top of page

అమ్మ

#VangalaRangachari, #వంగలరంగాచారి, #TeluguKavithalu, #తెలుగుకవితలు, #Amma, #అమ్మ 

Amma - New Telugu Poem Written By - Vangala Rangachari

Published In manatelugukathalu.com On 12/05/2025

మ్మ - తెలుగు కవిత

రచన: వంగల రంగాచారి


శాంతంగా ప్రవహించే నదివి

నింగిలో వెలిగే తారవి

నువ్వు స్థిరమైన నిజానివి 

శీతల పవనానివి

మమతల నీడవి

జీవిత ప్రాణవాయువువి

పావన ప్రేమజ్యోతివి

విశాల భూమండలంలో 

కరుణా సాగరానివి

సద్గుణాల రాశివి 

దేవుడిచ్చిన బహుమానానివి  

అపరిచితుణ్ణి నేను

ఈ లోకానికి నన్ను

పరిచయం చేసింది అమ్మ

సమస్యలనుంచి బయటపడేదారికి

వేలుపట్టుకుని నడిపించింది 

నిద్రపట్టని రాత్రుల్లో 

కమ్మని కధలు చెప్పింది 

కలలలోకి మళ్ళించింది  

ఈ మోసాల ప్రపంచంలో 

నీతి, నిజాయితీ గురించి చెప్పింది 

సమస్యల సుడిగుండంలో 

తాను కొట్టుమిట్టాడి

నన్ను శిఖరాగ్రానికి చేర్చింది 

సమాజంలో నాగరికుడిగా నిలిపింది 

అమ్మకి శతకోటి వందనాలు  


వంగల రంగాచారి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు వంగల రంగాచారి.

పుట్టిన ఊరు రాజముండ్రి(ఆంధ్రప్రదేశ్). తల్లితండ్రుల ఉద్యోగ రీత్యా పెరిగింది కొత్తగూడెం (నేటి తెలంగాణ రాష్ట్రము లోని జిల్లా).  విజయవాడ లయోలా కాలేజీ లో  B.Sc మరియు ఆంధ్ర యూనివర్సిటీ లో M.Sc (Tech) జియో ఫిజిక్స్ చదివాను. ఆయిల్ అండ్ న్యాచురల్  గ్యాస్ కార్పొరేషన్ (ONGC) లో 37 ఏళ్ళు పని చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాను. మద్రాస్ లో స్థిరపడ్డాను.


చిన్నప్పటినుంచి వచనకవిత్వం పైన అభిరుచి ఉండేది. ఆ నాటి మేటి కవులు శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దాశరధీ, డా. సి. నారాయణ రెడ్డి  లాంటి మరెందరో మహానుభావుల/మహాకవుల కవితలు చదివి తెలుగు సాహిత్యంపైన ఆసక్తి పెంచుకున్నాను.


ఈ ప్రయత్నంలో  అయిదు పుస్తకాలు  భావ తరంగాలు(2019), కాలం నేర్పిన కవితలు(2021),   భావ సప్తతి(2022), భావతరంగాలు(2023), , భావలహరి(2023)    ముద్రితమయ్యాయి. . 






1 Comment


అమ్మ గురించి ఎంత వ్రాసినా, ఎవరు వ్రాసినా చదవాలనే ఉంటుంది. మీ కవిత లో అమ్మ గుణాలు, ఆమె బిడ్డకు చేసే మేలు సరళంగా, వ్యక్తీకరించారు. అభినందనలు

Like
bottom of page