యాంకర్ పద్మ
- Mohana Krishna Tata
- Jan 31
- 3 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #AnchorPadma, #యాంకర్పద్మ, #TeluguStories, #తెలుగుకథలు

Anchor Padma - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 31/01/2025
యాంకర్ పద్మ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండి..ఏమండి..! ఇది చూసారా..?" అడిగింది భార్య పద్మ
"ఏమిటే..?"
"టీవీలో రోజూ చెబుతున్నారు కదా..కొత్తగా వస్తున్న ఛానల్ కోసం కొత్త యాంకర్స్ కావాలని..ఆ విషయం"
"చూసాను..అయితే దానితో నీకేంటి సంబంధం..?"
"ఎంత మాట..! మీ ఆవిడ అందంగా ఉంటుందా..లేదా చెప్పండి..? ఉందనే కదా పెళ్లి చేసుకున్నారు.."
"అవును అంటే ఒక బాధ, కాదు అంటే ఒక బాధ..అవును అంటేనే బెటర్..అవును..నీకేం తక్కువ..?"
"అవును కదా..! తొందర పడి మా ఇంట్లో మీతో పెళ్లి చేసేసారు గానీ..లేకపోతే మిస్ యూనివర్స్ అయ్యేదానిని..అప్పుడు మీకు నా ఆటోగ్రాఫ్ కూడా దొరికేది కాదు తెలుసా..! అదృష్టం కొద్దీ నా భర్త అయిపోయారు.."
"అవును..అవును..నిజమే..అదృష్టం ఎక్కువైపోయిందే నాకు"
('అనక తప్పదు మరి..' అని మనసులో అనుకున్నాడు సుబ్బారావు)
మరి నా అందం నాకు ఉపయోగపడాలి కదా..చెప్పండి..? నాకన్నా సుమారుగా ఉన్న ఆడవారే ఇప్పుడు టాప్ యాంకర్స్ గా మనం టీవీలో చూడట్లేదా..? ఆ సొట్ట బుగ్గల రాధ అదో యాంకరు, ఆ రుబ్బురోలు కాంచన, లేడీస్ ప్రోగ్రాం యాంకర్..వారికంటే నాకేం తక్కువ చెప్పండి..?"
"అవును..అవును..నిజమే..! అయితే ఏమంటావు..?"
"ఆ యాంకర్ పోస్ట్ కి నేను అప్లై చేస్తాను.."
"అయితే వెళ్ళు.."
('ఆ తిప్పలేవో ఆ సెలెక్టర్ పడతాడు..నాకెందుకు' అని మనసులో అనుకున్నాడు సుబ్బారావు)
"హమ్మయ్యా..! మొత్తానికి ఒప్పుకున్నారు. ఇలా వెళ్లి అలా యాంకర్ గా వచ్చేస్తాను..రేపటి నుంచి అందరూ నన్ను పద్మ అనరు తెలుసా..?"
"పేరు మర్చుకుంటావా పద్మా..?"
"అదే వద్దన్నది..నా పేరు యాంకర్ పద్మ..అలాగే అందరూ పిలవాలి.. "
"నువ్వు యాంకర్ అయ్యాకా..అలాగే పిలిస్తాను లే.."
('ఎలా పిలిచినా పాత పెళ్ళామే కదా..! కొత్త పెళ్ళాం రాదుగా' అనుకున్నాడు సుబ్బారావు)
మర్నాడు ఇంటర్వ్యూ కి హాజరయింది పద్మ. ఇంటర్వ్యూ చేసే అతను...
"నీ పేరు ఏమిటి..?"
"యాంకర్ పద్మ.."
"అదేమిటి..యాంకర్ మీ ఇంటి పేరా..? గొప్పగా ఉందే.."
"కాదండీ..అది నా ఆశయం పేరు.."
"చాలా ఆశతో వచ్చినట్టున్నారు పద్మగారు.."
"అవును సర్.."
"మీకు పెళ్ళి అయిందా..?"
"అయింది సర్.."
"పెళ్ళైతే..మిమల్ని యాంకర్ గా సెలెక్ట్ చెయ్యలేం..సారీ"
"అదేంటండి..ఆ ఆడవాళ్ళ ప్రోగ్రాం చేస్తుందిగా ..పది సంవత్సరాల నుంచి..ఆమెకి పెళ్లైంది కదా మరి..! వాళ్ళబ్బాయి ఎప్పుడూ బబుల్‌గమ్ తింటుంటాడని ఆమె ఇంటర్వ్యూ లో చెప్పిందిగా .."
"మీకు చాలా విషయాలు తెలుసే..బాగా ప్రిపేర్ అయినట్టున్నారు.."
"అవును సర్..! నాకు పెళ్ళైనా సరే..చూడండి ఎంత స్లిమ్ గా ఉన్నానో..పొంతూర్ సోప్ యాడ్ లో ముందు నన్నే అడిగారు..అప్పుడు నాకు కుదరక.. వేరే అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాను"
"నిజమా..! మీ మీద మీకు చాలా నమ్మకం పద్మగారు.."
"కానీ యాంకర్ ఖాళీలు అన్నీ ఫిల్ అయిపోయాయి..ఇప్పుడు నేను ఏమి చెయ్యలేను.."
"అలగనకండి..ప్లీజ్ సర్..! ఎంతో ఆశతో వచ్చాను"
"మీ మాట్లాడే తీరు చూస్తే కాదనలేకపోతున్నాను..ఒకటే యాంకర్ రోల్ ఖాళీ ఉంది.."
"అది నేను చేస్తాను.."
"కానీ..మీరు దానికి సరిపోరు..."
"చెప్పండి..చేసేస్తాను.."
" 'కడుపు నిండా తినండి' అనే కొత్త ప్రోగ్రాం కోసం యాంకర్ కావాలి..ఆ అమ్మాయి కొంచం బొద్దుగా ఉండాలి..లేకపోతే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవదు..మీరేమో నాజూకుగా ఉన్నారాయే"
"మేకప్ తో మేనేజ్ చెయ్యొచ్చుగా.."
"అవదు..మిమల్ని పెట్టుకుంటే, ఆ హోటల్స్ మూసుకోవల్సిందే..ఇలాంటి ప్రోగ్రాం మీకు కుదరదు.."
"పోనీ పొట్టి గౌన్లు వేసుకుని..వచ్చీరాని తెలుగుతో జనాల బుర్ర తినేయాలి..అలా చెయ్యగలరా..?"
"మా ఆయన ఎప్పుడూ 'నా బుర్ర తినకు' అంటుంటారు.."
"అది సరిపోదు...మీకు పెళ్ళి అయ్యిందిగా..పొట్టి గౌన్లు వెయ్యలేరు..అదీ కుదరదు.."
"ఏం చేస్తాం చెప్పండి..! పోనీ..పూజా ప్రోగ్రాం లో పట్టుచీర కట్టుకుని..అందంగా రెడీ అయ్యి..నమస్తే, విరామం, ధన్యవాదాలు చెబుతాను..మీకు ఓకే నా..?" అడిగింది పద్మ
"దానికి పెద్ద పేమెంట్ ఉండదు..మీకు ఏమీ ప్రయోజనం ఉండదు.."
"పర్వాలేదు సర్..టీవీ లో వారానికి ఒక్కసారి కనిపించినా చాలు..యాంకర్ అనే అంటారు...అది చాలు. ఇక డబ్బులంటారా..నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు..కానీ అప్పుడు నేను కట్టుకునే ఆ చీరలు అన్నీ నేనే ఉంచేసుకుంటాను.." అంది పద్మ
"మీ ఆసక్తి చూస్తే కాదనలేకపోతున్నాను..రేపే జాయిన్ అవండి..కాకపోతే పూజా ప్రోగ్రాం వారానికి ఒక్కటే ప్రోగ్రాం..గుర్తుంచుకోండి"
"ఓకే సర్.."
"పెళ్ళైతే కష్టం కదా..ఇంటిపని ఎలా మేనేజ్ చేస్తారు..?"
"పర్వాలేదు.. మా ఆయన ఇంటిపని, వంట పని బాగా చేస్తారు..నో ప్రాబ్లం.. నేను టైం కే వచ్చేస్తాను..."
"సర్..నెలకు నాలుగు చీరలు ఇస్తున్నారు..థాంక్స్ సర్.."
"నగలు మాత్రం అడగకమ్మా..! అవి చాలా కాస్ట్లీ..వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి.."
"నాకు మరీ అంత ఆశ లేదు సర్..కొంచం సీనియారిటీ వచ్చాక ఆలోచిస్తాను..మూడు నెలలులో కొంచం బొద్దుగా తయారైతే..అప్పుడు నాకు "కడుపు నిండా తినండి" కి యాంకర్ ఛాన్స్ ఇస్తారా..? పొట్టి గౌన్లు వేసుకుంటే ప్రమోషన్ ఇస్తారా..?"
"చూద్దాం..! నీ పెర్ఫార్మెన్స్ బట్టి, మా రేటింగ్ బట్టి "
ఆనందంగా ఇంటికొచ్చిన పద్మ..
"ఏమండీ..! గుడ్ న్యూస్..నేను యాంకర్ పద్మ అయిపోయాను.."
"గ్రేట్..ఇంతకీ..ఏమిటో నీ ప్రోగ్రాం.."
"నమస్తే, విరామం, ధన్యవాదాలు.."
"అంతేనా.."
"మధ్యలో .. కెమెరా వైపు చూస్తూ తలూపుతూ, చిన్నగా నవ్వితే చాలు అంతే.."
"నిజమా..?"
"అంతేనండి...! సంవత్సరం పోయాక చూడండి..నేను ఎక్కడ ఉంటానో..?
"నాకు టార్గెట్ ఉంది...బొద్దుగా తయారవ్వాలి..వేరే ప్రోగ్రాం కోసం.."
"ఏమిటో అది..?"
"నీట్ గా రెడీ అయ్యి..అన్ని వెరైటీస్ తిని..బాగున్నాయని చెప్పడమే..అంతే..!"
"తిండి ఖర్చు తగ్గినట్టే అయితే..! " అని ఆనందపడ్డాడు సుబ్బారావు
"నాకు ట్యూషన్ కూడా పెట్టించండి"
"దేనికి..?"
"తెలుగు బాష ముక్కలు చేసి, తప్పులు మాట్లాడాలి..అలాగే పొట్టి గౌన్లు వేసుకోవడం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి..వెంటనే కొన్ని తెప్పించండి "
"ఎందుకో..."
"కామెడీ షో యాంకర్ కి అదే మెయిన్.. పొట్టి గౌన్లు వేసుకుని, తెలుగు తప్పుగా మాట్లాడాలంటా..అందుకే అది కూడా ప్రాక్టిస్ చెయ్యాలి. ఇంకో విషయం..నేను యాంకర్ అయ్యాకా..ఇంటిపని, వంట పని మీరే చెయ్యాలి..నాకు టైం అస్సలు ఉండదేమో..!"
"నీ యాంకర్ గోల కాదు గాని..చంపుతున్నావే..!" అని తల పట్టుకున్నాడు సుబ్బారావు
*********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Nice one