top of page

నా ఇల్లే నందనవనము

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #NaIlleNandanavanamu, #నాఇల్లేనందనవనము,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Na Ille Nandanavanamu - New Telugu Poem Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 10/05/2025 

నా ఇల్లే నందనవనము - తెలుగు కవిత

రచన: నంద్యాల విజయలక్ష్మి


నా ఇల్లు నందనవనమే

నా ఇల్లు సుందరసదనమే

అతిశయపరిమళవనమే

మేము మధ్యతరగతి వారథులం

ఆ తరం -ఈ. తరం కలిసినపుడు

నా ఇల్లు సుందరవనమే

ఇంటి ఆడబిడ్డలు తిరుగాడినప్పుడు

సోయగాల పూలసరమే

అన్నదమ్ముల సందడిలో

విహారాల యాత్రావనమే

అందరూ అమ్మ చుట్టూ చేరి తీపిగురుతులు తవ్వినప్పుడు

నాన్న నవ్వులతో సందడి చేసినపుడు

సుమథురసుందరవనమే

కూతుళ్ళూ కోడళ్ళతో కలకలలాడినపుడు

సుగంధపుసంపంగి వనమే

కొడుకులు అల్లుళ్ళూ ముచ్చట్లతో సెలయేరుగలగలల ప్రభావనమే

మనవలూ మనవరాళ్ళ కేరింతలతో

లేగదూడల గెంతులను మరిపించే బృందావనమే

చిలుకలూ కోయిలల శబ్దాలతో శాంతివనమే

సీతాకోకచిలకలు వాలిన మాధురీవనమే

మనసుమూలల ఆలపించే మధురగేయాల నయనానందవనము

సుపరిమళాల మాలతీ వనము

అవును నా ఇల్లే నందనవనము


***


నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

3 komentáře


ఇల్లు ఎన్నో తీపిజ్ఞాపకాల సమాహారం, ఆనందనిలయం అంటూ సులభశైలిలో రచయిత్రి వర్ణించిన తీరు మనోరంజకం

To se mi líbí

Simply superb..pleasant thoughts

To se mi líbí

మీ ఇల్లు వర్ణన మనోరంజకం. ఆది కలల బృందావనం. సుమధుర స్వప్నం. రచయిత్రికి శుభాకాంక్షలు

To se mi líbí
bottom of page