top of page
Original_edited.jpg

అమ్మ హితవు

  • Writer: Gadwala Somanna
    Gadwala Somanna
  • Apr 26
  • 1 min read

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaHithavu, #అమ్మహితవు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 67


Amma Hithavu - Somanna Gari Kavithalu Part 67 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 26/04/2025

అమ్మ హితవు - సోమన్న గారి కవితలు పార్ట్ 67 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అమ్మ హితవు

----------------------------------------

వెన్నెలలా చల్లగా

మల్లెలలా తెల్లగా

ఉండాలి జీవితము

నలుగురికి ఆదర్శము


ఉదయంలా కాంతిగా

హృదయంలా గొప్పగా

ఉండాలి మనమంతా!

మెచ్చాలి జగమంతా!


చీమలలా నేర్పుగా

రైతులలా ఓర్పుగా

ఉండాలి లోకంలో

ఎదగాలి బ్రతుకులో


మొక్కలలా పచ్చగా

చుక్కలలా చక్కగా

ఉండాలి సమాజాన

వెలగాలి కుటుంబాన

ree











చెట్టే ఆదర్శం!

----------------------------------------

ఆకులన్నీ రాలినా

చెట్టు మాత్రం అలగదు

గొడ్డలితో నరికినా

ఆత్మవిశ్వాసం తొలగదు


వసంతం వస్తుందని

క్రొత్తదనం తెస్తుంది

మనసారా!నమ్ముతుంది

చిరాశ చిగురిస్తుంది


చెట్టును చూసి నేర్చుకో

బాధలన్నీ ఓర్చుకో

గుండె దిటవు చేసుకో

కలతలన్నీ మానుకో


తరువు మనకు ఆదర్శం

గైకుంటే ఆనందం

దొరుకును ఖచ్చితంగా

మది నిండా ఆహ్లాదం

ree














వాస్తవాల వెలుగులు

----------------------------------------

పిల్లలు విరితూపులు

పావనమే చూపులు

సదనంలో ప్రమిదలు

గగనంలో తారలు


ఆనంద కెరటాలు

అరుణోదయ కిరణాలు

అమ్మానాన్నలకిలను

కంటిలోని కాంతులు


పూలలో పరిమళాలు

పాలలో పోషకాలు

పరికింపగ పిల్లలు

తెల్లని సిరిమల్లెలు


బాలలు లేకుంటే

కళ తప్పును గృహములు

అక్షరాల సత్యము

వర్ధిల్లదు ప్రపంచము

ree











అశాంతి కారకాలు

----------------------------------------

అశాంతికి కారణము

మితిలేని కోరికలు

ఓర్వలేని వ్యక్తులు

అసలు సిసలు కారకులు


నియంత్రణ లేకుంటే

కోరికలే గుర్రాలు

జాగ్రత్త లేదంటే

చేయును అభాసుపాలు


అత్యాశ అనర్ధము

దుఃఖానికి మూలము

అప్రమత్తత ఉంటే

జీవితాలు పదిలము


తృప్తిలేనిది నయనము

అదే కదా ప్రధానము

పర్వతాలు సైతము

దానికి దాసోహము


పంచేంద్రియాలతో

ఉంటుంది ప్రమాదము

సరిగ్గా వాడితే

బ్రతుకంతా ప్రమోదము


ఏదైనా తగినంత

అన్ని రకాల మేలు

ఈ చిన్ని బ్రతుకులో

సంతృప్తి చాలు చాలు

ree






ఉండాలి మనిషిగా!

----------------------------------------

మానసిక సంక్షోభము

జయిస్తే మగధీరులు

పేదోళ్ల సంక్షేమము

ఆశిస్తే మహాత్ములు


గుండెలో భావాలు

గొంతులో రాగాలు

పలికితే హృదయాలు

ఆనంద సాగరాలు


భేదాలతో మనుషులను

మాటలతో మనసులను

చేయరాదు పలు ముక్కలు

సుతిమెత్తని భావాలను


చేతనైతే సాయము

అభాగ్యులకు న్యాయము

చేయాలోయ్! మనిషిగా

ఉండాలోయ్! స్ఫూర్తిగా


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page