top of page

అమ్మ మారిపోయింది

'amma maripoyindi' written by Namani Sujana Devi

రచన : నామని సుజనాదేవి

‘డాక్టర్ గారూ! .... ఎలా ఉందండి ఆయనకి ....’ఆదుర్దాగా భయం భయంగా అడిగింది పద్మావతి. ‘ప్రస్తుతానికి అవుటాఫ్ డేంజర్ ...కాని తర్వాత అయినా జాగ్రత్త గా చూసుకోవాలి... హార్ట్ ఎటాక్ కదా... మొదటిసారి మైల్డ్ గా వచ్చింది కాబట్టి సరిపోయింది..’ ‘ఏడుకొండల వాడా.... నువ్వు ఉన్నావయ్యా....’ రెండు చేతులు తలపైకెత్తి సర్వస్య శరణాగతి చేస్తూ అని, ‘మీకు....ధన్యవాదాలు డాక్టర్ గారూ.... దేవుడి తనకు బదులుగా ప్రాణం పోయడానికి డాక్టర్ ని భువిపైకి పంపించారు అంటారు.... మీరుణం తీర్చుకోలేం డాక్టర్...’ కళ్ళల్లో నీరు చిప్పిల్లు తుంటే రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతూ అంది పద్మావతి. ‘ఏమ్మా ....ఇప్పుడు నీకు సంతోషమేనా...ఎంత ఏడ్చావు.... ఎన్ని దేవతలకు మొక్కావు... ఎంత టెన్షన్ పడ్డావు... నేను చెప్పలేదూ మంచివారికి మంచే జరుగుతుందని...’ భర్త శ్రీనివాస్ ప్రాణ స్నేహితుడైన శివశంకర్ అంటుంటే ,’అంతా ఆ దైవ కృప అన్నయ్యా....’ అంటూ చూడడానికి లోనకు వెళ్ళింది. **************** ‘ఏమండీ.... మిమ్మల్ని రోజూ ఈ కషాయం పడిగరపున తాగమన్నానా.... చేతికి ఇచ్చింది కూడా మీరు తాగాక పొతే ఎలా.... ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందట. పుస్తకాలు అన్నీ తిరగేసి వెరిఫై చేసి తయారు చేసాను....’ ‘అబ్బా.... ఆ కషాయా లతో నన్ను చంపకు అన్నానా..... ఇదిగో ఈ ఐదు లక్షలు బీరువాలో పెట్టు... ‘ ‘ఎక్కడిదండి అంత డబ్బు ...’ ‘అప్పుడెప్పుడో శివశంకర్ కి ఎదో అవసరం ప్రాణం మీదకు వస్తే లోన్ తీసుకుని ఇచ్చాను. తర్వాత లోన్ కట్టేసాను. ఇప్పుడు ఇచ్చాడు . రేపు బాంక్ లో వేద్దాం. అన్నట్లు నువ్వేదో నెక్లెస్ అని కూడా అన్నావుగా .... ఇక రిటైర్ అయినాక నీకేం చేయించలేదుగా....దానికయినా పనికొస్తాయి...’ ‘అబ్బా...భార్య మనసెరిగిన వాడే భర్త అని ఎవరన్నారో గాని..నిజంగా మీరు బంగారమే....’మురిపెంగా అంది పద్మావతి వేయించిన పల్లీలు చెరుగుతూనే చిరునవ్వుతో . ‘నువ్వే బంగారం అయినప్పుడు నీకు బంగారం అవసరమే లేదు. అయినా మీ ఆడవాళ్ళకి బంగారం అనగానే ఎందుకంత ఆపేక్ష?.. . ‘

చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది పద్మావతి. ‘అమ్మా... త్వరగా టిఫిన్ పెట్టు.... ఆఫీస్ లో ఆడిట్ ఉంది....’ శ్రీచరణ్ స్నానానికి వెళుతూ అన్నాడు. ‘ఇదిగో అయిపొయింది నాన్నా.....’ వంటింట్లో చెమటకు తడిచి ముద్దయినా, పట్టించుకోకుండా హడావుడిగా చట్నీ రుబ్బడం మొదలు పెట్టింది. ‘నీకంత శ్రమ అవసరమా పద్దూ.... మిక్సీలో రుబ్బ మంటే వినవేం.... ఎంత శ్రమ తెల్సా...’ శ్రీనివాస్ అన్నాడు. ‘ఆ.... ఏముంది లెద్దూ.... వాడికి మిక్సీ కన్నా, ఇలా రోటిలో రుబ్బిన పచ్చడి అంటేనే ఇష్టం... ఏదో నా ఓపిక ఉన్నప్పుడే చేస్తున్నా.... కొన్ని రోజులయితే చేయలేనేమో.....’ ‘నీ చాదస్తం.... ఒప్పుకోవుగా.....’ ‘అమ్మా! ఫర్లేదన్నా వినవు. ఎంతయినా అమ్మ బంగారం ‘ ‘అమ్మా.... నాకివ్వాల కాలేజ్ లో ఎలక్యుషణ్ (ఉపన్యాస) కాంపిటిషన్ ఉంది.... నువ్వు తయారుచేసిన పాయింట్స్ కి కొన్ని చేంజెస్ చెప్పాను. దానితో మళ్ళీ తయారు చేయమన్నా ... చేసావా.....’ సాయి ప్రణవి అంది. ‘ఆ...చేసాను’ ‘ఎంతయినా అమ్మ బంగారం !’ చేతితో మెటికలు విరిచి గాల్లోనే ముద్దిచ్చుకుంటూ , ‘ఎక్కడ పెట్టావమ్మా’ అంది . ‘ ఆ దేవుడి దగ్గర పెట్టాను పేపర్స్ తీసుకో.....’ ‘అబ్బా... నీది మరీ చాదస్తం అమ్మా... నువ్వు వండినవి ఏవైనా ఎలాగూ దేవుడి దగ్గర పెట్టికాని మాకు పెట్టవు, నువ్వు తినవు .... పోటీ అనగానే ఈ పేపర్స్ కూడా పెట్టేస్తావా .... రోజు రోజుకి నీ చాదస్తం దినదిన ప్రవర్ధమాన మవుతోంది.’ విసుక్కుంటూ అంది ‘అబ్బా... దానికి అంత పెద్ద దీర్ఘం అవసరమా.. . మనకు తినడానికి ఇచ్చిన ఆ దేవుడికి నైవేద్యం పెట్టి తింటే ఆయన దయవల్ల మనకు ఎప్పటికీ ఇలాగే తిండికి లోటు ఉండదు.... ఎ ముఖ్యమైన కార్యమైనా ఆదేవుడి అనుమతి తీసుకుని చేస్తే విఘ్నాలు ఉండవు... సాఫీగా సాగుతుంది . అది నిజమయినా కాకపోయినా మనస్సుకు అదో మనోధైర్యం వస్తుంది.. అయినా దానివల్ల నీకు ఏమైనా నష్టమా చెప్పు?’ ‘ఆబ్బా... నువ్వు ఒప్పుకోవని తెలిసి వాదించడం నాది బుద్ది తక్కువ గాని.... అమ్మా త్వరగా టిఫిన్ పెట్టు...’ భర్తతో పాటు వారిద్దరికీ హడావుడిగా టిఫిన్ పెట్టేసింది పద్మావతి. అయితే అందరితో ‘ బంగారం ‘ అంటూ కీర్తించబడిన పద్మావతి , వాళ్లందరే ఆశ్చర్య పోయే విధంగా మారి వారి మనస్సులు బాధ పెడుతుందన్నది అక్కడ ఎవరూ ఊహించని విషయం. ఆతర్వాత అవన్నీ శుబ్రం చేసి పొద్దున్న దీపం ముట్టించి వదిలేసినా పూజ మీద కూర్చుని మిగతా పూజ పూర్తీ చేసేసరికి పదకొండు అయ్యింది. టీ అడిగిన భర్తకు పెట్టి ఇచ్చ్చి , మధ్య మధ్యలో వస్తున్న ఆడపడుచు, తోటి కోడళ్ళ ఫోన్ లు అటెండ్ అవుతూ టిఫిన్ పూర్తిచేసి వంట పనిలో పడింది. ఒక రోటి పచ్చడి, ఒక కూర , పప్పు, వేపుడు, చారు చేసి ఆ గిన్నెలు కడిగేసరికి మధ్యాన్నం భోజనాల సమయానికి అంతా వచ్చేసారు. మాట్లాడుతూ భోజనాలు పెట్టి , అవి సర్ది ,అంట్లు తోమేసరికి మూడయింది. అప్పుడు భోజనం చేసి తెల్లవారి టిఫిన్ కి పప్పు , బియ్యం నానబెట్టి పురుగులు పడుతూ కనిపించిన రెండు మూడు డబ్బాల లోని సరుకులు శుబ్రం చేసి , కూతురు టాప్ కి కుడుతున్న డిజైన్ ని చేతుల్లోకి తీసుకుని గంట పనిమీద కూర్చుందో లేదో సాయం సంధ్య పలకరించే సరికి సాయం కాలం పనికి తయారయి పోయింది. పిల్లలు వచ్చేసరికి వేడి వేడిగా స్నాక్స్ తయారు చేసి, దేవుడి ముందు దీపం పెట్టి రాత్రి వంటలో పడిపోయింది. అందరూ వచ్చి స్నాక్స్ తిని ఎవరిపనిలో వారు పడ్డారు. ఆరోజు పద్మావతి బజారుకని వెళ్ళి సాయంత్రం అయినా రాలేదు. ఇంటికి చేరాల్సిన వారంతా చేరారు. ఎప్పుడైనా ఇలాంటప్పుడు మరో డూప్లికేట్ కీ శ్రీనివాస్ దగ్గర ఉంటుంది. పద్మావతి కూడా పక్కింట్లో ఇచ్చ్చి వెళుతుంది. కాబట్టి వచ్చారు తాళం తీసి ఇంట్లోకి వెళ్ళారు. నిజానికి ఎప్పుడైనా అందరూ వచ్చేలోపల త్వరగా వచ్చేస్తుంది. పెళ్ళయిన మొదటి రోజే చెప్పాడు, ‘నువ్వు లేకుండా నేను ఉండలేను కాబట్టి ఎక్కడికయినా వెళితే ఇద్దరం కల్సి వెళదాం. కాదని నువ్వు ఎక్కడికైనా వెళితే తప్పక ఒక్క రోజులో వచ్చేలా వెళ్ళు.’ అని. పద్మావతి లేకుండా ఇల్లు దేవతలేని కోవెల లా ఉంటుంది అని అందరు భర్తల లాగే అతనికి ప్రగాఢ విశ్వాసం. ఆమె కూడా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అందరూ వచ్చేలోగా వస్తుంది. కాని ఆరోజు ఇంకా రాలేదని శ్రీనివాస్ ఫోన్ చేసాడు. ఫోన్ రింగ్ అవుతుంది కాని ఎత్తలేదు. పిల్లలు ఎవరికి వారే మళ్ళీ ఫోన్ చేసారు. కాని ఎత్తలేదు. అందరికీ ఇల్లంతా బోసిగా కళా విహీనంగా అనిపిస్తోంది. ఇంతలో పద్మావతి ఫోన్ చేసింది. దారిలో ఫ్రెండ్ కనబడితే వెళ్ళడం వల్ల ఆలస్యం అయ్యిందని కంగారు పడొద్దని వచ్చేస్తున్నా నని. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పావుగంటలో ఆటోలో వచ్చేసింది పద్మావతి. వారం గడిచింది. ‘ఏమండీ....మరే.. మన వీధిలోని వాళ్ళు కొందరు యోగా నేర్చుకోవడానికి వెళుతున్నారు..నేను యోగా నేర్చుకోవడానికి వెళతాను ఇవ్వాల్టి నుండి . సాయంత్రం ....ఒక గంట రెండు గంటలు ఉంటుందేమో....’ నెమ్మదిగా అడిగింది పద్మావతి. ‘అసలు నీకు తీరిక ఎక్కడుంటుంది.... నువ్వు చేసే ఇంటెడు చాకిరీ చాలు నీకు, ఎ యోగాసనాలు అవసరం లేదు....’ శ్రీనివాస్ అన్నాడు. ‘అబ్బా...వాళ్ళంతా తోడు ఉంటారు కదా... అలాగే రేపటి నుండి మీతోపాటు వాకింగ్ కి వస్తాను...’ ‘ఏంటోయ్.... నీకు ఉన్న ఇరవైనాలుగు గంటలే సరిపోవు... అలాగయితే మరి పనులెలా?’ ‘పక్కింటిలోచేసే పనిమనిషిని రేపటి నుండి మనక్కూడా చేయమన్నా... మరో రెండు వేలు ఎక్కువ అవుతాయి బడ్జెట్... చేసి చేసి బోర్ అనిపిస్తుంది....’ ‘ఒకే...అన్నీ నువ్వే సెటిల్ చేసాక మరింక ప్రాబ్లం ఏముంది... సరే ‘ శ్రీనివాస్ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ . తెల్లవారి ఏడుకు శ్రీనివాస్ వాకింగ్ కి బయల్దేరే సమయానికి పూజ చేసి, ఇంట్లో పని కూడా కొంత చేసి , కొత్త షూ వేసుకుని చుడిదార్ పైజామా వేసుకుని రెడీ గా ఉంది పద్మావతి. శ్రీనివాస్ తో వాకింగ్ కి వెళ్లి వచ్చేసరికి ,లేచి బ్రష్ చేస్తున్న ప్రణవి, శ్రీ చరణ్ అమ్మను చూసి ఆశ్చర్య పోయారు. ‘అమ్మా...మాడ్రన్ మహాలక్ష్మి లా ఉన్నావమ్మా’ పిల్లలు అనగానే సిగ్గుపడింది పద్మావతి. టిఫిన్ తయారు చేసి పిల్లలతో పాటు వేడి వేడిగా తనూ పెట్టుకుంది. అందరూ ఆశ్చర్య పోయారు. ‘అమ్మా... నువ్వేనా.... అందరూ వెళ్ళాక అన్నీ శుభ్రం చేసి పూజ చేసి ఏ పదకొండు కోగాని తినని పద్మావతి గారేనా..... ‘ అంటూ హాస్యోక్తులు వదిలారు. ‘చల్లారాక నాకూ తినబుద్ధ్ది కావడం లేదు... తిన్నా మళ్ళీ భోజనం సమయానికి తినలేకపోతున్నా.. అందుకే అంట్లకు పనిమనిషి స్వప్న ఉంది కదాని నేనూ మీతో పాటే కూర్చుంటున్నా...’ అంది. అంతేకాదు....పద్మావతి మొత్తం మారిపోయింది. పొద్దున్న వాకింగ్ వేడివేడిగా వారితో పాటే తినడం..పైగా కొలెస్ట్రాల్ తగ్గించేవి అని, వీటిలో అధిక శక్తి వస్తుందని, రక్తం బాగా వచ్చేవని, రోజు రోజుకు అన్నీ ఇంట్లో వాళ్ళకి పెడుతుంటే విస్మయం చెందడం వారి వంతు అవుతోంది. ‘అమ్మా.... నీలో కొత్త అమ్మను చూస్తున్నాం.... అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి...?’ ఆశ్చ ర్యంగా అడిగింది ప్రణవి ఒక రోజు. ‘నువ్వే నేర్పించావుగా ఇంటర్ నెట్ చూడడం.... ఇంట్లో ఎట్లాగు కనెక్షన్ ఉందిగా... అందుకే అందులో చూసి పోషక పదార్దాలు ఉన్నవి ఏవి..మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి లాంటివి చూసి మీకెలాగూ తీరిక దొరకదు కదా అందుకని నేనే చూసి చేస్తున్నా..’ అంది. హాఠాత్తుగా ఆదివారం రోజు , ‘పిల్లలూ..ఇవ్వాళ ఒక్కరోజు నాకు నా పనుల నుండి సెలవు కావాలి.... కొంచెం జ్వరం గా ఉంది . ప్రణవి ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించిన మాటర్ నేను ప్రిపేర్ చేస్తాను.. శ్రీ కి సంబంధించిన రూమ్ సర్దుతాను. .. అలా డీ విటమిన్ కోసం ఎండలో ఉండి , యోగా చేసి ఇవ్వాళ పూర్తిగా విశ్రాంతి గా ఉంటాను.... ఇవ్వాళ నా పనులు మీరు చేయండి....’ అంది పద్మావతి నవ్వుతూ. ‘అమ్మా ఎందుకమ్మా ...నీ పనులు మాకు రావనుకుంటున్నావా ... చూస్కో... నాన్న వంట చేస్తారు...నేను ఇల్లు ఊడ్చి తుడుస్తాను,బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తాను... అన్నయ్య వెజిటబుల్స్ కోస్తాను.... మాకు పని వచ్చని నీకన్నా బాగా చేయగలమని నిరూపిస్తాం చూడు...’ అంటూ ముగ్గురు పోటీపడి చేసారు. కామెంట్స్ చేసి వారిని నవ్విస్తూ చిన్న చిన్న పనులు చేసింది పద్మావతి. కిందా మీద ముగ్గురూ పడి ఇంట్లో పని కానిచ్చారు. ఆరోజు పద్మావతి యోగా కు అని బయటకు వెళ్ళింది. ఇక శ్రీనివాస్, ఫ్రెండ్ శివ ను కలవడానికి వెళ్ళాడు. ఇంట్లో ప్రణవి, శ్రీచరణ్ ఇద్దరే ఉన్నారు. ‘ఏమిటోరా అన్నయ్యా... అమ్మ అలా డ్రెస్ వేసుకుని వాకింగ్ అని, యోగా అని బయటకు వెళితే మా ఫ్రెండ్స్, వీధిలోని వాళ్ళు వేసే జోక్స్ భరించలేక పోతున్నారా.... ‘ తల్లి బజారుకు వెళ్ళింది చూసి అన్నయ్యతో అంది ప్రణవి. ‘ఏమిటోనే....నాకూ అలాగే ఉంది. అమ్మ బాగా మారి పోయింది. ఇంతకుముందు మనం తినేంతవరకు తినకపోయేది. అలాగే మనం పడుకునేంత వరకు పడుకోక పోయేది. యోగా , వాకింగ్ అంటూ పెట్టుకునే సరికి ఇంట్లో కూడా పనులన్నీ పేరుకు పోతున్నాయి. మొన్న నా బట్టలు ఐరన్ చేయమంటే ఇంకా అలాగే ఉన్నాయి. నాకిష్టమని మిక్సీ కాకుండా రోట్లో వేసి రుబ్బేది.... ఇప్పుడవెం లేవు...‘ ‘అవున్రా.... నా డ్రెస్ పై వర్క్ చేస్తుంది... అది కూడా అలాగే పెండింగ్ పెట్టింది. దానికన్నా అమ్మకు ఆ యోగా, ఫ్రెండ్స్ వాకింగ్ అవే ఎక్కువ అయ్యాయి. అంతకు ముందు లేనట్లు ఎప్పటికి ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాటలు కూడా ఒకటి.... అసలు ఎలాంటి అమ్మ ఎలా మారి పోయిందిరా ...’ ప్రణవి అంటూ అటు చూసేసరికి నాన్న ఫ్రెండ్ శివ నిలబడి ఉన్నాడు. ‘అంకుల్..మీరా.... రండి..... రండి .... బావున్నారా.... నాన్న మీ కోసమే వెళ్ళి నట్లుంది కదా...’ లేచి నిలబడి అంది ప్రణవి. ‘అవునమ్మా.... వాడు కార్ పార్క్ చేస్తున్నాడు...నేనిలా లోనికి వచ్చేసా.... అమ్మ ఉందా మ్మా ...’ ‘హా...లేదంకుల్ ..... ఇప్పుడు యోగా టైం కదా.... మరో అరగంటలో వచ్చేస్తుంది..’ ************* ‘పద్దూ.... నీకు ఇచ్చిన డబ్బులు ఇవ్వు ..ఈవేళ ఎలాగైనా బాంక్ లో వేసేస్తా..... అలా ఇంట్లో ఉండడం మంచిది కాదు...’ ‘అయ్యో... అవి ఆల్రెడీ బంగారం కొనుక్కోమన్నారు కదాని నెక్లెస్ చేయడానికి ఇచ్చేశాను.... మీరే ఆఫీసు నుండి వచ్చేసరికి అలసి పోతున్నారు కదాని మొన్న బజారుకు వెళ్ళినపుడు నేనే వెళ్లి ఆర్డర్ చేసి వచ్చాను... మీరే అన్నారు కదా నాకు నక్లెస్ చేయిస్తానని, పైగా,’ అన్నింటికీ నేను వెంట రావాలి ...నీ పనులు నువ్వయినా చేసుకోలేవా ‘ అని కూడా అన్నారు కదాని ఇచ్చేశాను..హడావుడిలో మీకు చెప్పడం మరిచాను... రేపు వెళ్లి తీసుకురావాలి... రేపు తెచ్చి చూపిస్తాను .....’ అక్కడే ఉన్న ప్రణవి విస్తుపోయింది. అదేంటి నాన్న లేకుండా, చెప్పకుండా ఒక్క పని కూడా చేయని అమ్మ అంత పెద్ద మొత్తం అయిన డబ్బును నెక్లెస్ కి వాడుకుందా... అంతకు ముందు అయితే నాన్న కొనిస్తానన్నా నాకెందుకు పిల్లలకు పనికి వస్తాయి అనేది.... శ్రీనివాస్ కూడా నివ్వెరపోయాడు. ఆమె అన్న అన్ని మాటలు నిజమే అయినా వాస్తవం ఎందుకో మింగుడు పడడం లేదు... తను విసుక్కున్నా ,చేయించుకోమన్నా , ‘నాకెందుకండీ ..ప్రస్తుతం చాలా ఖర్చులు ఉన్నాయి కదా.. అయినా మీరే కదా నన్ను చూసేది .... బంగారం వేసుకోకపోతే నచ్చనా ఏం.... పక్కన చోటివ్వరా ఏం ....’ అంటు జోకులు వేసేది అనుకున్నాడు..ఇంతక ముందు అలాంటి ఎన్నో అనుభవాలు తను చవి చూసాడు. కాని ఇప్పుడేంటి.... ఇలా మారిపోయింది. ఎన్నడూ తను పని చేయబోతే , ‘మీకెందుకు శ్రమ ..నేను ఉన్నాను కదా ‘అనే పద్దు ..’అన్నీ ఒక్కదానివి ఎందుకు చేస్తావు... పిల్లలకు కొన్ని చెప్పు ‘ అన్నా , పిల్లలతో ఎన్నడూ ఎ పని చేయించని పద్దు... మొన్న అందరూ పని చేస్తుంటే , అలా చేయండి..ఇలా చేయండి అంటూ సూచనలు కూడా ఇచ్చింది.... పద్దూ ఇదివరకు పద్దూ కాదు.... ఎవరో నేర్పుతున్నారు... ఈ వాకింగ్, యోగా ఒకటి.... ఒకవేళ తను వాకింగ్ కి వెళ్లక పోయినా తను ఒక్కత్తే వెళ్లి వస్తోంది... మూడుపదుల వసంతాల సహవాసం లో చూడని , ఈ పద్దూ ఎందుకో తనకు నచ్చడం లేదు... కాని ఎలా చెప్పేది? తెల్లవారి అన్నట్లు గానే నెక్లెస్ తెచ్చి మెడలో వేసుకుని అందరికీ చూపించింది... అందరూ పైకి నవ్వి బాగుంది అన్నా ఎందుకో గుండెలో ముల్లు గుచ్చుకున్నట్లు ఫీలయ్యారు. ************ ఆరోజు పద్మావతి యోగా కు అని బయటకు వెళ్ళింది. ఇక శ్రీనివాస్, ఫ్రెండ్ శివను కలవడానికి వెళ్ళాడు. ఇంట్లో ప్రణవి, శ్రీచరణ్ ఇద్దరే ఉన్నారు. ‘ఏమిటోరా అన్నయ్యా... అమ్మ అలా డ్రెస్ వేసుకుని వాకింగ్ అని, యోగా అని బయటకు వెళితే మా ఫ్రెండ్స్, వీధిలోని వాళ్ళు వేసే జోక్స్ భరించలేక పోతున్నారా.... ‘ తల్లి బజారుకు వెళ్ళింది చూసి అన్నయ్యతో అంది ప్రణవి. ‘ఏమిటోనే....నాకూ అలాగే ఉంది. అమ్మ బాగా మారి పోయింది. ఇంతకుముందు మనం తినేంతవరకు తినకపోయేది. అలాగే మనం పడుకునేంత వరకు పడుకోక పోయేది. యోగా , వాకింగ్ అంటూ పెట్టుకునే సరికి ఇంట్లో కూడా పనులన్నీ పేరుకు పోతున్నాయి. మొన్న నా బట్టలు ఐరన్ చేయమంటే ఇంకా అలాగే ఉన్నాయి. నాకిష్టమని మిక్సీ కాకుండా రోట్లో వేసి రుబ్బేది.... ఇప్పుడవేం లేవు...‘ ‘అవున్రా.... నా డ్రెస్ పై వర్క్ చేస్తుంది... అది కూడా అలాగే పెండింగ్ పెట్టింది. దానికన్నా అమ్మకు ఆ యోగా, ఫ్రెండ్స్ వాకింగ్ అవే ఎక్కువ అయ్యాయి. అంతకు ముందు లేనట్లు ఎప్పటికి ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాటలు కూడా ఒకటి.... అసలు ఎలాంటి అమ్మ ఎలా మారి పోయిందిరా ...’ ప్రణవి అంటూ అటు చూసేసరికి నాన్న ఫ్రెండ్ శివ నిలబడి ఉన్నాడు. ‘అంకుల్..మీరా.... రండి..... రండి .... బావున్నారా.... నాన్న మీ కోసమే వెళ్ళి నట్లుంది కదా...’ లేచి నిలబడి అంది ప్రణవి. ‘అవునమ్మా.... వాడు కార్ పార్క్ చేస్తున్నాడు...నేనిలా లోనికి వచ్చేసా.... అమ్మ ఉందా మ్మా ...’ ‘హా...లేదంకుల్ .... అయినా అమ్మ ఇప్పుడు మాడ్రన్ అమ్మ కదా... మాకన్నా బిజీ అయిపొయింది ... ‘ఎంత వద్దనుకున్నా నిష్టూరం తొంగి చూసింది ప్రణవి కంఠం లో . ‘రోజూ వాకింగ్..యోగా ...లతో బిజీ అయ్యింది అంకుల్...ఇప్పుడు యోగా టైం కదా.... మరో అరగంటలో వచ్చేస్తుంది..’ శ్రీచరణ్ అన్నాడు. వెనకనే వచ్చిన శ్రీనివాస్ అన్నీ విని నిట్టూరుస్తూ, ‘పద్దూ మారింది రా .. అర్దాంగి గా ..’వాగార్దావివ సంత్రుప్తౌ ‘ అంటూ పెళ్లి అయ్యాక ,’వాక్కు, అర్ధం ఎన్నడూ విడిపోవు.. అలా అర్దనారీశ్వర ప్రతిరూపం గా కలకాలం మనం ఒకే మాట, ఒకే చేత గా ఉండాలి అని ప్రమాణం చేసిన పద్దూ నేడు నాకు తెలియకుండా అన్ని పనులు చేసేంతగా ఎదిగింది....’ ఎంత వద్దనుకున్నా బాధ తొంగి చూసింది శ్రీనివాస్ కంఠం లో .పిల్లలు బయట పడటం తో ప్పనిసరై తనూ బాధ వెళ్ళగక్కాడు. పిల్లల ముందు బయట పడాల్సి వచ్చినందుకు కూడా ఫీలవుతున్నట్లు తల వంచుకున్నాడు. ‘తప్పురా.... అర్దాంగి కి నిలువెత్తు నిదర్శనం రా తను.. అంతేకాదు... అర్దాంగి గా , మాతృమూర్తి గా , గృహిణి గా ఎన్ని పాత్రలు పోషించినా అన్నింట్లో వంద శాతం మార్కులు పొందిన మహిళా శిరోమణి రా తను... ఎలా అంటావా.... ఇన్ని ఏళ్లుగా అన్నీ తానై తన ఆరోగ్యం పట్టించుకోకుండా అందరికీ సేవలు చేసిన ఆమె ఒకేసారి అలా ఎందుకు మారిపాయిందో ఎవరయినా ఆలోచించారా?’ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ‘ఎందుకు ?’ అందరి నోటి నుండి ఒకేసారి వచ్చింది ఆ మాట. అందరూ ఒకేసారి విస్మయంగా , విభ్రాంతిగా అడిగారు. ‘ఎందుకంటే తనకు క్యాన్సర్ వచ్చింది...అదీ, అప్పటికే చాలా ముదిరిపోయింది అని తెలిసింది .... ఒక రోజు బజారుకు అని వచ్చిన ఆమె, ఆమెకున్న అనుమానంతో డాక్టర్ ను కలిసింది. ఆమె అనుమానం నిజమైంది . తనకు క్యాన్సర్ అని తెలిసింది. డాక్టర్ కంగారు పడొద్దని , పోషకాహారం తీసుకుంటూ, యోగా , వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ,మానసికంగా దృఢంగా ఉంటె జయించవచ్చని చెప్పారని, హాస్పిటల్ బయట కలసిన మా దంపతులకు ఏడ్చుకుంటూ చెప్పింది. మేము ఇంటికి తీసుకెళ్ళాం. ‘అన్నయ్యా... దయచేసి ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పవద్దు... ఎందుకంటే ఆయనకు హార్ట్ ప్రాబ్లం..పిల్లలది చిన్నవయసు ...నాకేమయినా అయినా ,అనారోగ్యమని విన్నా తట్టుకోలేరు . పిల్లలకు ఇప్పటివరకు ఏమీ తెలియకుండా పెంచాను. ఇప్పటి నుండి నేను లేకుండా జీవించడం ఎలాగో కూడా చెబుతాను. నా గురించి నాకు బాధ లేదు అన్నయ్యా... కాని నాకేమైనా అయితే వారంతా దిక్కులేని వారు అవుతారు.... డాక్టర్ అన్నది నిజమే అన్నయ్యా... ‘ఇంట్లో తినకుండా , తన ఆరోగ్యం పట్టించు కోకుండా ఇంట్లో వాళ్ళ పై ప్రేమ తో ఆడవాళ్ళంతా గొప్ప త్యాగం చేస్తున్నాం అనుకుంటారు. కాని వారికి తెలీదు. వారి కుటుంబం పై వారికి ప్రేమ ఉంటె అలా చేయరని ... కుటుంబం కి తన అవసరం ఉంది అనుకునేవాళ్లు తప్పక తమ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించు కోవాలి. నీకు మీ వారిపై, పిల్లలపై ప్రేమ ఉంటె నీ గురించి నువ్వు పట్టించు కుని ఈ మహమ్మరి తో పోరాడి జయించు... అప్పుడు నీకు నీ కుటుంబం పై ప్రేమ ఉందని నమ్ముతాను.... ‘ అంది. నేను తప్పక నిరూపిస్తాను అన్నయ్యా... అప్పటి వరకు ఈ విషయం ఇంట్లో చెప్పకండి అన్నయ్యా....’ అంది.

ఇప్పుడు చెప్పండి .... అమ్మ మారి పోయిందా... అర్దాంగి మారిపోయిందా ... అనేది ‘ ఒకింత బాధగా కోపంగా అన్నాడు శివ. ‘మరి ఆ ట్రీట్మెంట్ కి డబ్బులు ఎక్కడివి?’ ప్రణవి అంది. ‘ అందుకనేనా నాకు చెప్పకుండా పైసా ఖర్చు చేయని పద్దూ ..నాకు తెలీయకుండా బంగారం కొన్నా నన్నది ... ఇక మళ్ళీ తను పెట్టుకోలేదనో... లేక ... కొంచెం డబ్బు నెక్లెస్కి కొంచెం మందులకు ఖర్చు చేసుకుందేమో ...’ ‘కాదు నాన్నా... మా ఆఫీస్ లో మా అటెండర్ .... సేఫ్ బాక్స్ లోని నాలుగు లక్షల డబ్బులు కాజేశాడు. నేను అకౌంట్స్ ఆఫీసర్ ని కదా ... పోలీస్ కేస్..మీడియా...అంత గందర గోళం అవుతుందని, మేనేజర్ ఆ డబ్బులు తెచ్చి పెడితే అలా కాకుండా కాపాడతా అన్నాడు.. నేను అలా పేపర్లోకి ఎక్కితే మీరు తట్టుకోలేరని ఎవరికీ చెప్పవద్దని అమ్మను అడిగితె ఇచ్చింది. మీకెవ్వరికీ అనుమానం రాకుండా గిల్ట్ నగ తెచ్చుకుంది’ లోనికి అప్పుడే వస్తున్న పద్మావతి ని, క్షమించమంటూ ఆత్మీయంగా ముగ్గురూ ఒకేసారి ఆలింగనం చేసుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెకు శివ ను చూడగానే విషయం అర్ధం అయ్యింది. ఇంతలో పద్మావతి ఫోన్ రింగ్ అయ్యింది . అమ్మ దగ్గర నుండి తీసుకుని ఎత్తిన ప్రణతి , ‘డాక్టర్’ అని చూడగానే స్పీకర్ పెట్టి ఫోన్ ఆన్ చేసింది. ‘పద్మావతి గారు.... మీ రిపోర్ట్స్ వచ్చాయి.... మీకు పూర్తిగా క్యూర్ అయ్యింది... ఇంతతక్కువ సమయంలో ఇలా మీరు క్యాన్సర్ పై విజయం సాధించడంచాలా గ్రేట్... మా హాస్పిటల్ చరిత్రలో అద్భుతం. ఒక సామాన్య గృహిణి అయిన మీరు మీ అనుభవాలు పంచి మరెందరికో స్పూర్తి ఇవ్వాల్సిన అవసరం ఉంది.. అందుకే రేపు మీ ఇంటర్వ్యు తీసుకోవడానికి’ స్పూర్తి ‘, ‘మహిళ’ ఛానల్ వారితో పాటు పాత్రికేయులు వస్తామన్నారు.... హార్టీ కంగ్రాచ్యులేషన్స్ .... ఇంత మంచి అర్దాంగిని పొందిన మీ శ్రీవారు అదృష్టవంతులు...’ అటువైపు నుండి డాక్టర్ మాట్లాడుతుంటే దూరంగా గుడిలోని జే గంటలు మంగళ కరంగా మోగాయి. *************

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

తెలంగాణా లో రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి పరిచయం క్లుప్తంగా పూర్తి పేరు : నామని సుజనాదేవి విద్యార్హతలు : B.Sc.,B.Ed.,M.A.(English),LL.B.,PGDCA., FIII(Fellow of Insurance Institute of India) M.Sc.(Psychology),M.A.(Telugu) English&Telugu Type Writing lower. వృత్తి :భారతీయ జీవితబీమా సంస్థలో పరిపాలనాధికారి ప్రవృత్తి : కధలు,కవితలు వ్రాయడం,చెస్,క్యారమ్స్,టి‌టి ,అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడటం,వ్యాసరచన,వక్తృత్వం లాంటి అన్నిపోటీల్లోపాల్గొనటం మూడు కధా సంపుటాలు రెండు కవితా సంపుటాలు వెలువరించడం. ‘మనో స్పందన’ కధా సంపుటికి రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం రావడం. 1.భారత మహిళా శిరోమణి అవార్డ్ ౩. సంపూర్ణ మహిళా అవార్డ్ 4 . అలిశెట్టి ప్రభాకర్ స్మారక కవితా పురస్కారం 5. శ్రీ శ్రీ సాహితీ పురస్కారం 6. గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) అవార్డ్ 7. ఉగాది పురస్కారం , రుద్రమదేవి మహిళా పురస్కారం 8. శ్రీ అయితా చంద్రయ్య సంప్రదాయ కధా పురస్కారం 9. బెస్ట్ సిటిజెన్ అవార్డ్ 10. ‘విశ్వ శాంతి సేవా పురస్కారం ‘ 11. శాతవాహన విశ్వ విద్యాలయ కధా పురస్కారము 12. సోమరాదాక్రిష్ణ స్మారక వ్యాస పురస్కారం 13. ‘గురజాడ సాహిత్య పురస్కారం ‘ 14. సైదా సాహెబ్ స్మారక మినీ కవిత లో ప్రధమ బహుమతి 15. ఆంద్ర ప్రదేశ్ మాసపత్రిక హాస్య కధల పోటీలో ప్రధమ బహుమతి 16. రెండు సార్లు నెలవంక నెమలీక కధా పురస్కారం 17. ప్రతిలిపి ద్వారా ‘కధా కిరీటి ‘, ‘ కవి సుధ ‘ బిరుదులు, సహస్ర కవిమిత్ర బిరుదు 18. ‘సాహితీ రత్న’ అవార్డ్ 19. కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ అవార్డ్ 20. ఇప్పటివరకు దాదాపు 70 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లో ,6 విశాఖ ఆకాశవాణి లో,3 హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రసారం చేయబడినాయి. 21. 225 కధలు,175 కవితలు,25 ఆర్టికల్స్ ఈనాడు,తెలుగువెలుగు ,విపుల ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి,కధాకేళి, ముంబైవన్,ఉషోదయ వెలుగు ,వైఖానసప్రభ మొదలగు పత్రికల్లో ప్రతిలిపి, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, వసుధ ,మామ్స్ ప్రేస్సో వంటి వెబ్ మాగజీన్ లలో ప్రచురించబడ్డాయి. 22. LIC డివిజన్ లెవల్ చెస్ లో 10 సార్లు, అధ్లేటిక్స్ 3 సార్లు,టి.టి.లో 5 సార్లు ప్రధమ స్థానం పొంది జోనల్ లెవెల్ లో పార్టీసీపేట్ చేయడం. 23. రాష్ట్రస్థాయి జాతీయ వెటరన్ అధ్లేటిక్ మీట్లలో 2000 నుండి 2003 వరకు దాదాపు 15 నుండి 20 వరకు గోల్డ్,సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందడం. జోనల్ లెవల్ అధ్లేటిక్ మీట్లో 400మీటర్ల పరుగుపందెంలోబ్రాంజ్ మెడల్ 24. 11 వ్యాసాలకు, దాదాపు 27 కధలకు , 12 కవితలకు కొన్ని ఆర్టికల్స్ కు బహుమతులు పొందడం. 25. దూరదర్శన్ హైదరాబాద్ , వరంగల్ సప్తగిరి చానల్స్ ద్వారా ఇంటర్వ్యులు, మనమాట- మన పాట కార్యక్రమం, ఉగాది కవిసమ్మేలనాలలో పాల్గొనడం 26. మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సాహిత్య అవార్డ్ 27. క్రియేటివ్ ప్లానెట్ జాతీయ కవితా పురస్కారం 28. .శ్రీరామదాసి సాహిత్యపురస్కారం , ఎడపల్లి, నిజామాబాద్ 29. 405 కధలు వచ్చిన ప్రతిష్టాత్మక నవ్య ఉగాది పోటీలో ‘అనుబంధం’ కధ కు బహుమతి 30.అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ అమెరికా వారు జూన్ 2019 లో నిర్వహించిన కధల పోటీలో ‘తేడా’ కధకు బహుమతి రావడం. 31. గో తెలుగు వెబ్ సైట్ వారు వారు నిర్వహించిన పోటీ లో ‘ప్రేమ నేర్పిన పాఠం ‘ కి జూన్ 2019 లో బహుమతి 32. కెనడా డే 2019లో నిర్వహించిన పోటీలో ‘వాగార్దావివ సంత్రుప్తౌ’ కధ కు బహుమతి 33. తెలుగు కళా సమితి అమెరికా వారు నిర్వహించిన కధల కవితల పోటీలో , ‘చేయనితప్పు’ కధకు, ‘అలుపెరుగని పోరాటం’ కవితకు ప్రధమ బహుమతులు. 34. నిడదల నీహారికా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో 2020 ‘కుజ దోషం’ సంక్రాంతి కదల పోటీలో 20౦౦ నగదు బహుమతి. 35. ప్రతిష్ట్మాత్మక ఈనాడు కధావిజయం పోటీలో వెయ్యి కధల్లో నాకధ ప్రచురణకు సెలక్ట్ కావడం. 36. పుప్పాల ఫౌండేషన్ కధా పురస్కారం ‘వ్యత్యాసం' కధకు 18-1-20లో 37.హాస్యానందం చక్కరకేలీ పోటీలో ‘ఆనందం –ఆరోగ్య రహస్యం’ కధకు 5-1-20 లో బహుమతి ప్రధానం. 38. అంపశయ్య నవీన్ గారి ప్రధమ నవలల పోటీలో నా నవల ‘ఐ లవ్ మై ఇండియా’ కు పదివేల బహుమతి 24-12-19న స్వీకరించడం. 39. ‘తెలుగు పునర్వైభవం ‘ అంశం పై సాహితీ కిరణం నిర్వహించిన కవితల పోటీలో నా కవితకు ఫిబ్రవరి 2020లో బహుమతి రావడం. 40. ‘పొడుస్తున్న పొద్దు’ కధకు మామ్స్ ప్రేస్సో వెబ్ సైట్ లో ఏప్రిల్ 2020లో బహుమతి రావడం 41. రెండు తెలుగు రాష్టాల వారికి పెట్టిన పోటీలో నా కధా సంపుటి ‘స్పందించే హృదయం’ కు ‘సుందరాచారి స్మారక పురస్కారం’ 42. మామ్స్ ప్రేస్సో లో ‘ఇంటింటి రామాయణం’ బ్లాగ్ కి బహుమతి 43. తెలుగు సాహితీ వనం నిర్వహించిన పోటీలో నా కధ ‘తేడా’ కి జూన్ 20 లో బహుమతి 114. ప్రియమైన కధకుల గ్రూప్ లో ‘అనుబంధం’ కధకి జూలై 20 లో తృతీయ బహుమతి ******

199 views3 comments
bottom of page