top of page
Original.png

అమ్మ సూక్తి రత్నాలు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaSukthiRathnalu, #అమ్మసూక్తిరత్నాలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 47

Amma Sukthi Rathnalu - Somanna Gari Kavithalu Part 47 New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 28/03/2025

అమ్మ సూక్తి రత్నాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 47 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అమ్మ సూక్తి రత్నాలు

----------------------------------------

అడ్డంకులు ఎదురైనా

ప్రయత్నాలు మానరాదు

అవమానాలు వచ్చినా

కుమిలి కుమిలి ఏడ్వరాదు


ఆరాటం సరిపోదు

పోరాటం చేయాలి

అవహేళన చేసినా

లక్ష్యాన్ని ఛేదించాలి


భీతిల్లి సమస్యలకు

పిరికితనం చూపరాదు

బ్రతుకులో కష్టాలకు

చురుకుదనం వీడరాదు


క్లిష్టమైన పరిస్థితులకు

వెనుకడుగు వేయరాదు

వదరుబోతుల మాటలకు

మదిని క్రుంగిపోరాదు

ree



















ప్రబోధ గీతి మాలిక

----------------------------------------

గుండెలోని ప్రేమవనము

గుబాళించ నివ్వూ!

శ్రేష్టమైన మంచితనము

పొంగిపొర్ల నివ్వూ!


నవ్వులోని చక్కదనము

నాట్యమాడ నివ్వూ!

హానికరం బేలతనము

పారిపోవ నివ్వూ!


సహకారం మేలిగుణము

అందరికంద నివ్వూ!

మమకారం మేటిగుణము

సదా వెలుగు నివ్వూ!


క్షమించుట గొప్పదనము

నదిలా సాగ నివ్వూ!

తెలుగుభాష తీయదనము

రోజూ! గ్రోల నివ్వూ!

ree













ఉంటేనే అందము

----------------------------------------

విహరించే పక్షులు

ప్రవహించే యేరులు

ఉంటేనే అందము

వికసించే పూవులు


మింటిలోన తారలు

ఇంటిలోన బాలలు

ఉంటేనే అందము

బ్రతుకులోన విలువలు


కొమ్మలోన ఆకులు

అమ్మలోని గుణములు

ఉంటేనే అందము

కమ్మనైన పలుకులు


అల్లుకున్న తీగలు

ప్రేమలొలుకు మనసులు

ఉంటేనే అందము

శుద్ధమైన తలపులు


పుడమిలోన మొక్కలు

కడుపు నింపు పల్లెలు

ఉంటేనే అందము

భువిని తల్లిదండ్రులు


అవనిలోన అతివలు

మాన్యులైన వృద్ధులు

ఉంటేనే అందము

దారి చూపు గురువులు

ree












కన్నోళ్ల ఋణం తీర్చలేము!

----------------------------------------

కన్నవారి ఋణమును

ఎవరు తీర్చగలరోయ్!

వారు చూపు త్యాగమును

ఎవరు వ్రాయగలరోయ్!


కనిపించే వేల్పులు

కన్నవారు మహిలో

అసమానము మమతలు

నిలుపుకొనుము మదిలో


విలువైన బహుమతులు

వసుధలోన కన్నవారు

కష్టబెట్టకూడదు

వారి ప్రేమ మనసులు


దాచుకో! గుండెల్లో

బ్రతుకులో దీవెనలు

పెట్టుకో! కళ్ళల్లో

అపారమే మేలులు

ree











టీచర్ సందేశం

----------------------------------------

గుండెల్లో ధైర్యము

ఉండాలి దృఢంగా

దేశానికి ప్రాణము

పెట్టాలి పణంగా


దేశభక్తి గొప్పది

చాటాలి అనిశము

క్షమాగుణము మంచిది

చూపాలి ప్రతిదినము


సత్యానికి సాక్షిగా

బ్రతకాలి గొప్పగా

నైతిక విలువలతో

మసలాలి స్ఫూర్తిగా


మంచికి వారధిగా

బలమైన సారథిగా

అవనిలో అందరికి

నిలవాలి మాదిరిగా


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page