top of page

 గంప కింద నల్లకోడిపెట్టలు

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #GampaKindaNallakodiPettalu, #గంపకిందనల్లకోడిపెట్టలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Gampa Kinda Nallakodi Pettalu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao 

Published In manatelugukathalu.com On 11/05/2025

గంప కింద నల్లకోడి పెట్టలు - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆ తెల్లవారుజామున ఒక్కసారిగా మెలకువ వచ్చి లేచి కూర్చుని ఏవో మాట్లాడుకొని 'మళ్ళీ తర్వాత కాసేపు ఉన్నాక లేగుద్దాము' అని అనుకొని పడుకున్నారు వెంకట సుబ్బారాయుడు, అతని భార్య మండోదరి. 


కాసేపు వాళ్లు మగత నిద్రలోకి వెళ్లాక నెమ్మదిగా తెలతెల్లగా తెల్లవారబోతుంది. సమయం ఉదయం ఆరు గంటలు కావస్తుంది. 


ఎవరో బయట తలుపు తట్టిన శబ్దం కావడంతో

భయపడి బయటకు వచ్చి చూడకుండా తమలో తాము కంగారుపడుతూ.. ఎవరబ్బా.. అంటూ ఆలో చించుకోవడం మొదలుపెట్టారు. 


ఎందుకు అంటే.. తమ ఇంటికి పేపరు వాడు కానీ పాలవాడు కానీ ఇస్త్రీ బట్టలు అబ్బాయి కానీ కూర గాయలు వాడు కానీ రారు. ఎరుగుపొరుగు అంత చనువుగా మాట్లాడేవారు కానీ.. వచ్చి ఏదో విషయం గురించి తలుపు కొట్టేవారు గానీ అంత కలుపుగోలు తనం, స్నేహం చుట్టుపక్కల కుటుంబాలలో ఎవరి తోనూ లేదు. మరి ఆ వచ్చిన వాళ్ళు ఎవరబ్బా అంటూ చాలాసేపు ఆలోచించుకొని ఇంకా తలుపు అలా కొట్ట డంతో మొత్తానికి ధైర్యం చేసి లేచి వెళ్లి తలుపు తీశారు వెంకట సుబ్బారాయుడు, అతని భార్య మండోదరి. 


ఎదురుగా పక్క ఇంట్లో నివాసం ఉండే మృత్యుంజయ రావు కనిపించాడు. 


మంచి కసి మీద కోపం మీద మొఖం ఎర్రగా మారి కనుగుడ్లు పెద్దవి చేసుకొని ఉన్నాడు. అతను ఎప్పుడూ వీళ్ళతో ఎక్కువగా మాట్లాడి ఉండడు అయినప్పటికీ ఈరోజు ఎందుకో ఉగ్రరూపంతో సరాసరి ఇంటికే వచ్చేసాడు


''ఏమయ్య నీకు బుద్ధుందా.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా. నువ్వు పుట్టింది మనిషి పుట్టుకేనా మీ ఇంట్లో వాడకం నీరు మా వాకిట్లోoచి వెళ్తుంది.. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను. నువ్వు జాగ్రత్తగా ఉండడం లేదు. '' అంటూ తిట్లు, శాపనాకారాలు లంకించుకున్నాడు. 


వెంకట సుబ్బారాయుడు, మండోదరి ఇద్దరు కూడా అతనితో సమానంగా పోరాడి 'నీ దిక్కు ఉన్నచోట చెప్పుకో''అన్నట్టు మాట్లాడారు. 


అదే రోజు సాయంత్రం మళ్లీ.. దొడ్లో నుండి కేకలు మొద లు పెట్టాడు మృత్యుంజయరావు. 


''ఇదో.. వెంకట సుబ్బారాయుడు.. నువ్వు నీ పెళ్ళాం అడవిలో ఉండవలసిన మనుషులు. మీకు బుర్రలు పనిచేస్తున్నాయా లేదా అసలు. ఇరుగుపొరుగు వాళ్ళు మీకు దద్దమ్మల్లా కనిపిస్తున్నారా. చేతకానీ వాజమ్మలు అనుకుంటున్నారా. 


''మీరు ఆరబెట్టు కున్న మైలబట్టలు అన్నీ ఎగిరి మా దొడ్లో పడుతున్నాయి.. '' అంటూ మళ్లీ శాపనాకారాలు లంకించుకున్నాడు. 


ఈసారి వెంకట సుబ్బారాయుడు మండోదరి వదిలి పెట్టలేదు. వాళ్ళు కూడా నోటికొచ్చిన శాపనార్థాలు పెట్టారు. ఇంచుమించు అందరూ కొట్టుకునే స్థితికి వచ్చారు.. గోడ ఇవతల నుండి గోడ అవతల నుండి. 


మృత్యుంజయరావు.. '' ఇదిగో వెంకట సుబ్బారా యుడు నేను చచ్చిన నిన్ను వదిలిపెట్టను. చచ్చినా వదిలిపెట్టను జాగ్రత్త. అంతలా బాధ పెడుతున్నావు నువ్వు నన్ను. జ్ఞాపకం పెట్టుకో. చచ్చిపోయాక కూడా దయమయ్యే వచ్చి నిన్ను పీక్కు తింటా జాగ్రత్త. ఖబర్దార్. ' అంటూ కేకలు పెట్టుకుంటూ ఇంటి లోపలకు వెళ్ళిపోయాడు. 


ఆ మర్నాడు సాయంత్రమే ఇన్ని తిట్లు తిట్టి కేకలు పెట్టుకుంటూ వెళ్లిన మృత్యుంజయరావు హార్ట్ఎటాక్ వచ్చి సడన్ గా సచ్చిపోయాడు. 


అంతే.. వెంకట సుబ్బారాయుడు కి మండోదరి కి తమ పై కసి పెంచుకున్న ఆ పిచ్చి వెధవ మృత్యుంజయ రావు దెయ్యం లా వచ్చి తమని ఏమైనా చేస్తాడేమో అన్న భయం పట్టుకుంది. 


మృత్యుంజయరావు బాడీని సాగనంపే కార్యక్రమాలు అన్ని అన్ని ఆ రాత్రి పూర్తి అయ్యాయి. తమ పక్క పోర్షన్ కనుక వద్దని అనుకున్నా అవన్నీ వెంకట సుబ్బా రాయుడు మండోదరి కి కళ్ళల్లో కనపడక తప్పలేదు. 


అవన్నీ సినిమాలో సంఘటనలులా కళ్ళ రెటీనా పై ముద్ర పడిపోయి చెరిగిపోవడం లేదు


గుండెలలో గట్టిగా పట్టుకున్న భయంతో ఒక్క నిమిషం ఇంటి దగ్గర స్థిమితంగా ఉండలేకపోయారు. ఉదయం భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. విషయం చెప్పారు వెంకట సుబ్బరాయుడు, మం0డోదరి దంపతులు


ఆ మధ్యాహ్నం భూతాలరావు 100 నిమ్మకాయలు పసుపు కుంకుమ తో వచ్చి గదులన్నీ తిరిగి ప్రతి గదిలో ఆగ్నేయ మూల గొయ్యి తీసి ఏదో ఏదో చేసి హామ్ ఫట్ట్ హాట్.. హామ్ ఫట్ట్ హాట్.. అంటూ భూతనాట్యం చేసి.. భార్యభర్తలు ఇద్దరూ నెత్తిమీద నిమ్మకాయలు కోసి మెడలో ఇద్దరికీ పెద్ద పెద్ద తాయత్తులు కట్టి ఏవేవో ఏవేవో భూతాలు మంత్రాలు పటించమని చెప్పి.. 5 వేలు గుంజుకుని వెళ్ళిపోయాడు. 


ఆ రాత్రి ధైర్యం తెచ్చుకొని హాయిగా, మంచం మీద వాలారు వెంకట సుబ్బారాయుడు, మండోదరి. 


ఏదో గుర్తొచ్చినట్టు మళ్లీ ఐదు నిమిషాలలో పైకి లేచి వాళ్ళిద్దరు సడన్ గా వీధి తలుపు తీసుకుని వాకిట లోకి వెళ్లి బుజ్జి టామీ ని తాడు విప్పి గదిలో కి తెచ్చు కొని కట్టేసారు మంచం కోడికి. 


అర్ధ గంట పోయాక మళ్లీ బయటకు వెళ్లి తాము పెంచుకుంటున్న 3 నల్లకోడి పెట్టలను ఒక పుంజును గంప తో సహా తెచ్చి బెడ్ రూమ్ లో ఒక మూలన పెట్టుకున్నారు. 


వాట్లను మృత్యుంజయరావు ఆత్మ.. భూతమై పీక నులిమి చంపుకు తింటుంది ఏమో.. అన్న భయం వాళ్లకు పట్టుకొని అలా చేశారు మరి. !!!


మళ్లీ తలుపు గడియ పెట్టి భూతవైద్యుడు చెప్పిన హామ్ ఫట్ట్ హాట్.. హామ్ ఫట్ట్.. మంత్రాలు చదు వుకుంటూ.. మంచంపై వాలారు. 


అర్ధరాత్రి 12:00 గంటలు.. 


సడన్ గా ఆకాశం కారు నల్లనిమేఘమై పోయింది. చిన్నగా తుంపర మొదలైంది. భయంకరంగా ఉరు ములు మెరుపులు కిటికీ గాడలలోంచి గదిలోకి తన్ను కొస్తున్నాయి. వర్షం బాగా పెద్దగా దబదబా పడు తుంది. బయట ఉరుములు కూడా 100 మంది రాక్ష సులు కొట్టుకుoటున్నట్టు హాహాకారాలు పెడుతున్న ట్టు.. చాలా వికృతంగా వాతావరణం మారిపోయినట్టు అనిపించింది. లోపల గడియ పెట్టుకొని ఉన్న వెంకట సుబ్బారాయుడు, మండోదరి దంపతులకు. 


ప్రళయ భయంకరంగా ఉరుములు, మెరుపులు.. ఆ శబ్దాలకే ప్రాణం పోతుందేమో అని అన్నంత భయంగా ఉంది వాతావరణం


పైకి లేచి కిటికీ రెక్క తీసి ఆ పిశాచ గణాలు చిందులు వేస్తున్నట్టు ఉన్న అర్ధరాత్రి వాతావరణాన్ని చూడటానికి కూడా వాళ్లకు భయంవేసింది. ఇద్దరూ ఒకే దుప్పటి కొంచెం కూడా ఖాళీ లేకుండా మూసుకుని పడుకు న్నారు. నిద్ర పట్టడం లేదు. 


ఏమో.. ''ఆ మృత్యుంజయరావు ఆత్మ పిశాచి తలు పులు గడియ పెట్టి ఉన్నప్పటికీ లోపలకు రావొచ్చు. 

గోడలోంచి దూసుకుని మరీ గదిలోకి వచ్చేయొచ్చు సినిమాలలో చూస్తున్నాం కదా.. దళసరి దుప్పటి కప్పుకున్న లాగి పడేయవచ్చు.. తామిద్దరి పీక పిసికి నలిపి వేయవచ్చు.. ఏమో. '' జరగొచ్చు జరగవచ్చు. 


మళ్ళీ పైకి లేచారు. మూల ఉన్న రుబ్బురోలు తీసి ఎవరు తలుపులు తోచిన తలుపులు తెరుచుకోవ డానికి వీలు లేకుండా తలుపులకు అడ్డంగా పెట్టారు. 


దుప్పటి పక్కన పడేసి మంచం మీద ఉన్న బొంత తీసి కప్పుకు మళ్లీ పడుకున్నారు. 


అరగంట అయ్యింది వాతావరణంలో మార్పు లేదు. భయంకర పరిస్థితి అలాగే ఉంది. 


నెమ్మదిగా అర్ధరాత్రి రెండు గంటలకు చిన్నగా కునుకు పడుతున్న సమయం.. 


అంతే.. పెద్ద ఉరుము.. పిడుగు.. 


వాళ్ళిద్దరూ పడుకున్న మంచం పైన ఉన్న.. అటక మీదనుండి అందంగా అమర్చుకున్న స్టీలు సామాన్లు అన్ని డబల్ డబల్ దబెల్ దబెల్.. అంటూ వాళ్ళ మీద పడిపోయాయి ఒక్కసారిగా. 


ఇద్దరూ ఒక్క ఉదుటన లేచి పెద్దగా కేకలు పెట్టారు

దెయ్యం బాబోయ్ దెయ్యం.. 

దెయ్యం బాబోయ్ దెయ్యం.. 

దెయ్యం బాబోయ్ దెయ్యం.. 


వాళ్ళిద్దరి అరుపులకు టామీ గట్టిగా అరవడం మొదలు పెట్టింది. 


గంప తిరగబడి గంప మూడు నల్లకోడిపెట్టలు బయ టకు వచ్చి గట్టిగా అరుస్తూ రూమంతా చిందర వందర చేసి పడేస్తూ ఎగరడం మొదలు పెట్టాయి.. 


''వామ్మో.. ఆ మృత్యుంజయరావు దయ్యం ముందు ఈ మూడు నల్ల కోడి పెట్టలని చంపి రక్తం తాగేస్తుంది. 

తర్వాత మన మీద పడి మనల్ని చంపేస్తుంది.. వాము నాయనోయ్.. సినిమాల్లో చూస్తున్నాం కథల్లో కూడా ఇలాగే చెప్తూ ఉంటారు. చచ్చేముందు శబదం చేసినట్టు మొత్తానికి పగ తీర్చుకుంటున్నాడా మృత్యుంజయ రావు మనమీద. ఇక మనకు నూకలు చెల్లిపోయాయి దేవుని తలుచుకోవే మండోదరి.. గుండె దడదడతో భయంగా ఏడుస్తూ కేకలు పెట్టాడు భార్య వైపు చూస్తూ వెంకట సుబ్బారాయుడు. తను కూడా ప్రాణం మీద ఆశ వదులుకొని రెండు చేతులు పైకెత్తి ఒక నమస్కారం పెట్టాడు. 



అలా అలా చాలా భయపడిన ఇద్దరూ.. చివరికి రూమ్ లోని పెద్ద లైటు కూడా వేసి ధైర్యంగా ఉంటుం దని టీవీ ఆన్ చేశారు. 


నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా అర్ధరాత్రి వార్తలు వినిపిస్తున్నాయి తెలుగులో.. 


శ్రీ టీవీ వార్తలు వింటున్నారు.. 

చదువుతున్నది.. పరాక్రమ రావు. 


గుండె నీరసంగా ఉన్నవారు గుండె దిటవు చేసుకొని వినండి.. పది నిమిషాల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో భూ

ప్రకంపనలు. 


ప్రతి ఇంట్లో సామాన్లన్నీ పై పైన అందంగా పేర్చుకున్న అటక మీద నుండి క్రింద పడి ప్రజలకు గాయాలు కూడా అయినట్లు తెలిసింది. 


ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రోడ్డు మీదకు పరుగెత్తు కొని వచ్చి హాహాకారాలు చేస్తూ భయం భయంగా పరుగులు పెడుతున్నారు. 


భూకంప ప్రకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై.. 6. 2

గా నమోదయింది. 


వార్తలు సమాప్తం. 

ప్రతి 30 నిమిషాలకు ఒకసారి వినండి. 

మీ శ్రీ టీవీ. 


ఆ వార్త విన్నాక గుండె కుదుటపడింది.. వెంకట సుబ్బారాయుడు మండోదరి దంపతులకు. 


''హమ్మయ్య ఇదన్న మాట విషయం. ''

అనుకుంటూ పైకి లేచి గ్లాసుడు కాదు గుండెడు మంచి నీళ్లు తాగారు. 


**

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments


bottom of page