top of page

అనంత విశాల విశ్వంలో

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #AnanthaVisalaViswamlo, #అనంతవిశాలవిశ్వంలో

ree

Anantha Visala Viswamlo - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 26/09/2025

అనంత విశాల విశ్వంలో - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


అనంత విశాల విశ్వంలో,

ఆది-అంతం లేని సృష్టి క్రమంలో,

సూర్యచంద్రుల తేజో ద్వయంతో,

అష్ట దిక్పాలకులు, పంచభూతాల సాక్షిగా,

‘నేను-నాది’ అనే అహం వీడి,

కుళ్లు‌, కుఛ్ఛిత, స్వార్ధ గుణములను విడనాడి,

ప్రకృతినారాధిస్తూ, సమస్త జీవరాశులపట్ల విశ్వప్రేమను చూపుతూ,

‘ఎంత ఎత్తుకు దిగినా ఒదిగి ఉండాలనే’ నీతిని గిరులు, వృక్షాలనుంచి నేర్చుకుని ఆచరిస్తూ,

అంతఃకరణ చిత్తశుద్ధితో మనోమందిరంలో నెలకొన్న పవిత్రాత్మని ఆరాధిస్తూ,

మంచితనం-మానవత్వమే కవచకుండలాలుగా,

నీతి-నిజాయితీలే మార్గదర్శకంగా,

మనశ్శాంతే మూలధనంగా,

ఆరోగ్యమే మహాభాగ్యంగా,

సమస్త జీవరాశితో ప్రేమగా ముచ్చటిస్తూ,

ప్రేమైక జీవనం గడుపుతూ, 

అనంతవాయువులో లీనమై‌,

దివికేగుతాను. 

ఇదే జీవన చక్రభ్రమణం - జీవిత సత్యం.

ఇదే జీవితం - ఇంతే జీవితం.



ree

-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page