top of page

నిమ్మకాయ

#Sసంపత్కుమార్, #SSampathKumar, #Nimmakaya, #నిమ్మకాయ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Nimmakaya - New Telugu Story Written By S Sampath Kumar

Published In manatelugukathalu.com On 28/03/2025

నిమ్మకాయ - తెలుగు కథ

రచన : S. సంపత్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సమయం రాత్రి 9


"అనందం.. ఆనందమాయో" సినిమా పాట పాడుకుంటూ బెడ్ రూంలోకి వచ్చింది గీత.

 

బెడ్ మీద పడుకొని ఉన్న గోవిందుకు భార్య ముఖంలో ఆనందంతో పాటు ఆ పాట వినేసరికి "ఏమో.. తెగ ఆనందంలో ఉన్నావు" అన్నాడు.


గీత.. మొగుడు పక్కన కూర్చుంటూ 

"అవునవును చాలా ఆనందంగా ఉన్న.. రేపు. నా పుట్టిన రోజు కదా.. సర్ప్రైజ్ గిఫ్ట్.. మా అక్క తీసుకొని వస్తుంది అంటా "


"అవునా.. ఏమి గిఫ్టు.. అయినా మీ పిసినారి అక్కకు నీ మీద అంత ప్రేమ ఎక్కడ నుంచి వచ్చింది అంటావు.. "


"అవునవును.. అదే అర్థం కావడం లేదు"


“కొంపదీసి.. ఊర్లో నీ పేరు మీద మీ నాన్న రాస్తా అన్న రెండు ఎకరాలు నీకు తెలియకుండా అమ్మేసింది ఏమో.. ఆ వచ్చిన డబ్బుతో.. "


"అవునవును.. వచ్చిన డబ్బులో సగం నొక్కేసి మిగిలిన డబ్బుతో మా అక్క ఏ బంగారు ఉంగరం తీసుకొని వస్తుంది "


"మరి ఆనందంగా పాట పాడుకుంటూ వచ్చావు.. మీ అక్క సంగతి తెలిసి"


“అవునవును.. మా అక్క గురుంచి తెలుసు కానీ నాకు పుట్టిన రోజు గిఫ్ట్ తెస్తుంది కదా.. అనే ఆనందంతో ఉన్న. కాని మీరు విడమరచి చెప్పేవరకు నా బుర్ర బలుపు వెలగలేదు"


"ఆ రెండు ఎకరాలలో నిమ్మ తోట వేయాలని కలగన్నాను.. ఎప్పటి నుండో మీ అక్క అమ్ముద్దాం అంటే.. మనమే అడ్డుకున్నాం" అన్నాడు గోవిందు.


"అవునవును.. మా నాన్న పేరు మీద ఉన్న ఆ నాలుగు ఎకరాలు నాకు రెండు మా అక్కకు రెండు అని నాన్న అన్నాడు కాని.. "


“అందుకే ఇంకా మీ నాన్న పేరు మీదనే ఆ పొలం ఉంది కాబట్టి మీ అక్క తెలివిగా ఇప్పుడే మొత్తం నాలుగు ఎకరాలు మీ నాన్న చేత అమ్మించి ఉంటుంది.. ఎలాగో మీ బావా సర్పంచ్.. ప్లాన్ వేసి అమ్మింటారు"


"అవునవును.. మా బావ తమ్ముడికి ఎప్పటినుంచో ఆ పొలం మీద కన్ను ఉంది"


"మీ అక్క పొలం అమ్మింటే.. కోర్టులో కేసు వేద్దాం"


"అవునవును.. కేసు వేద్దాం.. కానీ మా నాన్న నా పొలం.. నా ఇష్టం అంటే"


"మా ఫ్రెండ్ లాయరు రాజా ఉన్నాడు.. వాడికి అప్పజేబుదాం"


"అవునవును.. అదే చేయాలి కానీ కోర్టు కేసు అంటే అంతే" అంది గీత. 


"మరి ఏమి చేద్దాం.. ఇప్పుడే మీ నాన్న కు ఫోన్ చేసి.. నీ వాటా పోను మీ అక్క వాటా మాత్రం పొలం కూడ.. మేమే కొని నిమ్మ తోట.. పెట్టాలనుకున్నాం అని చెప్పు "


"అవునవును.. ఫోన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది కూడ. కానీ నాన్న ఈ పాటికి పడుకుంటాడు.. అయినా పొలం కొనడానికి మన దగ్గర డబ్బు ఎక్కడిది"


"మనం అనవసరంగా బుర్ర పాడు చేసుకుంటూన్నాం ఏమో "


"అవునవును.. , కానీ మా అక్కకు చాలా తెలివి తేటలు ఎక్కవ.. పోలం అమ్మే ఉంటుంది.. లేకుంటే నా బర్త్ డే గిఫ్ట్ ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు తెస్తుంది"


"అంతే అంటావా.. మీ బావ ఊర్లో చేతబడి కూడ చేయిస్తాడు అంటా కదా"


"అవునవును.. విన్న కానీ నేను ఎప్పుడు చూడలేదు "


"అయితే జాగ్రత్త గా ఉండాలి.. మన మీద కూడా చేతబడి చేయిస్తారు ఏమో "


“అవునవును.. మా బావా అలాంటి వాడే "


"ఈ రాత్రి కి నిద్ర పట్టదు"


“అవునవును.. నిద్ర రావడం లేదు " అంటూ.. ఇద్దరు బెడ్ మీద పడుకొని పైన ఫ్యాన్ వంక చూస్తున్నారు



తెల్లారింది.

డోర్ తెరిచింది గీత.

 

డోరు ముందు ఎదురుగా విచ్చుకున్న ప్లాస్టిక్ కవర్. 

అందులో నుంచి బయటకు వచ్చిన రెండు నిమ్మ కాయలు. తెరుచుకుని ఉన్న కుంకుమ, పసుపు, ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్టు.. పక్కనే నాలుగు. అగర్వత్తులు.. ఇవన్నీ చూసి షాక్ తో గీత 

"ఏమండీ".. గట్టిగా కేకలు వేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు గోవిందు.. 


"నిజంగా మనం అనుకునట్టు మీ అక్క వచ్చే ముందు మీ బావ చేత చేతబడి చేయించి ఇంటి ముందు పడేసింది "


"అవునవును.. నేను చూడకుండా ఇంకా తొక్క లేదు "


అంతలో ఆటో వచ్చి ఇంటి ఆగింది. 

అందులో నుంచి గీత అక్క లత లగేజ్ బ్యాగ్ తీసుకుని దిగింది.. 


వెంటనే గీతాను చూస్తూ 

"ఏమీ.. నా రాక కోసం.. గుమ్మం ముందు నిలబడి ఎదురు చూస్తున్నవా"


"అవునవును.. నీ రాక కోసం ఎదురు చూస్తున్నా.. చేసేదంతా చేసి.. ఏమీ తెలియని నంగనాచిలా.. ఆ పలకరింపు చూడు " అంది గీత. 


"ఏమే అంటున్నావు " అనుకుంటూ వస్తూ గుమ్మం ముందు సడన్ గా ఆగి, అక్కడ రెండు నిమ్మ కాయలు.. తెరుచుకుని ఉన్న కుంకుమ, పసుపు, ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్టు.. పక్కనే నాలుగు అగర్వత్తులు.. ఇవన్నీ చూసి షాక్ తో 

" ఏమిటిది.. కొంపతీసి.. నా మీద చేతబడి చేస్తున్నవా "


“అవునవును.. నీవు ఇలా అంటావు అని.. 

అమ్మో.. అమ్మో.. చేసేది అంత చేసి.. ఉల్టా నన్నే అంటున్నవా" అంది గీత. 


" నేను చేయడం ఏమిటి చెల్లి"


ఇంతలో గోవిందు 

"పొద్దునే మేము డోర్ తీయకముందే.. వచ్చి చేతబడి చేయించి.. ఇప్పుడు ఏమి తెలియని దానిలా ఎంత నాటకం"


"అవునవును.. పొలం అమ్మి.. నన్ను చేతబడితో ఏదో చేయాలని.. వచ్చి" గీతా అంటుంటే


"చెల్లి.. ఇంక ఆపుతావా.. నేను చెప్పేది విను "


"నీవు చేసేది చేసి.. నీ మాయ మాటలతో నన్ను మాయ చేయలేవు అక్క "


గోవిందు మాట్లాడుతూ

"సమయానికి చూడకుండా మీ చెల్లి ఆ నిమ్మకాయ తొక్కింటే" 


ముగ్గురి మధ్య మూగ సైగలతో మాటల యుద్ధం.. 

***


బయట పోట్లాట శబ్దం విని పక్కింటి ఏడు యేండ్ల పిల్ల మాధురి తన ఇంటి కిటికీలోంచి నుంచి చూస్తూ.. అక్కడే తాను బయట పెట్టిన కవర్ గీత వాళ్ల ఇంటి ముందు పడి ఉండటం చూస్తూ..


రెండు నిమ్మ కాయలు. తెరుచుకుని ఉన్న కుంకుమ, పసుపు, ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్టు.. పక్కనే నాలుగు అగర్వత్తులు.. ఇవన్నీ చూసిన తరువాత 


"అమ్మ.. చెత్త కవర్ పడి వేయమంటే పొరపాటున.. నాన్న పూజకు తెచ్చిన పూజ సామాగ్రి కవర్ బయట పడేసాను.. అది గీతా ఆంటీ ముందు ఎలా పడింది "


ఇంతలో మాధురి వాళ్ళు అమ్మ అక్కడికి వస్తూ 

"ఒసే.. మాధురి.. మీ నాన్న పూజ కోసం తెచ్చిన కవర్ కనపడటం లేదు.. ఇంక ఆ చెత్త కవర్ పడేయ్యమంటే అక్కడే పెట్టావు "


"అదే అమ్మ.. చెత్త కవర్.. నాన్న తెచ్చిన పూజ సామాగ్రి కవర్ రెండు ఒకేలా ఉంటే పొరపాటున ఆ పూజ సామాగ్రి కవర్ చెత్త కవర్ అని బయట పెట్టా.. ఆ కవర్ గీతా ఆంటీ ముందు ఎలా పడిందో "


"నీకు హడావిడి ఎక్కవ.. బయట పెట్టిన కవర్.. కుక్క తినేటివి అనుకుని.. అందులో తాను తినేటివి లేక గీతా ఇంటి ముందు పడేసి ఉంటుంది"


"బయట గీతా ఆంటీ.. ఈ కవర్ గురుంచి ఎవరితో గొడవ పడుతుంది.. నిజం చెప్పి వస్త"



అప్పుడే అక్కడికి వచ్చిన మాధురి నాన్న.. సుందరం గీతా, గోవిందు వాళ్ళ అక్క లతాతో గొడవ పడటం చూసి 


"ఏమిటి గొడవ"


"ఏముంది సుందరం.. మా ఆవిడ అక్క మాకు రావలసిన రెండు ఎకరాలు అమ్మి.. ముష్టి ఒక గిఫ్ట్ మా ఆవిడ మొఖనా కొట్టి, మేము ఏమి నోరు ఎత్తకుండా మా మీద చేతబడి చేయించాలని చూసింది " అన్నాడు గోవిందు.



"అవునవును.. నిమ్మ కాయలు నేను తొక్కక ముందే చూసాను కాబట్టి సరిపోయింది" అంది గీత 


అప్పుడు వాళ్ళ ఇంటి ముందు పడివున్న రెండు నిమ్మ కాయలు. తెరుచుకుని ఉన్న కుంకుమ, పసుపు, ప్యాకెట్స్ నుండి వెదజల్లినట్టు.. పక్కనే నాలుగు అగర్వత్తులు.. ఇవన్నీ సుందరం చూసి 


"ఇవి.. మా ఇంటి పూజ కోసం తెచ్చినట్టు ఉందే" అంటుంటే మాధురి వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చారు.


"గీత ఆంటీ.. ఈ కవర్ మా నాన్న తెచ్చిన పూజ సామాగ్రి కవర్.. అమ్మ పడేయ్యమని చెప్పిన చెత్త కవర్ కూడ ఒకేలా ఉంటే పొరపాటున ఆ పూజ సామాగ్రి కవర్ చెత్త అనుకొని ఈ కవర్ బయట పెట్టా.. "


"అవునా.. మా ఇంటి ముందు ఎలా పడిందో " అన్నాడు గోవిందు.


"ఇంకేమి ఉంది.. ఎప్పుడు మన ఇంటి ముందు తిరేగే కుక్క.. పడేసి ఉంటుంది" అంది మాధురి అమ్మ 


"అవునవును.. ఆ కుక్క పనే అయుంటుంది. సారీ.. అక్క.. ఇంట్లోకి రా" అంది గీత. 


మాధురి నాన్న సుందరం మాట్లాడుతూ

"ఇంకా ఈ కాలంలో చేతబడులు నమ్మడం ఏమిటో.. కొందరు స్వార్టపరులు తమ స్వార్థం కోసం సృష్టించిన ఈ మూఢనమ్మకాలు ఎందరినో బలి తీసుకుంటుంది. అన్నీ తెలిసి కూడా మనము ఇంకా కళ్ళు తెరవకుండా మనం కూడా చేతబడులను, క్షుద్ర పూజలను నమ్మడం ఏమిటి. "


“అవునవును.. ఇప్పటికి నమ్మే వాళ్ళు ఉన్నారు.. " అంది గీత 


"అదే మన దౌర్భాగ్యం.. ఇప్పుడైనా మేల్కోండి. ఇంకా నలుగురికి ఈ మూడ నమ్మకాలు నమ్మద్దు అని చెప్పండి "


"చెల్లి.. ఇప్పటికైనా.. ఇది నా పని కాదు అని నమ్ముతావా"


“అవునవును.. అక్క.. క్షమించు.. పదా ఇంట్లోకి "


గీత.. గోవిందులను చూస్తూ 

“ఇద్దరు ఆ కుర్చీలో కూర్చోండి” అంది లత.

 

ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు.

 

అక్కడే పళ్ళెంలో బ్యాగ్ లో నుంచి తీసిన ఒక ఫైల్, చీర, పంచే టవలు పెట్టింది. తర్వాత దేవుడు గూటిలో ఉన్న కుంకుమ భరణి తీసి అందులో కుంకుమతో గీత నుదట బొట్టు పెడుతూ ఫైల్.. చీర పెట్టింది. 

తర్వాత గోవిందు కుంకుమ భరణిలో బొట్టు పెట్టుకొన్నాక

పంచె, టవల్ అందించింది.


" అక్క.. ఈ ఫైల్ ఏమిటి ''


"అదే నీకు నేను తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ "


"సర్ప్రైజ్ గిఫ్టా"


"ఫైల్ తీసి చూడు "


గీత ఫైల్ తీసి అందులో ఉన్న బాండ్ పేపర్స్ చదువుతూ.. ఆశ్చర్యంగా లత వంక చూస్తూ

 

"అక్క.. నీ రెండు ఎకరాలు కూడ నా పేరు మీదే రాశావా" 


లత నవ్వుతూ ఎప్పుడు గీత అనే ఊత పదం డైలాగ్స్ తో 


"అవునవును.. నీ బర్త్ డే రోజు నేను ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే"


మళ్ళీ.. లతనే మాట్లాడుతూ 

"ఈ పిసినారి అక్క.. ఇలా సర్ప్రైజ్ చేసింది ఏమి అనుకుంటున్నావా.. మీ బావకు.. కోర్టులో పెండింగ్ ఉన్న ఆస్తి తిరిగి వచ్చింది.. ఇంక మీ నాన్న ఇచ్చే రెండు ఎకరాలు ఎందుకు అన్నాడు. అందుకే నాకు వచ్చే రెండు ఎకరాలు కూడ నీ పేరున రాశాను.. మీరు ఎలాగో నిమ్మ తోట వేయాలని ఉంది కదా.. మొత్తం పొలంలో వేసుకోండి"


"అక్క" అంటూ కౌగలించుకొని ముద్దు పెట్టింది. 


కొస మెరుపు..

 

"నిమ్మ కాయ ఆరోగ్య కోసం మన వంటికి మంచిది కానీ మానసిక రోగం మీ వంటికి తెచ్చే మూడ నమ్మకాలు క్షుద్ర పూజలకు మాత్రం కాదు "


***సమాప్తం***


S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6 లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.


Comments


bottom of page