top of page

పాఠశాల 1960 మధుర స్మృతులు

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Patasala 1960 Madhura Smruthulu' - New Telugu Story Written By Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 16/02/2024

'పాఠశాల 1960 మధుర స్మృతులు' తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్దాదాపు 60 సంవత్సరాలు క్రితము బొలారం బజార్ మల్టి పర్పస్ బాలుర ఉన్నత పాఠశాల

ప్రేమానుభూతులు.


అన్ని పాఠశాలలో సాధారణముగా విద్యార్థులకు యూనిఫామ్ ఉండటం సర్వసాధారణము. రాష్ట్ర ప్రభుత్వ

ఆదేశానుసారం పిల్లలందరూ కాఖీ రంగు వస్త్రాలు ధరించి పాఠశాలకు వచ్చేవారు పదోతరగతి వరకు బాలురు నిక్కర్లు ధరించేవారు.


పదకొండు మరియు పన్నెండు తరగతి బాలురకు ప్యాంటు వేసుకునేందుకు అనుమతి ఉండేది.


మన పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక వస్త్రధారణతో పాఠశాలకు రావడము విశేషము ఈ సందర్భములో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు లేక పోవడము గమనించ దగిన విశేషము. సమాజములో ఉన్న కట్టుబాట్లు మరియు

సాంప్రదాయాలకు తగిన రీతిలో మెలగడము ఆచార్యుల యొక్క సహజత్వము.


తెలుగు బోధించే రంగాచారి గురువు గారు అచ్చు తెల్లటి ధోవతిలో పాఠశాలకు రావటము విధ్యార్థులకు

పాఠాలు చెప్పడము వారి ప్రత్యేకత. వారు బోధించే క్రమములో ఇతర భాష పదములు నిషేదము. వారు పాఠము చేప్పే విధానము అందరిని ఆకట్టుకునేది మరియు మాతృ భాషమీద అభిమానము పెరిగేది. 


హిందీ లో పాఠాలు బోధించే సింగ్ అధ్యాపకులు లాల్చీ పైజామాలో నుదుటున పెద్ద బొట్టుతో తరగతికి

వచ్చేవారు. అయన దగ్గర సన్నటి బెత్తము ఉండేది కానీ అయన ఎట్టి పరిస్థితిలోను ఉపయోగించడము అరుదు అని చెప్పవచ్చు.


పిల్లలని బెంచీమీద నిలబెట్టడము లేక మోకాళ్ళమీద నిలబెట్టేవారు. విద్యార్థులకు హిందీ భాష మీద ఆసక్తి కలిగే విధానం బోధించేవారు.


ఆంగ్లభాషలో పాఠాలు నేర్పే మాస్టారు లేతరంగు చొక్కా ఇన్ షర్ట్ వేసుకొని హుందాగా వచ్చేవారు. 


ఆయనకు ఆంగ్ల భాష తప్ప ఇతర భాషలు రావు అనే విధముగా ఉండేవారు. తరగతిలో ఎంతో అవసరమయితే తెలుగులో వివరించేవారు. 


గణితము బోధించే ఆచార్యులు చాలా శాంతముగా మరియు సౌమ్యముగా లెక్కలు చేయిన్చేవారు. అర్ధము కాకపోతే రెండు లేక మూడు సార్లు చెప్పేవారు. మా పాఠశాలలో గణితములో పన్నెడవ (12th ) తరగతి బోర్డు పరీక్షలో అధిక శాతము

ఉత్తీర్ణులు అయ్యేవారు. ఆయన సామాన్య వస్త్రములు (హాఫ్ బుషర్ట్ ) ధరించేవారు

జీవశాస్త్రము మరియు రసాయన శాస్త్రము బోధించే ఉపాధ్యాయినులు సాంప్రదాయ పద్దతిలో చీరలు

ధరించి పాఠాలు చెప్పేవారు. 


డ్రిల్ మాస్టారు ఎప్పుడు తెలుపు బట్టలు ధరించేవారు ఆయన చేతిలో చిన్న బెత్తము ఉండేది చాల

చురుకుగా మరియు గంభీరంగా ఉండేవారు. ఆయన్ను చూస్తే భయముగా ఉన్న, ఆటలలో ప్రోత్స్సహించే వారు. క్రమశిక్షణ తో పిల్లలందరూ ఆటస్థలానికి వెళ్లేవారు.


ప్రధానోపాధ్యాయులు సుబ్రమణ్యముగారు ఆజానుబాహువు. ఎప్పుడు కోటు ధరించేవారు. ప్రార్ధన సమయములో పాఠశాలా ప్రాంగణములో గంభీరంగా అందరిని తిలకించేవారు. ఆయన ఉన్నచోట ఎవరు ఉండేవారుకాదు. చైనా యుద్ధము జరిగీ ముగిసిన రోజులు వలన ప్రార్ధన సమయములో దేశ భక్తి జీతాలు ఆలాపించేవారు. 


అప్పట్లో పన్నెడవ (12th ) తరగతిలో బోర్డు పరీక్షలు జరిగేవి. తొమ్మిదవ (9th) తరగతి నున్చి నాలుగు సంవత్సరాలు 25 శాతము మార్కులు బోర్డు పరీక్షలో కలిపే విధానము ఉండేది. విద్యార్థులు క్రమశిక్షణ మరియు ఉపాధ్యాయులతో అణుకువగా ఉండేందుకు ముఖ్యమైన కారణము మార్కుల విధానము అని చెప్పుకోవచ్చుమరువని మధురాను స్మృతులతో

పెద్దాడ సత్యనారాయణ

 --------------------------------------------------------------------------------------------------------------------------

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


1,414 views0 comments

Comments


bottom of page