top of page
Original.png

అమూల్యమైన అమ్మ

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmulyamainaAmma, #అమూల్యమైనఅమ్మ, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 11

Amulyamaina Amma - Somanna Gari Kavithalu Part 11 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 31/01/2025

అమూల్యమైన అమ్మ - సోమన్న గారి కవితలు పార్ట్ 11 -  తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అమ్మ మాట వెన్న ముద్ద

పెట్టమోయి! అందు శ్రద్ధ

ఆమె పాడు జోలపాట

జాలువారు తీపి ఊట


తల్లి మనసు పూలతోట

అలరించే వెలుగు కోట

శుభములొలుకు ఆమె నోట

సదనానికి పసిడి మూట


అమ్మ లేక జగతి లేదు

ఇంటిలోన వెలుగు రాదు

అభివృద్ధికి వెన్నెముక

గుండెల్లో నిలుపు గనుక


మాత ఇంట స్వర్గ సీమ

అసమానము ఆమె ప్రేమ

ఈ సత్యము మరువరాదు

నిర్లక్ష్యం చేయరాదు

ree















స్వర్గమే మనశ్శాంతి

----------------------------------------

వెలలేనిది మనశ్శాంతి

జీవితాల్లో నవ కాంతి

కల్గియుంటే సంక్రాంతి

లేకపోతే విభ్రాంతి


కొనలేనిది మనశ్శాంతి

కోల్పోతే అధోగతి

అది ఉంటే స్వర్గమే!

లేక బ్రతుకు నరకమే!


నెమ్మది లేని జీవితము

ఘోషించే సాగరము

అభివృద్ధికి అవరోధము

అంతా చిన్నాభిన్నము


మనశ్శాంతి నిలుపుకో!

ఆనందము పొందుకో!

బ్రతుకంతా విజయోత్సవము

అరుదెంచును మధుమాసము

ree














చెప్పాలని ఉంది!...

----------------------------------------

నాన్నలోని త్యాగగుణము

అమ్మలోని అనురాగము

చెప్పాలని ఉంది నాకు!

గురువులోని గొప్పతనము


చెట్టు చేయు ఉపకారము

మహనీయుల మంచితనము

చెప్పాలని ఉంది నాకు!

రవిచంద్రుల మేటిగుణము


కన్నవారి సహకారము

అంతులేని మమకారము

చెప్పాలని ఉంది నాకు!

గొప్పదని ఐకమత్యము


విలువైన మైత్రి బంధము

చిన్నారుల చక్కదనము

చెప్పాలని ఉంది నాకు!

చలి చీమల సమభావము


కుక్కలోని విశ్వాసము

కోడిపుంజు చురుకుదనము

చెప్పాలని ఉంది నాకు!

మల్లెపూల తెల్లదనము


వెన్నెలమ్మ చల్లదనము

వెన్నలోని మెత్తదనము

చెప్పాలని ఉంది నాకు!

అమ్మ ఒడిని వెచ్చదనము


ree











బామ్మ సూక్తులు

----------------------------------------

అన్ని చోట్ల మౌనము

పనికిరాదు సతతము

విప్పాలి నోరు ఇక

జరిగితే అన్యాయము


ఉదయము లేని రోజు

హృదయము లేని మనిషి

కానలేము మహిలో

యోచింపుము మదిలో


పొదుపు చేయని ఊరు

అదుపు ఉండని నోరు

అభివృద్ధికి దూరము

అక్షరాల సత్యము


తవ్వరాదు గోతులు

వద్దు వట్టి నీతులు

చేతలే అవసరము

ఆదర్శము ముఖ్యము


ree










అత్యంత ప్రాముఖ్యము

----------------------------------------

విత్తడానికి పొలము

వ్రాయడానికి కలము

అత్యంత ప్రాముఖ్యము

త్రాగడానికి జలము


పాడడానికి గళము

ఆడడానికి స్థలము

అత్యంత ప్రాముఖ్యము

వెళ్ళడానికి ద్వారము


నడవడానికి మార్గము

మనశ్శాంతికి ధ్యానము

అత్యంత ప్రాముఖ్యము

ఎదగడానికి జ్ఞానము


వెలగడానికి దీపము

కొలవడానికి దైవము

అత్యంత ప్రాముఖ్యము

సృష్టియందున స్నేహము

ree













మిత్రుని ప్రబోధము

---------------------------------------

నిరాశ కోరల్లో

చిక్కుకోకు నేస్తము

చిన్న చిన్న కలతలకు

మనస్తాపం చెందకు


అమావాస్య పిమ్మట

పౌర్ణమి ఉంటుందోయ్!

అస్తమించే రవికి

అరుణోదయముంటుందోయ్!


అపాయం వచ్చినా

ఉపాయముండాలోయ్!

ముందు చూపు మనిషికి

బ్రతుకున ఉండాలోయ్!


సమస్యలకు భీతిల్లి

పిరికితనము చూపకు

పుడమి పొరలు చీల్చే

విత్తు స్ఫూర్తి మరువకు


సమస్య పరిష్కారము

మగధీరుల లక్షణము

ప్రయత్నం చేస్తేనే

చేకూరును విజయము

ree











మేలిమి రత్నాల సరాలు

---------------------------------------

అదుపు లేని ఆశలు

తెచ్చిపెట్టు దుఃఖము

మితమైన కోరికలు

పంచి పెట్టు మోదము


వ్యతిరేక భావనలు

ప్రగతికి అవరోధము

శ్రేష్టమైన తలపులు

పంచును ఆనందము


అక్కరలో సాయము

పేదోళ్లకు న్యాయము

అర్హులకు మాత్రమే

చేయాలోయ్! ధర్మము


కన్నోళ్లకు సేవలు

చేస్తేనే పుణ్యము

మనసులోని ప్రేమలు

పంచితే సముచితము


ఎన్నెన్నో దారులు

కన్పించును నేస్తము!

అన్నిటిలో శ్రేష్టము

మేలైనది క్షేమము

ree




















ఉండాలోయ్! జీవితము

---------------------------------------

రాలలాగ గట్టిగా

పూలలాగ తావిగా

ఉండాలోయ్! జీవితము

పాలలాగ తెల్లగా


పాటలాగ హాయిగా

ఊటలాగ తీయగా

ఉండాలోయ్! జీవితము

కోటలాగ గొప్పగా


నవ్వులాగ సొగసుగా

గువ్వలాగ స్వేచ్చగా

ఉండాలోయ్! జీవితము

దివ్వెలాగ కాంతిగా


వెన్నలాగ మృదువుగా

వెన్నెల్లా చల్లగా

ఉండాలోయ్! జీవితము

వెన్నెముకలా బిగుతుగా


మొక్కలాగ ఒద్దికగా

ఉక్కులాగ దృఢంగా

ఉండాలోయ్! జీవితము

చుక్కల్లాగ చక్కగా

ree









గమనిస్తే గొప్ప వారు

---------------------------------------

గళంలోన గాయకులు

బలంలోన తెలివిపరులు

గమనిస్తే గొప్ప వారు

కలంలోన కవీంద్రులు


చెలిమిలోన చిన్నారులు

ఇలలోన శ్రీమంతులు

గమనిస్తే గొప్ప వారు

పొలంలోన హాలుకులు


గుణంలోన బహు శ్రేష్టులు

జనంలోన మహా ఘనులు

గమనిస్తే గొప్ప వారు

ప్రేమలోన కన్నవారు


మనసులోన కడు శుద్ధులు

జగతిలోన మహనీయులు

గమనిస్తే గొప్ప వారు

వారికెవరు సాటి రారు


ree














తాతయ్య సూక్తులు

---------------------------------------

మంచిదైతే యోచన

కుటుంబాల్లో దీవెన

శుభములెన్నో తెచ్చే

అభివృద్ధికది వంతెన


గొప్పదైతే తలపు

జీవితాల్లో మలుపు

నూటికి నూరు శాతం

వచ్చితీరునోయ్! గెలుపు


ఉన్నతమైన భావన

అవుతుంది! ఉద్దీపన

పనికిరాని పనులతో

చేయకు కాలయాపన


ఇక చేయి చేయి కలుపు

సంఘీభావం తెలుపు

త్యాగానికి చిహ్నమే

స్ఫూర్తి, కీర్తినిచ్చు ఎరుపు

***

-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page