top of page

అల్లుకున్న బంధాలు

Writer's picture: Mohana Krishna TataMohana Krishna Tata


'Allukunna Bandhalu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 16/03/2024

'అల్లుకున్న బంధాలు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఇలా పార్క్ లో.. నీ ఒడిలో కూర్చొని కబుర్లు చెబుతూంటే, ఎలా ఉంది ప్రేమ.. ?" అడిగాడు ఆది.


"మనం ప్రేమించుకున్నట్టుగానే ఉంది ఆది.. " నవ్వుతూ అంది ప్రేమ.

 

"జోకులు వెయ్యకు ప్రేమ.. నీ కోసం ఏం చెయ్యమంటావు చెప్పు.. ! ఆకాశంలో ఉన్న ఆ తారలను తెచ్చి.. నీ దోసిట్లో పోయ్యనా.. ? ఆ చందమామని కిందకు దించి.. ఈ చందమామకు కానుక గా ఇవ్వనా.. ?"


"అవ్వన్నీ వొద్దు లే మహాప్రభు.. ! మీరు నన్ను పీకలదాకా ప్రేమిస్తున్నట్టు ఒప్పుకుంటున్నాను.. "


"ఇప్పటికైనా ఒప్పుకున్నావు.. నా ప్రేమ చాలా గొప్పదని.. " అన్నాడు ఆది.


"ఎన్ని సంవత్సరాలు.. ఇలాగే, ప్రేమా అని ఈ ప్రేమ చుట్టూనే తిరుగుతారు.. ? పెళ్ళి చేసుకునే ఆలోచన లేదా ఆది.. ?"


"మా అమ్మ తో చెప్పాలి.. నిన్ను చూస్తే, మా అమ్మ అసలు కాదనదు లే.. ! ఇంకా.. నాకు ప్రమోషన్ వస్తే, వెంటనే మన పెళ్ళి. టైం చూసి నీ ఫోటోని కుడా మా అమ్మకు పంపిస్తాను ప్రేమ.. "


"నా ఆఫీస్ కు టైం అయ్యింది ఆది. నేను వెళ్ళాలి.. " అని లేచింది ప్రేమ.

 

"నాకూ టైం అయ్యింది.. లేట్ అయితే, మా బాస్ కుడా ఒప్పుకోడు.. సరే.. బై.. " అన్నాడు ఆది. 


*****


ఆది ఒక ప్రైవేటు కంపనీ లో మంచి పోజిషన్ లోనే ఉన్నాడు. సిన్సియర్ గా వర్క్ చేస్తాడు.. అంతే సిన్సియర్ గా లైఫ్ లోనీ ఉంటాడు. రోజూ ఇలా ఆఫీసుకు వెళ్ళే ముందు.. పార్క్ లో ప్రేమ ను కలుస్తాడు. 


ప్రేమ ఒక ప్రైవేటు కంపెనీ లో పని చేసేది. కానీ, ఉద్యోగంలో అంత సంతృప్తి లేకపోవడం తో.. సోషల్ సర్వీసు చేసే జాబ్ లో జాయిన్ అవ్వాలని ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ అయ్యింది. అక్కడ ఉన్న పెద్దవయసు వారికి రోజూ సేవలు చేస్తూ ఆనందం పొందేది. ప్రేమకి ఎవరూ లేరు.. ఒక అనాధ. అందుకే, ఇందులో జాయిన్ అయ్యిందని ఆదికి చాలా సార్లు చెప్పింది ప్రేమ.. 


ప్రేమ.. ఆది ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మొదటిసారి ఇద్దరు బస్ స్టాప్ లో కలిసారు. అప్పుడు ఆదికి కళ్ళు తిరిగి పడిపోతే, అక్కడే ఉన్న ప్రేమ వెంటనే హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి చూపించింది. అలాగ, వారి ప్రేమకు పునాది పడింది. 


*****


మర్నాడు ఎప్పటిలాగే ఇద్దరూ పార్క్ లో కలిసారు. మాటల్లో, ఇద్దరి మధ్య పిల్లల ప్రస్తావన వచ్చింది.. 


"ఆది.. ! మనకి పెళ్ళైన తరువాత.. నీకు ఆడపిల్ల కావాలా.. మగపిల్లాడు కావాలా.. ? నాకైతే ఇద్దరు కావాలి.. " అంది ప్రేమ.


"మనకి పిల్లలు ఎందుకు చెప్పు ప్రేమ.. నాకైతే.. నువ్వు జీవితాంతం నాకు తోడు ఉంటే చాలు.. "


"అదేంటి.. అలా అంటావు ఆది.. ?”


"పిల్లల్ని కంటే, నీ అందం తగ్గిపోతుంది.. నాకు నువ్వు ఎప్పటికీ ఇలాగే అందంగా కనిపించాలి ప్రేమ.. "


"నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా ఆది.. ? అందుకే కదా.. ప్రతి సండే నేను అనాధ పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను.. "


"నాకైతే పిల్లలు వద్దు ప్రేమ.. "


"పిల్లలు వద్దంటే.. నువ్వూ నాకు వద్దు ఆది.. నన్ను మర్చిపో.. !" అని కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది ప్రేమ.


ఆ రోజు ఆఫీస్ లో ఉంటుండగా.. ఆదికి అమ్మ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది.. 


"ఒరేయ్ ఆది.. ! నువ్వు తొందరగా బయల్దేరి రావాలి.. అక్కకు ఒంట్లో బాగోలేదు.. హాస్పిటల్ లో జాయిన్ చేసాను.. వచ్చాక అన్నీ చెబుతాను.. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు రా.. తొందరగా దొరికిన బస్సు పట్టుకుని వచ్చేయి.. " కంగారుగా అంది తల్లి.

 

"అలాగే అమ్మా.. ! ఇప్పుడే బయల్దేరుతున్నాను.. "


ఆఫీస్ లో ఒక వారం లీవ్ పెట్టి ఆది వెంటనే ఊరు బయల్దేరాడు. బస్సు లో ఉంటుండగా.. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి.. 


ఆది తన అక్కతో చిన్నప్పుడు బాగా ఆడుకునేవాడు. చదువులో సందేహాలను అక్కే తీర్చేది. అక్కంటే, అమ్మ తర్వాత అమ్మ అంటాడు ఆది ఎప్పుడూ. అక్క ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. అక్కకు పెళ్ళైన తర్వాత.. కొన్ని సంవత్సారాలకి బావగారు ఒక రోజు ఆఫీస్ లోనే గుండెపోటుతో చనిపోయారు. అప్పటినుంచి అక్క డల్ అయింది. బావగారికి ఎవరూ లేకపోవడంతో.. అక్క అమ్మతోనే ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ ఉంటోంది. ఇప్పుడేమో సడన్ గా ఈ ఫోన్.. ఏమిటో అనుకున్నాడు ఆది.. 


ఊరు చేరుకుని హాస్పిటల్ కి వెళ్ళిన ఆది కి.. అక్క కి గుండెపోటు రావడం తో.. స్టెంట్ వేసారని తెలిసింది. రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారు కానీ.. జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. బావగారు పోయిన తర్వాత దిగులుతో అక్క ఇలా అయిపోయిందని అనుకున్నాడు ఆది. ప్రేమించిన మనిషి దూరమైతే.. ఇంత బాధ ఉంటుందని తెలుసుకున్న ఆదికి వెంటనే ప్రేమ గుర్తుకు వచ్చింది. 


మావయ్య అంటే, చంటి, బంటిలకి చాలా ఇష్టం. ఎప్పుడూ మావయ్య సరదాగా కథలు, కబుర్లు చెబుతాడు.. అలాగే, బయటకు తీసుకుని వెళ్లి.. అన్నీ కొని పెడతాడు. ఇప్పుడు ఇంకా మావయ్యకు దగరయ్యారు పిల్లలు. ఒకరోజు, అమ్మ ఎంతకీ నిద్రలేవకపోవడం తో.. పిల్లలు ఆది కి చెప్పారు. ఆది చుసేసరికే.. అక్క చనిపోయి ఉంది. పిల్లల్ని తీసుకుని అమ్మతో ఆది పట్నం వచ్చేసాడు. ఒకసారి ఆది పిల్లల్ని తీసుకుని ఎప్పుడూ వెళ్ళే పార్క్ కు వెళ్ళాడు. అక్కడ.. అనుకోకుండా ప్రేమ కనిపించింది. 


"ప్రేమా.. ! ఎలా ఉన్నావు.. ? నువ్వు చెప్పింది నిజమే.. ! ఈ కొద్ది రోజులకే.. ఈ పిల్లలు నాకు చాలా దగ్గర అయిపోయారు.. వీరిని వదిలి ఉండలేకపోతున్నాను. నువ్వు చెప్పింది నిజమే.. ! నువ్వు ఎంతలాగ పిల్లల కోసం కలలు కన్నావో ఇప్పుడు నాకు అర్ధమైంది. నిన్ను నొప్పించినందుకు ఐ యాం సారీ ప్రేమా.. "


"ఆది.. నిన్ను కుడా నేను మరిచిపోలేకపోయాను.. "


"ఎవరు మావయ్యా.. ఈ అమ్మాయి.. ? చాలా బాగుంది.. అత్తయ్య కదా.. !" అన్నారు చంటి, బంటి.


అది విన్న ప్రేమ.. నవ్వుకుని.. ఆది దగ్గరకు వచ్చి.. చేయి పట్టుకుని.. "పెళ్ళికి ముందే మనకి ఇద్దరు పిల్లలు.. మరి మీ అమ్మ కి నా ఫోటో నచ్చిందా.. ?" అని చమత్కరించింది ప్రేమ. 


***********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ




78 views0 comments

Commenti


bottom of page