుగు పరుగున నడిచి ఇంటికి వచ్చి తమ గ్రామానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పట్నానికి చాలా యేళ్లుగా వాళ్ల కుటుంబ బాధ్యతల్లో తాను భాగస్వామై దౌడు తీస్తున్న సైకిల్ పై ఎంతో ఆతృతగా లోలో తెలియని సందిగ్దముతో పయనమయ్యాడు. సరిగ్గా మూడు మైళ్ళు వెళ్లిన తర్వాత ఆ సైకిల్ పంచర్ అయ్యింది. అయినా తగ్గకుండా తన ప్రయాణం దాన్ని తోసుకుంటూ ఎట్టకేళకు పట్నం చేరుకొన్నాడు. 


 తనికి ఫోన్లో వచ్చిన సందేశపు సమాచారం కోసం పట్నంలో చాలా చోట్ల వెతికాడు. కానీ తనకు ఆ అవకాశం ఎక్కడ లభించలేదు. అప్పటికే సమయం ఆలస్యం అవ్వడం వల్ల నిరాశే ఎదురైంది. 


 అయినా ఎదో చిన్న ఆశ తనకు. అప్పుడే ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. ఇక్కడ దొరక్కపోతే ఓ చోట ఖచ్చితంగా ఉంటుందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ లోపలికి వెళ్తే అంతా నిశ్శబ్దంగా ఉంది. "ఎటు చూసిన పుస్తకాలు ఒకదానిమీదఒకటి పేర్చి గది నిండుగా ఉన్నాయి". 


'ఆ గదిలో మధ్యన ఒక టేబుల్ వేసి దాని మీద కొన్ని పుస్తకాలతో పాటు కొన్ని వార, దిన, మాస పత్రికలున్నాయి. '  


తనకు వచ్చిన సమాచారం కోసం అక్కడ ఉన్న పత్రికల నుండి తనకు కావల్సిన ఓ పత్రికను కొండంత ఆశతోచూస్తూ పత్రిక పేజీలను త్రిప్పసాగాడు. మూడు పేజీల తరువాత నాల్గో పేజీలో తన పేరుతో తను ఎంతో ప్రేమతో తానూ పోగుచేసుకున్న పద సంపదలోని అక్షరమక్షరము కూర్చి పదాల సుమాలను అల్లిన వాక్యాలు సరులుగా" ఆ పత్రిక తెలుపు కాగితంపై నలుపు రంగులో అక్షరాలు పసిపాప కళ్లకు అద్దిన కాటుక వోలె తన కవితను చూస్తూ ఎంతో సంబరపడిపోయాడు". ఆ అక్షరాలు సంబరాన్ని మోసుకొస్తూ కళ్లలో కన్నీరు ఆనంద భాష్పాలై వికసించి చెక్కిళ్ళ పై పడుతుండగా అది పసిగట్టిన హస్తాలు వాటి మునివేళ్ళతో తుడువ సాగాయి. ఎంతటి టెక్నాలజీ ఉన్న మనం చరవాణి లోచూసే కంటే చేతులతో స్వయంగా ఆ కాగితపు స్పర్శను తాకితే అది 'మన మొదటి రచనను పత్రికలో స్వయంగా మనం ఆ అక్షరాలను స్పర్శించి చదువుతుంటే ఆ ఆనందం మాత్రంఅద్భుతం, ఆపూర్వం. '


 తన కవిత జనంలోకి వెళ్లేలా చేసిన పత్రిక యజామాన్యానికి పలుమార్లు మనసారా ప్రత్యేక అభినందనలు తెలిపాడు. తాను పట్నంలో ఆ పత్రిక కోసం ఎంత వెతికిన దొరక్క పోయిన బాధపడలేదు. కానీ ఆ పత్రిక దొరికిన "ఆ పుస్తకాల గది పేరే ప్రాంతీయ గ్రంధాలయం. " 

******

హరీష్ తాటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నాపేరు హరీష్ తాటి.మాది హన్మకొండ జిల్లా పరకాల మండలం సీతారాంపురం గ్రామం.

మన జీవితంలో ఎదురయ్యే అత్యంత సంక్లిష్ట పరిస్థితుల నుండే మనలోని కళ ఆవిర్భవిస్తుందని బలంగా నమ్ముతాను. అలాంటి సందర్భంతోనే నాలో సాహిత్యం పై మక్కువ ఏర్పడి చిన్న చిన్న కవితలతో ఓ అంతర్జాలంలో తెలుగు ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో తెలుగు చందస్సు నేర్చుకొని ఆటవెలది శతకాన్ని రాసి ప్రచురణ చేయడం జరిగింది.

ITI చేసాక కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మధ్యలో ఆపేసాను. ప్రస్తుతం సాహిత్యంలో కథలు, కవితలు, పుస్తక సమీక్షలు, డైలాగులు పాటలు రాస్తూ నిత్యం సాహిత్య పోటీలో పాల్గొని మొదటి విజేతగా నిలిచి ఎప్పటికప్పుడు నా సాహితీ ప్రతిభను పరిక్షించుకుంటాను.






53 views0 comments

Comments


bottom of page