పరాచకాలాడితే..
- Palla Venkata Ramarao
- May 11
- 3 min read
#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #Parachakaladithe, #పరాచకాలాడితే, #TeluguMoralStories, #నైతికకథలు, #TeluguChildrenStories

Parachakaladithe - New Telugu Story Written By - Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 11/05/2025
పరాచకాలాడితే.. - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
హర్ష అల్లరి ఒక పిల్లాడు. తన అల్లరి చేష్టలతో చుట్టూ ఉండేవారిని విసిగిస్తుంటాడు. వాడి అల్లరి ఎలాంటిదంటే పక్కింటికివెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. వారు తలుపు తెరిచేలోపే తుర్రుమంటాడు. వచ్చిన వారు ఎవరు బెల్ కొట్టారో తెలియక తెల్లమొకం వేసుకొని చూస్తుంటారు.
మరొక ఇంటి ముందుకెళ్లి "అమ్మా ధర్మం" అంటూ అచ్చం బిచ్చగాడిలా అరుస్తాడు. ఆ గృహిణి బిచ్చం తీసుకుని వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోతుంది. "ఓరి భడవా! నువ్వట్రా"అని నవ్వుకుని వెళ్లిపోతుంది.
ఇంకొకరింటికి వెళ్లి "ఆంటీ! మా అమ్మ పది రూపాయలు అప్పిప్పించుకు రమ్మంది" అంటూ డబ్బు పట్టుకెళ్తాడు. వారు ఎప్పుడో వాళ్లమ్మని అడిగితే గానీ విషయం బయటపడదు. ఇలా ఎన్నో తుంటరిపనులు చేస్తూ అదంతా తన తెలివితేటలు అనుకుని మురిసిపోతుంటాడు, వాళ్లమ్మ ఎన్నో సార్లు బుద్ధి చెప్పడానికి ప్రయత్నించినా వాడికి అర్థం కాలేదు.
ఒక రోజు హర్ష బడి నుండి ఇంటికి వచ్చాడు. ఇంటిలో ఏ అలికిడి లేక పోవడంతో అనుమానంగా లోనికి వచ్చాడు.వాడి నాన్న ఏదో పని వుండి వేరే ఉరికి వెళ్ళాడు.హర్ష "అమ్మా" అని పిలుస్తూ లోనికి వెళ్ళాడు. అమె పడగ్గదిలో పడుకుని వుంది. నిద్రపోతోందేమోనని లేపడానికి ప్రయత్నించాడు. ఆమె ఒళ్లు సలసలా కాగిపోతోంది.
జ్వరంతో ఉందని అర్థమయింది వాడికి, కంగారుగా “అమ్మా! అమ్మా!” అంటూ లేపడానికి ప్రయత్నించాడు కానీ ఆమె లేవలేదు.
జ్వరం ఎక్కువై అపస్మారక స్థితిలో ఉంది. తల్లి లేవలేక పోయెసరికి హర్ష కు దిక్కు తోచలేదు వెంటనే పరిగెత్తుకుంటూ పక్కింటికి వెళ్ళాడు. ఆ ఇంటావిడ దగ్గరికి వెళ్లి "ఆంటీ, మా అమ్మకు జ్వరం గా వుంది. లేవలేకపోతోంది, రండి ఆంటీ!" అంటూ చెప్పాడు.
ఆమె నమ్మలేదు."పోరా వెధవా! నేన్నీ మాటలు నమ్మను. ఎప్పుడూ పరాచకాలే" అని అంది.
"లేదాంటీ! ఇప్పుడు నేను చెప్పేది, నిజమే ఒట్టు" అన్నా కూడా "సర్లే తర్వాత వస్తాపో" అంది కానీ కదల్లేదు.
వాడికి ఏం చెయ్యాలో తెలియక వేరే యింటికి వెళ్ళాడు. అక్కడ ఆ యింటి వారికి చెప్పినా వారు కూడా నమ్మలేదు. అలా వీధిలో అందరి ఇళ్ళూ తిరిగాడు. ఎవరు వాడి మాట లెక్కపెట్టలేదు. నిజం చెబుతుంటే ఎందుకు నమ్మడం లేదో వాడికి అర్థం కాలేదు.
ఇంటికి వచ్చాడు. అమ్మని లేపడం వాడి వల్ల కాలేదు. ఆమె ఒళ్ళు సలసలా కాగిపోతోంది. వాడికి కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంతలో వాడికొక ఆలోచన వచ్చింది. గబగబా బయటికి పరిగెత్తాడు. వీధి చివర ఒక డాక్టరు ఉన్నాడు.
అక్కడికి వెళ్లి విషయం చెప్పాడు హర్ష. డాక్టరు కూడా మొదట అపనమ్మకంగా చూసాడు. కానీ వాడు ఏడుస్తూ కాళ్ళవేళ్ళ పడేసరికి ఆయన బయలుదేరాడు. హర్ష యింటికి వచ్చిన డాక్టరు వాళ్ళమ్మకి ఇంజక్షన్ వేసి టాబ్లెట్లు రాసిచ్చాడు. జ్వరం తీవ్రంగా ఉందని చెప్పాడు. జాగ్రత్తగా కనిపెట్టుకొని మందులు వాడమని హర్ష కు చెప్పాడు.
డాక్టరు రావడం గమనించిన పక్కింటావిడ కూడా హర్ష ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె బాధ పడింది. "వీడు రోజు అబద్ధాలు ఆడుతూ తుంటరి పనులు చేస్తుంటే ఈరోజు కూడా అలాగే చేస్తున్నాడనుకున్నా" అని అంది వసుంధరకు సపర్యలు చేస్తూ.
అప్పుడు డాక్టరు హర్ష ను చూసి "నువ్విలా ప్రతిరోజు అబద్దాలాడి ఎప్పుడో నిజం పలికితే జనం నమ్మరు. ప్రాణం మీదకి వచ్చినపుడు నువ్వెంత గొంతు చించుకున్నా కాపాడేవారుండరు. పరాచకానికి కూడా అబద్దాలాడకూడదు. ఇప్పటికైన బుద్ది తెచ్చుకో " అన్నాడు మందలిస్తూ.
హర్ష కన్నీళ్ళు తుడుచుకుంటు బుద్ధిగా తలూపాడు.
అప్పట్నుంచి అబద్దాలాడటం, అల్లరి చేయడం మానేశాడు.
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
@The_leo_tv
•14 hours ago
Nice
@sugatha_
•14 hours ago
Good