top of page
Original.png

పుకార్లు

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #పుకార్లు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 27

Pukarlu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle

Published in manatelugukathalu.com on 17/02/2026

పుకార్లుతెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


ఒకరోజు చింటూ స్కూల్ నుండి వచ్చి చాలా కంగారుగా ఉన్నాడు. బామ్మ దగ్గరకు వెళ్లి, "బామ్మా! మా స్కూల్లో ఎవరో చెప్పారు, మా ఫ్రెండ్ వాసు దొంగతనం చేశాడట, అందుకే వాడిని ప్రిన్సిపాల్ రూమ్‌కి పిలిపించారు!" అని ఎవరూ అడగకుండానే చెప్పేశాడు.


బామ్మ వెంటనే, "చింటూ, అది నిజమో కాదో నీకు తెలుసా?" అని అడిగింది. చింటూ, "అందరూ చెప్పుకుంటున్నారు బామ్మా, నేను కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో అందరికీ చెప్పేశాను" అన్నాడు ఏదో గొప్ప పని చేసినట్లు.


బామ్మ ఏమీ మాట్లాడలేదు. వెంటనే ఒక పాత దిండు తీసుకువచ్చి, దాంట్లో ఉన్న ఈకలను బయటకు తీసి చింటూ చేతిలో పెట్టింది. "చింటూ, ఈ ఈకలను బయటకు వెళ్లి గాలిలోకి ఎగురవేయి" అని చెప్పింది. చింటూ చాలా ఉత్సాహంగా వెళ్లి, గాలి వీస్తున్న మిద్దె మీద నుండి ఆ ఈకలను ఎగురవేశాడు. అవి క్షణంలో దూరం వెళ్లి అన్ని దిక్కులకు విసిరిపోయాయి.

ఇప్పుడు బామ్మ, "సరే చింటూ, ఇప్పుడు వెళ్లి ఆ ఈకలన్నింటినీ మళ్ళీ ఈ దిండులోకి తీసుకురా" అని చెప్పింది.


చింటూ బయటకు వెళ్లి చూశాడు, కానీ ఒక్క ఈక కూడా దొరకలేదు. అవి గాలిలో ఎక్కడికో వెళ్లిపోయాయి. చింటూ తిరిగి వచ్చి "బామ్మా! అవి దొరకడం అసాధ్యం, గాలి వాటిని ఎక్కడికో పట్టుకుపోయింది" అన్నాడు నీరసంగా.


అప్పుడు బామ్మ  "మనం అనే మాటలు కూడా అంతే చింటూ! ఒక్కసారి మనం నిజం తెలుసుకోకుండా ఒక మాట అనేశామా, అవి ఆ ఈకల్లాగే అందరి దగ్గరకు వెళ్లిపోతాయి. అవి నిజం కాదు అని మనకు తర్వాత తెలిసినా, ఆ మాటలను మనం వెనక్కి తీసుకోలేము. ఆ మాట వల్ల ఎదుటివారి గౌరవం, మనసు ఎంతలా దెబ్బతింటాయో ఆలోచించు."


మరుసటి రోజు స్కూల్లో తెలిసింది ఏంటంటే.. వాసు దొంగతనం చేయలేదు, వాడు రాసిన కథ బాగుందని మెచ్చుకుని చాక్లెట్ ఇవ్వడానికి ప్రిన్సిపాల్ పిలిపించారు.


చింటూకి చాలా సిగ్గు వేసింది. తను అందరి దగ్గర తప్పుగా చెప్పిన మాటలు వాసుని ఎంత బాధపెట్టి ఉంటాయో అర్థమైంది.

బామ్మ చెప్పిన "గాలిలో ఈక" లాజిక్ చింటూకి ఎప్పటికీ గుర్తుండిపోయింది.


అప్పటి నుండి నిజం తెలుసుకోకుండా, ఎవరి గురించి తప్పుగా మాట్లాడటం చింటూ మానుకున్నాడు.

*** 

సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page