top of page

అమ్మంటే

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #TeluguKavithalu, #తెలుగుకవితలు, #Ammante, #మ్మంటే

ree

Ammante - New Telugu Poem Written By - Vemparala Durgaprasad

Published In manatelugukathalu.com On 11/05/2025

మ్మంటే - తెలుగు కవిత

రచన: వెంపరాల దుర్గాప్రసాద్


అమ్మా అన్నం తిన్నవా అని కొడుకు అడిగినప్పుడు పొంగిపోతుంది..

నాకోసం ఇంకెంత కాలం కష్ట పడతావని అమ్మకి సాయం చేద్దామని బిడ్డ ముందుకొచ్చినప్పుడు ఉబ్బి తబ్బిబ్బయి పోతుంది..

ఆప్యాయంగా అమ్మని పలకరించి నప్పుడు కరిగిపోతుంది..

ఎంత ఎదిగినా,అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని

బిడ్డ పడుకున్నప్పుడు పొంగిపోతుంది

నేనెంత అదృష్టవంతురాలిని అనుకుంటుంది..

అదే కదా అమ్మంటే..


HAPPY MOTHER'S DAY

---------------------------------------------

అమ్మ మీద కమ్మనైన పద్యము

---------------------------------------------

ree









అమ్మ యనిన చాలు ఆదరిం చగలదు

మనసు నిండ వెన్న , మాట తీపి

అలుసు చేసి చూడ ఆదిశ క్తివలెను

దుష్ట జనుల కూడ దునుము నెపుడు.

🍀🍀🍀🍀🍀🍀

HAPPY MOTHER'S DAY

ree

-వెంపరాల దుర్గాప్రసాద్




Comments


bottom of page