top of page

ఆమె రూపు! 

#ఆమెరూపు, #AmeRupu, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguHeartTouchingStories

Ame Rupu - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 03/07/2025

ఆమె రూపు - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

కారు ప్రమాదంలో సుకుమార్ చూపు పోయింది. 


ఫలితం? 


చీకటి!... మనసును ఎవరో కట్టగట్టి చీకటి కోట్లో పడేసినట్లు.. కారు చీకటి!! 


కట్లు, చీకట్లు శాశ్వతం కాదు! 

ఏ కాంతి కిరణమో ఊహించని దిక్కు నుంచి కోరకనే వచ్చి అక్కున చేర్చుకుంటుంది. సుకుమార్ విషయంలో అదే జరిగింది. 

విశాలాక్షి. అనే దయామయి తన రెండు కళ్ళు అతనికి దానం చేసింది. 


'విశాలాక్షి కళ్ళే కాదు, హృదయమూ విశాలమే! అడపా దడపా ఆమె వంటి విశాల హృదయులు పుట్టి తచ్చాడకపోయుంటే ఈ లోకానికి పుట్టగతులు ఉండేవికావు' అనుకున్నాడు సుకుమార్. 


చూపు వచ్చిన మరుక్షణం ఆ కరుణామయి రూపు చూసి తరించాలనుకున్నాడు. 


ఆపరేషన్ అయింది. విజయవంతమయింది. విశాలాక్షి కళ్ళతో విశాలాక్షిని చూడబోయే తరుణం ఆసన్నమయింది. సుకుమార్ ఆశ తీరటమే తరువాయి. 


ఆశించే వరకే మునిషి వంతు! కరుణించటం కాలం వంతు! 


కాలం కరుణించ లేదు. సుకుమార్ కోరిక నెరవేర లేదు. 


సుకుమార్ కు మల్లే మరో నలుగురికి తన అవయవాలు దానం చేసింది కోవిడ్ కారణంగా కన్ను మూసిన విశాలక్ష్మి. 


కన్నీరు మున్నీరయే సుకుమార్ చేతికి అందిందో గులాబి రంగు కవరు. 


ఆత్రుతగా.. వణికే చేతులతో.. కవరు తెరిచి చూశాడు సుకుమార్! 


ముత్యాల కోవలా పేర్చిన అక్షరాల పంక్తులు కనిపించాయి కళ్ళకు ! 


"అపరిచిత మిత్రమా! తెలుసు నాకు నీ మనసు! చూపు నిచ్చిన ఆడపిల్ల ఎలా ఉంటుందో చూడాలని కదూ కుతూహలం? పెళ్ళికాని అబ్బాయిలకు ఆ మాత్రం కోరికలుండటం సహజం! నీ కళ్ళ ముందు నేను లేకపోవచ్చు! కానీ కంటి చూపులో ఉన్నాను కదా! ఆ చూపుతో నీ మనసుకు నచ్చిన అమ్మాయిని చూడు! ఆమె రూపే నా రూపు! " 


సుకుమార్ కళ్ళు కన్నీళ్ళ సుళ్ళయాయి! 

***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments


bottom of page